రామాయణ ఘట్టానికి ముందు, హనుమంతుడు ఎవరి కొలువులో మంత్రిగా చేసేవారు?


హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు.నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతునకిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ కూడా కథ. 

హనుమంతుని  విద్య  ముగిసిన  తరువాత గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. అప్పుడు వానరులకు ఋక్షరజనుడు రాజై కిష్కంధను రాజధానిగా చేసుకొని పాలించేవాడు. అతనికిద్దరు కొడుకులు. వాలి సుగ్రీవులు. వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా ఆంజనేయుడు కొలువులో చేరాడు. 

ఒక  మనస్పర్ధ  కారణముగా  వాలి సుగ్రీవులకు వైరం  పెరిగి సుగ్రీవుని   చంపడానికి సిధ్ధమవుతాడు వాలి. ఇక ఆ వానర రాజ్యం లో  ఉంటే ప్రమాదమని భావించి సుగ్రీవుడు అరణ్యాలకు పారిపోతాడు. తన జాడ వాలికి తెలిసినప్పుడల్లా వేరే తావుకు పారిపోయి తల దాచుకొనేవాడు. సుగ్రీవునికి కష్టకాలంలో ఉన్న నలుగురు మంత్రులలో హనుమంతుడు ఒకడు. 

 
 
హనుమంతుడి మంత్రిత్వం:
నిజానికి వాలి కంటే హనుమంతుడు బలవంతుడు. మునుల శాపం వల్ల తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ప్రతీ రోజు ప్రాణ భయంతో విలపిస్తూన్న సుగ్రీవుడితో ఒక రోజు ఇలా అన్నాడు "మీ అన్న ఒక సారి దుందుభి అన్న రాక్షసుడిని చంపాడు. వాలి అతన్ని ఎత్తి పడవేయగా ఋష్యశృంగ పర్వతం మీద తపస్సు చేస్తూన్న మతంగ మహర్షి మీద ఆ కళేబరం పడింది. కోపంతో మతంగ ముని ఈ పర్వతనికి వాలి వస్తే తలపగిలిచస్తావని శపించాడు. మీ అన్న అక్కడకు రాడు. మనం అక్కడ ఉండడం ఎంతో క్షేమం" అని హనుమంతుడు సుుగ్రీవునికి చెబుతాడు.ఆ సలహా సుుగ్రీవునికి నచ్చి, హనుమంతుడిని మెచ్చుకొని అక్కడ సుఖంగా ఉండసాగాడు.
 
 

Comments

Popular Posts