వివిధ మతాలు, వివిధ దేశాలలో వినాయకుని ప్రస్తావన


9వ శతాబ్దానికి చెందిన వినాయక విగ్రహం - పంబన్ మందిరం, జావా, ఇండొనేషియా (Source: Ravn-Wikipedia)
·      వాణిజ్య, ధార్మిక సంబంధాల కారణంగా ఆగ్నేయాసియాలో అనేక హిందూదేవతల పూజా సంప్రదాయాలు నెలకొన్నట్లే వినాయకుని పూజించడం కూడా అందిపుచ్చుకొన్నారు.ఇది ప్రధానంగా 10వ శతాబ్దంలో జరిగింది. ముఖ్యంగా వ్యాపారులు పూజించే దేవతామూర్తులలో వినాయకుడు ముఖ్యుడుగా ఉన్నాడు.
·       మలయా ద్వీపకల్పంలోని అనేక భాగాలలో వినాయకుని విగ్రహాలు లభించాయి. ముఖ్యంగా శైవాలయాలలో వినాయకుని పూజ కూడా సర్వసాధారణం. వినాయకుని మూర్తి చిత్రీకరణలో స్థానిక సంస్కృతి ప్రభావం బాగా కనిపిస్తుంది. క్రమంగా ఈ సంస్కృతి బర్మా, థాయిలాండ్, కంబోడియాలకు విస్తరించింది. ఇప్పుడు ప్రధానంగా బౌద్ధ సమాజమైన థాయిలాండ్‌లో వినాయకుడు విఘ్ననివారకునిగా పూజలందుకొంటున్నాడు.
·       ఆఫ్ఘనిస్తాన్‌లో ఇస్లాం ప్రవేశించడానికి ముందుగా హిందూ, బౌద్ధ సంస్కృతుల ప్రభావం బాగా ఉండేది. ఆ కాలానికి చెందిన కొన్ని గణేశ విగ్రహాలు లభించాయి.
·       మహాయాన బౌద్ధంలో వినాయకుని స్వరూపం కొన్నిసార్లు బౌద్ధ దేవతగా కూడా చూపబడింది. గుప్తుల కాలం చివరిభాగంలోని బౌద్ధ శిల్పాలలో వినాయకుని శిల్పాలున్నాయి.బౌద్ధ దేవతగా వినాయకుడు అధికంగా నృత్యముద్రలో చూపబడ్డాడు. ఉత్తర భారతదేశం, నేపాల్, టిబెట్‌లలో ఈ రకమైన చిత్రాలు లభించాయి.నేపాల్‌లో వినాయకుని హేరంబునిగా ఆరాధిస్తారు. ఈ రూపంలో వినాయకునికి ఐదు తలలు ఉంటాయి. వాహనం సింహం.టిబెట్టులో వినాయకుని చిత్రీకరణ tshogs bdag అనబడింది. దేవునిగాను, మరికొన్ని చోట్ల విఘ్ననివారకునిగా చూపారు.
·       కొన్ని వైవిధ్యాలతో వినాయకుడు చీనా, జపాన్ సంప్రదాయాలలో కూడా దర్శనమిస్తాడు. ఉత్తర చైనాలో 531 సంవత్సరానికి చెందిన ఒక విగ్రహం లభించింది.జపాన్‌లో 806 కాలంలో వినాయకపూజ గురించి ప్రస్తావించినట్లు ఆధారం లభించింది.
·       జైన గ్రంథాలలో గణేశపూజ ప్రస్తావింపబడలేదు కాని చాలామంది జైనులు వినాయకుని పూజిస్తారు. వారు కుబేరుని కొన్ని లక్షణాలు వినాయకునికి ఆపాదించినట్లు అనిపిస్తుంది. వ్యాపార వృత్తులలో జైనులు అధికంగా పాల్గొనడం ఇక్కడ గమనించాలి. 9వ శతాబ్దానికి చెందిన జైన గణేశ విగ్రహం ఒకటి లభించింది. రాజస్థాన్, గుజరాత్‌లలో జైనమందిరాలలో వినాయక విగ్రహాలున్నాయి.
"నర్తించే గణపతి. సెంట్రల్ టిబెట్. 15వ శతాబ్దం ఆరంభకాలపు చిత్రం. వస్త్రంపై అద్దిన చిత్రం. ఎత్తు: 68 సెంటీమీటర్లు". ఈ స్వరూపాన్ని "మహారక్త" అని కూడా అంటారు.
 
 
 
 
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి 
 

 

Comments

Popular Posts