జీయర్ స్వాములను, మరికొందరు స్వాములను "ఏకదండి" , "ద్విదండి" , "త్రిదండి" స్వాములు అని పిలుస్తారు.....అంటే అర్ధం ఏమిటి ?


జీయర్ స్వాములు, మరికొందరు స్వాముల చేతిలో పొడవాటి కర్రలు ఉంటాయి గమనించారా? ఎళ్లవేళలా అవి వారి చేతిలో ఉంటాయి. ఊతకోసమా అంటేకాదు. మరి వాటిని ఎప్పుడు చేత పట్టుకోవడానికి గల కారణం గురించి తెలుసుకుందాం. వైరాగ్యానికి, తాత్వికతకు, ద్వైత, అద్వైత భావానికి గుర్తుగా ఈ పొడవైన కర్ర పట్టుకుంటారు సన్యాసులు.
ఈ కర్రలు వివిధ ఆకారాలలో ఉంటాయి. ప్రతీదానికి ఓ అర్ధం ఉంది. ' Y' ఆకారంగల యోగదండాన్ని, కమడలాన్ని పట్టుకొని ఉండేవారిని 'తాపసులు' లేదా 'ఋషులు' అని అంటారు. గాలి,నీరు, భూమి, అగ్ని, ఆకాశం అనే పంచభూతాల సమ్మేళనమే మనిషి కాబట్టి ఐదడుగుల కర్రను కూడా ధరిస్తారు. ఇందులో ఏకదండి, ద్విదండి, త్రిదండి అనే మూడు విధాలు ఉన్నాయి.
·       ఒకే ఒక కర్రను ధరించి ఉండేవారు అద్వైత సిద్ధాంతాన్ని నమ్మేవారు, బోధించేవారు. అద్వైతం అనగా జీవుడు, దేవుడు ఒక్కటేననే సిద్ధాంతం (శ్రీ శంకరాచార్య సిద్ధాంతం) మనిషిలోనే దేవుడిని చూడమని. స్వర్గం, నరకం రెండూ ఇక్కడే ఉన్నాయి. అంతరాత్మకు విరుద్ధంగా అక్రమ మార్గాన, అన్యాయంగా సంచరించినా, ప్రవర్తించినా ఆ పాపఫలితాన్ని ఏదో ఒక రూపంలో ఇక్కడే తప్పకుండా అనుభవించక తప్పదు. ఈ అద్వైత సిద్దాంతాన్ని బోధించేవారి చేతిలో జ్ఞానానికి సంకేతమైన రావిచెట్టునుండి సేకరించిన ఒకే కర్ర ఉంటుంది.
·       రెండు కర్రలు కలిపి ఒక్కటిగాకట్టి ధరించి బోధనలు చేసేవారు ద్వైత సిద్ధాంతం కలవారు. వీరిని 'ద్విదండి ' స్వాములు అంటారు. వీరు జీవుడు, దేవుడు వేర్వేరు (రామానుజాచార్యుల మతం) అని బోధిస్తారు ద్వైత సిద్ధాంతానికి ఉన్న ప్రాచుర్యం అద్వైతానికి లేదు. ఈ మతానికి చెందినవారిని 'జీయరు'లని అంటారు.
·       మూడు కర్రలను ఒకే కట్టగా కట్టి భుజాన పెట్టుకునేవారు కూడా ఉన్నారు. వాళ్లు జీవాత్మ, పరమాత్మ, ప్రకృతి ఒకటే అనే నారాయణ తత్వాన్ని బోధిస్తూ ఉంతారు. వీరిది విశిస్టాద్వైతము . పొడవైన ఈ దండాలతో దుష్టప్రాణులనుండి రక్షణ కొరకు, ఫలఫుష్పాల సేకరణ చేసుకుంటూ భగవధ్యానం చేసుకుంటారు.
ఋషుల చేతిలో ఉండే 18 అంగులాల యోగదండం జపం చేయదానికి, ఆత్మరక్షణకు ఉపయోగపడుతుంది. యోగులు రుద్రాక్షమాల నేలపైబడకుండా 'Y' ఆకారంలో ఉన్న యోగదండంపై చేతినిపెట్టి జపమాల తిప్పుతుంటారు.
 

Comments

Popular Posts