రావిచెట్టుని ఇంట్లో పెంచకూడదు. ఎందుకు?
శాస్త్రాల ప్రకారం రావిచెట్టు విష్ణుస్వరూపం. శనిదోషాలు పోగొడుతుంది.
అందువల్లే ఆలయాల్లో రావిచెట్టు చుట్టూ ప్రదక్షిణలు చేస్తారు. అయితే రావిచెట్టు ఇంట్లో
పెంచకూడదని పెద్దలు అనాదిగా చెబుతున్నా,దీనికి ఆధ్యాత్మిక కారణాలేవీ లేవు.
అయితే సామాజిక కారణాలు మాత్రం ఉన్నాయి. రావిచెట్టు చాలాకాలం
ఉంటుంది. పైగా అది పెరిగేకొద్దీ దాని వేళ్లు దృఢపడి భూమిలోపల చాలా దూరం బలంగా పాకుతాయి.
దానివల్ల పునాదులు దెబ్బతిని ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉంది. అలాగే రావి చెట్టు భారీ
వృక్షంగా పెరుగుతుంది కాబట్టి వాటిమీద పక్షులు గూళ్లు కట్టి, గుడ్లు పెడతాయి. వాటికోసం
పాములు వచ్చే ప్రమాదం కూడా ఉంది. అందుకే రావిచెట్టును ఇంట్లో పెంచవద్దని చెబుతారు.
వాస్తవానికి రావిచెట్టే కాదు, ఏ పెద్ద చెట్టును పెంచినా ఈ సమస్య వస్తుంది.
Comments
Post a Comment