మనం అసలు జీవిస్తున్నామా లేక బ్రతుకుతున్నామా ?-ఒక వైద్యుని ఆలోచన : తప్పక చదవండి


ఆ రోజులలో - ఈ రోజులలో ( మార్పు ) ....

·       ఈ వృత్తి మొదలు పెట్టిన రోజులలో అంటే 20 సంవత్సరాలు వెనకకి వెడితే , ముసలి తల్లి తండ్రులను తీసుకుని వారి కొడుకులు ఆసుపత్రి (hospital) కి వచ్చేవారు . గత 5 లేదా 6 సంవత్సరాలు గా కొడుకు కు heart attack వచ్చింది అని ముసలి తల్లి తండ్రులు తీసుకు వస్తున్నారు . వీటికి కారణం ఒత్తిడి , డబ్బు వెనక మీ పరుగు .

·       కొన్ని విషయాలు బాగా గుర్తు పెట్టుకోండి

·       Pool View , Lake View .... అంటూ అమ్మేవాడు ఒకటికి రెండింతలు చెప్పి మీతో ఇళ్ళు కొనిపిస్తే ఆ ఇంటి అప్పు తీర్చడానికి రోజులో ఎక్కువ భాగం ఇంటి బయట గడుపుతున్నారు. తస్మాత్ జాగ్రత్త . నలుగురికోసం లేదా మీ చుట్టూ ఉన్న సంఘం కోసం ఇంటిని కొనకండి.

·       ఇంటికి వఛ్చిన నలుగురు కూర్చుని మీ sofa set ని ఒకటికి రెండు సార్లు పొగడాలి అనే ఉదేశ్యం తో కొన్న sofa set లో నువ్వు తప్ప అందరూ కూర్చుని ఆనందిస్తారు . తస్మాత్ జాగ్రత్త .
నలుగురికోసం లేదా మీ చుట్టూ ఉన్న సంఘం కోసం sofa బరువు మొయ్యకండి .

·       ప్రొదున్న లేదా సాయంత్రం మీరు మీ కోసం 30 నిమిషాలు సమయం వెచ్చించండి . కళ్ళు మూసుకుని వేరే ఆలోచనలు కి స్వస్తి చెప్పి మీకు ఇష్టమైన దేవుడిని తలుచు కుంటూ లేదా మీ చుట్టూ ఉన్న ప్రకృతి ని చూస్తూ , లేదా మీకు ఇష్టమైన సంగీతం వింటూ సమయం గడపండి

·       ఇక పోతే భోజనం అనేది మీరు మీ కోసం చేసే కార్యక్రమాలలో అతి ముఖ్యమైనది . సాధ్యమైన వరకు ప్రశాంతం గా , నిమ్మాది గా మంచి ఆహారం తీసుకోండి. ఇష్టమైన పదార్ధం మళ్ళీ మళ్ళీ వేసుకుని తినకుండా ఒక పద్దతి ప్రకారం తిని పొట్ట లోపల నీటి కి , వాయువుకి తగినంత స్థలం ఉండేటట్లు గా పొట్ట పట్టినంత తినకుండా ఉండాలి

·       కనీశం ఒక రెండు మూడు గంటలు సమయం అయ్యాకా అప్పుడు నిద్ర పోయి మీ ఇంద్రియాలకి విశ్రాంతి ఇవ్వాలి. ఆ తరువాత సూర్యోదయాత్పూర్వమే మేలుకొని వ్యాయామము , ఇతర దైనందిక కార్యక్రమములు చేసి , పరిపూర్ణమైన స్నానం చెయ్యాలి ,

·       పరిపూర్ణ స్నానము వలన ధాతు పుష్టి , తేజస్సు , బలము కలిగి , సోమరితనము తొలగి దీర్గాయువు కలుగును

·       ఉన్నత ఆసనము మీద సమ దేహుడై సుఖముగా కూర్చుని , యుక్తి కాలమున , ఆకలిని బట్టి వేడి గా ఉన్న , చమురు గలిగిన ( ఆవు నెయ్యి , నువ్వుల నూని ... ) పదార్ధము మితముగా తినవలెను.

·       భోజనానంతరము నూరు ( 100 ) అడుగులు నడిచిన అన్నము యుక్త స్థానము చేరి అన్ని స్థానములలో బలము కలిగి సుఖము కలుగును .

·       ఆఫీస్ లో చాలామంది , భార్య పిల్లలు ఫోటో లు పెట్టుకుంటారు . వారితో పాటు మిమ్మల్ని కనీ పెంచి , పెద్దచేసి న మీ తల్లి తండ్రులు ఫోటో కూడా పెట్టుకోండి . ఎప్పుడైనా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకు వచ్చి , మీ ఆలోచన దారి మళ్ళి మీకు కాస్త ఆఫీస్ విషయాల ఆలోచనల ఒత్తిడి నుండీ నుండీ కాస్త ఉపశమనం దొరుకుతుంది.

·       అవసరం ఉన్నా లేకపోయినా కనీశం గంటకు ఒకసారి 5 నిమిషాలు లేచి ఇటు అటు తిరిగి మళ్ళీ వచ్చి కూర్చోండి . దీనివలన రక్త ప్రసరణ పెరిగి మీకు ఒకరకమైన ఉల్లాసాన్ని ఇస్తుంది.

·       మన తిండి , మన నిద్ర ఈ రెండు కూడా చాలా ముఖ్యం . మనం తినే తిండికి ప్రాధాన్యత ఇవ్వకుండా "ఫాస్ట్ ఫుడ్ సెంటర్ " లో ఫాస్ట్ గా తిని నిద్ర పోవలసిన సమయం లో నిద్ర పోకుండా ఆలస్యం గా నిద్ర పోతే , గుండె తట్టుకోలేక గుండె పోటు వస్తే అప్పుడు తల్లి తండ్రులు తల్లడిల్లు పోతు మిమ్మల్ని ఆసుపత్రి కి తీసుకు రావలసిన అగత్యం వస్తుంది. ప్రస్తుత పరిస్థితి ఇలాగే ఉంది తస్మాత్ జాగ్రత్త.

ఆఖరు గా ......

·       జీవితం అనేది ఒక గొప్ప అవకాశం.

జీవించడం అనేది ఆ అవకాశం సద్వినియోగం చేసుకోవడమే
అనవసర పరుగులు పెట్టి , ఆ జీవించడం అనే అవకాశాన్ని వదులుకోకండి
ఆఫీస్ ని , మీ భార్యా పిల్లలిని ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించండి
మీ కోసం , మీ తల్లి తండ్రులు కోసం , మీ స్నేహితులు కోసం , ... ఆ తరువాత వీలైతే సమాజం కోసం కూడా ఆలోచించండి

·       ఒక వైద్యుడి గా , ఈ రోజు మీ అందరి ముందుకు వచ్చి నేను చేతులు జోడించి వేడుకునేది ఒక్కటే.

·       దయ ఉంచి .. . దయ ఉంచి ..... మళ్ళీ దయ ఉంచి ... . మీరు ధనార్జన , పదవి కోసం అనవసర పరుగులు పెట్టి , ఒత్తిడి కి లోనై , మీ తల్లితండ్రులు మిమ్మల్ని hospital కి పరుగులు పెడుతూ తీసుకువచ్చే పరిస్థితి తీసుకురాకండి.

·       మంచి ఆలోచనలతో , ప్రశాంత చిత్తులై , న్యాయం గా ధనార్జన చేస్తూ , మీరు ఆనందం గా ఉంటూ , మీ ఉద్యోగానికి న్యాయం చెయ్యండి . దాని ద్వారా మీ భార్య పిల్లలు , తల్లి తండ్రులు అందరు ఆరోగ్యం గా ఆనందం గా ఉంటారు . మొత్తానికి మన చుట్టూ ఉన్న సంఘం ఆరోగ్యం గా ఉంటుంది . అప్పుడు మా వృత్తి లో మాకు కూడా కొద్దీ గా విశ్రాంతి వస్తుంది . ( ... ... నవ్వులు ) . ఇదే మన సనాతన ధర్మం చెప్పింది .

సత్యం దమ స్థాప స్సౌచం | సంతోషో హ్రీ : క్షమార్జవం :

జ్ఞానం శుమో దయా ధ్యానం | ఏష ధర్మ స్సనాతనః

సత్యము , ఇంద్రియ నిగ్రహము , , తపము శుచి , సంతోషము లజ్జ , ఓర్పు , ఋజుత్వము , జ్ఞానము , మనోనిగ్రహము , దయ , ధ్యానము వీటిని కలిగియుండడమే ముఖ్యం . ఇదియే సనాతన ధర్మము.

·       ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అతివేగం తో బైక్ మీద వెడుతుంటే ఆక్సిడెంట్ అయ్యింది . వేడి వేడి silencer గొట్టము మెడ ఇటునుండి అటు వైపు కి వచెసింది . చాలా complicated కేసు. ఆ తల్లితండ్రులు వెయ్యి దేవుళ్ళకీ మొక్కుతూ మా కోసం ఎదురు చూస్తున్నారు . ఆ భగవంతుడు ఈ చేతులు ద్వారా అన్ని సవ్యం గా చేయించి వారి మోహములో ఆనందము చూస్తే , నా వృత్తి కి నేను ఈ రోజుకు న్యాయం చేసాను అని అనుకుని ఆనందంగా ఇంటికి వెడతాను .

·       గుర్తు పెట్టుకోండి- దయ ఉంచి మీ career aspiration పరుగులతో మీ తల్లి తండ్రులని పరుగులు పెట్టించకండి . సాధ్యమైన వరకు ఈ రోజు జీవంచండి . రేపటి కోసం పరుగులు వధ్ధు .
Shared by SathyaKaja

 

Comments

Popular Posts