ప్రాచీన కాలం నుంచి ఇప్పటివరకు వినాయకుని రూపం,స్వరూపం గురించి వివిధ భావనలు


·   భారతీయ శిల్ప, చిత్ర కళలలో వినాయకుని మూర్తీకరణ విస్తృతంగా, చాలా వైవిధ్యంతో కనిపిస్తుంది. కాల క్రమంలో వినాయకుని చిత్రించే, శిల్పించే విధానం మారుతూ వస్తున్నది. నిలబడినట్లుగాను, నృత్యం చేస్తున్నట్లుగాను, రాక్షసులతో యుద్ధం చేస్తున్నట్లుగాను, కుటుంబంలో బాలునిగా ఆడుకొంటున్నట్లుగాను, నేలపై కూర్చున్నట్లు, సింహాసనాశీనుడైనట్లు - ఇలా వివిధ సన్నివేశాలలో గణపతి శిల్పాలు, చిత్రాలు కనిపిస్తుంటాయి.
· క్రీ.శ. 2వ శతాబ్దం నాటికి శ్రీలంకలో వినాయకుడి విగ్రహాలు ఉన్నట్లు తెలుస్తున్నది. మిహింతలెలోని కంటకచైత్యంలో లభించిన వినాయక విగ్రహం క్రీ.పూ. 1వ శతాబ్దానికి చెందినదని అంచనా వేశారు. మనకు లభించిన గణేశ విగ్రహాలలో ఇదే అత్యంత పురాతనమైనది. ఇందులో ఒకే దంతం కలిగిన మరుగుజ్జు, ఇతర మరుగుజ్జులతో పరివేష్టింపబడినట్లుగా చూపబడింది.
· 6వ శతాబ్దం నాటికి భారతదేశంలో వినాయకుని విగ్రహాలు సాధారణమయ్యాయి. వినాయకుడు ఒక ప్రత్యేకమైన దేవునిగా గుర్తింపబడిన తరువాత, వినాయక పూజా సంప్రదాయం స్థిరపడిన తరువాత - అంటే 900-1200 కాలం తరువాత - వినాయకుని ఆకారం సాధారణంగా క్రింద చూపిన విగ్రహంవలె ఉంటూ వచ్చింది. ఏనుగు తల, బానపొట్ట, ఒకచేత విరిగిన దంతం, మరొకచేతిలో ఉన్న లడ్డూను స్పృశిస్తున్న తొండం - ఇవి సాధారణంగా కనిపించే చిహ్నాలు. 

·  ఎల్లోరా గుహలలో మరింత పురాతనమైన (7వ శతాబ్దానికి చెందిన) గణేశ విగ్రహం లభించింది కాని అందులో చేతుల చిహ్నాలు స్పష్టంగా తెలియడంలేదు. సాధారణంగా వినాయకుని విగ్రహాలలోని పైచేతులలో ఒకచేత అంకుశం మరొక చేత పాశం కనిపిస్తాయి. క్రింది చేతులలో ఒకచేత దంతం, మరొకచేత లడ్డూ ఉన్నట్లు చూపుతారు. ఆధునిక రూపాలలో దంతం ఉన్న చేతిబదులు అభయముద్రలో ఉన్న చేతిని చూపుతున్నారు. నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే చూపుతుంటారు.


  నృత్యం చేస్తున్నట్లున్న గణపతి మూర్తులలో కూడా నాలుగు చేతులను ఇలానే      చూపుతుంటారు.
·       ఆదినుండి వినాయకుడిని ఏనుగు తలతోనే చిత్రీకరిస్తున్నారనిపిస్తున్నది. ఇలా ఏనుగు తల ఉండడానికి అనేక పురాణ గాథలున్నాయి. "హేరంబ గణపతి"ని ఐదు తలలతో చూపుతారు.
Source: Exotic India

· వినాయకునికి ఏక దంతుడుఅన్న పేరు మొదటినుండి ఉంది. చాలా పురాతనమైన విగ్రహాలలో కూడా వినాయకుడు తన విరిగిన దంతాన్ని చేతబట్టుకొన్నట్లుగా చూపారు.
·      ముద్గల పురాణం ప్రకారం వినాయకుని రెండవ అవతారం "ఏకదంతావతారం". అలాగే పెద్ద పొట్టకూడా మొదటినుండి (గుప్తుల కాలంనుండి) వినాయకుని శిల్పాలలో కనిపిస్తున్న అంశం. 
·       ముద్గల పురాణంలో చెప్పిన రెండు అవతారాలు (హేరంబుడు, మహోదరుడు) ఈ పెద్దపొట్ట అనే అంశంయొక్క ప్రాముఖ్యతను సూచిస్తున్నాయి. భూత, భవిష్యత్, వర్తమాన కాలాలకు చెందిన సకల జగత్తూ తన ఉదరంలో ఉంచుకొన్నందున అతనికి "లంబోదరుడు" అనే పేరు వచ్చిందని బ్రహ్మాండ పురాణములో ఉంది.
·   వినాయకునికి రెండు చేతులనుండి, 16 చేతుల వరకు చూపుతారు. సాధారణంగా నాలుగు చేతులతో శిల్పాలు, చిత్రాలు చేస్తారు. పురాతనమైన విగ్రహాలలో మాత్రం రెండు చేతులనే చూపారు. 9, 10వ శతాబ్దాలలో 14 నుండి 20 చేతులవరకు ఉన్న ప్రతిమలు చెక్కారు.
Source:Pinterest
·  వినాయకుని చిత్రీకరణలో పాము కూడా చాలా సాధారణంగా కనిపిస్తుంది. ఇది అనేక విధాలుగా చూపబడుతుంది. గణేశ పురాణము ప్రకారము వినాయకుడు వాసుకి (పాము) ని తన కంఠానికి చుట్టుకొన్నాడు. మరి కొన్ని మూర్తులలో పాము యజ్ఞోపవీతంగా చూపబడింది.  ఇంతే కాకుండా పాము ఉదరాభరణంగా (బెల్టులాగా), చేతిలో ఉన్నట్లుగా, కాళ్ళవద్ద చుట్టుకొని ఉన్నట్లుగా, సింహాసనంగా - ఇలా అనేక విధాలుగా చూపబడింది.
Source:Pinterest
·     వినాయకుడి నుదురుమీద తిలకం, కొన్ని సార్లు మూడవ నేత్రం చూపుతారు. గణేశ పురాణం ప్రకారం వినాయకుని తలమీద తిలక చిహ్నం మరియు చంద్రవంక కూడా ఉంటాయి. ముఖ్యంగా "బాలచంద్ర వినాయకుడు" అనే రూపంలో చంద్రవంకను చూపుతారు
Source: AskGanesh


· వినాయకుని వివిధ రూపాలకు వివిధ వర్ణాలు ఆపాదింపబడ్డాయి. వీటిని గురించి శ్రీతత్వనిధి అనే శిల్పగ్రంధంలో చెప్పబడింది. ఉదాహరణకు హేరంబ గణపతిని మరియు ఋణమోచన గణపతిని తెలుపు రంగులోను, ఏకదంత గణపతిని నీలిరంగులోను, దుర్గాగణపతిని బంగారు వర్ణంలోను, సృష్టిగణపతిని ఎరుపు రంగులోను చూపుతారు.


దేశవిదేశాల్లో లభించిన కొన్ని పురాతన గణపతి విగ్రహాలు మరియు చిత్రాలు:
 
5వ శతాబ్దికి చెందిన పాలరాతి వినాయక విగ్రహం.  గర్దెజ్, ఆఫ్ఘనిస్తాన్లో లభించింది. ప్రస్తుతం కాబూల్ "దర్గా పీర్ రత్తన్ నాథ్"లో ఉంది. - విగ్రహ పీఠంపై ఇలా వ్రాసి ఉంది "మహావినాయకుని గొప్ప సుందర మూర్తి"- షాహి రాజు ఖింగలునిచే ప్రతిష్ఠింపబడింది.9వ శతాబ్దానికి చెందిన వినాయక విగ్రహం-పంబన్ మందిరం, జావా, ఇండొనేషియాSource            ‘13వ శతాబ్దానికి చెందిన గణేశ విగ్రహం మైసూర్ జిల్లా, కర్ణాటక


               సింహాచలం లో వినాయక విగ్రహం (Source)


     ‘నర్తించే గణపతి’, సెంట్రల్ టిబెట్. 15వ శతాబ్దం ఆరంభకాలపు చిత్రం. వస్త్రంపై అద్దిన చిత్రం. ఎత్తు: 68 సెంటీమీటర్లు. ఈ స్వరూపాన్ని "మహారక్త" అని కూడా అంటారు.


     చతుర్భుజ గణపతి - నూర్పూర్ శైలి చిత్రం 1810 కాలానికి చెందినది.


   వినాయకునికి స్నానం చేయిస్తున్న పార్వతీ పరమేశ్వరులు - 18వ శతాబ్దం కాలపు కాంగ్రా శైలి చిత్రం - అలహాబాదు మ్యూజియంలో ఉన్నది

Comments

Popular Posts