అమ్మోరు అంటే ఎవరు? మనకు ఎంతమంది అమ్మోరులు ఉన్నారు? వారి పేర్లు ......

 
పార్వతి దేవీయే అమ్మోరు తల్లి (అమ్మవారు)గా గ్రామాలలో గ్రామదేవతయై గ్రామాలను రోగాల బారినుండి రక్షిస్తుందని బలమైన నమ్మకం.ఈ అమ్మోరులు మొత్తం 101 మంది అనీ, వారందరికీ ఒకే ఒక్క తమ్ముడు పోతురాజు అనీ అంటారు.  

మన గ్రామాలలోని అమ్మోరులలో కొందరు:
పాగేలమ్మ, ముత్యాలమ్మ, గంగమ్మ, గంగానమ్మ, బంగారమ్మ, గొంతెమ్మ, సత్తెమ్మ, తాళ్ళమ్మ, చింతాలమ్మ, ముత్యాలమ్మ, చిత్తారమ్మ, పోలేరమ్మ, మావుళ్ళమ్మ, మారెమ్మ, బంగారు బాపనమ్మ, పుట్టాలమ్మ, దక్షాయణమ్మ, పేరంటాళ్ళమ్మ, రావులమ్మ, గండి పోచమ్మ, మొగదారమ్మ, ఈరినమ్మ, దుర్గమ్మ, మొదుగులమ్మ, నూకాలమ్మ (అనకాపల్లి, విశాఖపట్నం జిల్లా), మరిడమ్మ, నేరెళ్ళమ్మ, ముసలమ్మ (మొయ్యేరు,అత్తిలిదగ్గర,ప.గోజిల్లా), మాచరమ్మోరు, అనపమ్మోరు, సోమాలమ్మ, పెద్దింట్లమ్మ, గుర్రాలమ్మ/గుర్రాలక్క (అంతర్వేది, తూ.గో.జిల్లా), అంబికాలమ్మ, దనమ్మ, మాలక్ష్మమ్మ, ఇటకలమ్మ, దానాలమ్మ, రాట్నాలమ్మ, తలుపులమ్మ (తుని, తూ.గో.జిల్లా), పెన్నేరమ్మ, వెంకాయమ్మ, గున్నాలమ్మ, ఎల్లమ్మ, పెద్దమ్మ, మంటాలమ్మ, గంటాలమ్మ, సుంకులమ్మ, జంబులమ్మ, పేరంటాలమ్మ, కంటికలమ్మ, వనువులమ్మ, సుబ్బాలమ్మ, అక్కమ్మ, గనికమ్మ, ధారాలమ్మ, మహాలక్ష్మమ్మ, లంకాలమ్మ, దోసాలమ్మ, పళ్ళాలమ్మ (వానపల్లి, తూ.గో.జిల్లా), ధనమ్మ, జోగులమ్మ/జోగులాంబ (ఆలంపూర్, జోగులాంబ  జిల్లా), పైడితల్లి, రావులమ్మ, బూరుగులమ్మ, చెంగాళమ్మ  (సూళ్లూరుపేట, నెల్లూరు జిల్లా), పోలమ్మ, కోటమ్మ (కోట, నెల్లూరు జిల్లా), కొండాలమ్మ, వెర్నిమ్మ, దేశిమ్మ, గరవాలమ్మ, గరగలమ్మ, దానెమ్మ, మహంకాలమ్మ, వీరుళ్ళమ్మ, మరిడమ్మ, ముళ్ళమాంబిక, యల్లారమ్మ, వల్లూరమ్మ, నాగులమ్మ, వేగులమ్మ, ముడియలమ్మ, పెద్దింట్లమ్మ, నంగాలమ్మ, చాగళ్ళామ్మ, నాంచారమ్మ, సమ్మక్క, సారలమ్మ, మజ్జిగౌరమ్మ, కన్నమ్మ- పేరంటళ్ళమ్మ, రంగమ్మ-పేరంటాలమ్మ, వెంగమ్మ-పేరంటాలమ్మ, తిరుపతమ్మ, రెడ్డమ్మ, పగడాలమ్మ, మురుగులమ్మ (బండారులంక, తూ.గో.జిల్లా), కుంచమ్మ, ఎరకమ్మ, పెద్దింట్లమ్మ, మరిడమ్మ, 
మసకపల్లమ్మ, వెలగలమ్మ, ఉర్లమ్మ తల్లి (గణపవరం, గూంటూరుజిల్లా), పైళ్లమ్మతల్లి, బళ్లమ్మ తల్లి, లోల్లాలమ్మ తల్లి, వూదలమ్మ తల్లి, కట్వలాంబిక, నాగాలమ్మ-నాంచారమ్మ తల్లి, సింగమ్మ తల్లి, ఘట్టమ్మ తల్లి, అంజారమ్మ తల్లి, యమలమ్మ (అక్కంపెట, మనుబోలు, నెల్లూరు జిల్లా)
 
 
తడికలపూడి గ్రామంలో గ్రామదేవత గుడి - ద్వారంపై ఇలా వ్రాసిఉన్నది "శ్రీ అంకాలమ్మ, గంగానమ్మ, మరియు 101 దేవతలు ఉండు ఆలయం"
 
 

Comments

Popular Posts