శనివారం నాడు 'శనీశ్వరుడిని' ఎలా పూజిస్తే ఏలినాటిశని, అర్ధాష్టమ శని, ఈతి బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది?


శనిదేవుడిని 'శని' అని పిలవకుండా (పొరబాటున కూడా నిందించకుండా) 'శనీశ్వరా' అని పిలవడం ద్వారా గ్రహదోషాల నుంచి విముక్తి పొందవచ్చునని ఆధ్యాత్మిక పండితులు అంటున్నారు. శనివారం పూట శనీశ్వరుడిని పూజిస్తే ఏలినాటిఅష్టమ శనిదోషాలు తొలగిపోతాయి.  శనివారం పూట శనీశ్వరునికి ప్రీతికరమైన నువ్వుల నూనెనల్లటి నువ్వులునీలపు శంఖు పుష్పాలునల్లని వస్త్రంతో పూజిస్తే.. వారికి మృత్యుభయంఅనారోగ్యం కలుగవు. ఈతిబాధలు తొలగుతాయి. సుఖశాంతులుఅష్టైశ్వర్యాలు, సకలసౌభాగ్యాలు చేకూరుతాయి. ఇంకా శనివారంశనిత్రయోదశి నాడు శనీశ్వరునికి  నువ్వులనూనెతో అభిషేకం చేసినా ఆ స్వామికి ఇష్టమైన నువ్వులునల్లటి వస్త్రం వంటివి దానం చేస్తే .. ఏలినాటిశనిఅర్ధాష్టమ శని బాధల నుంచి ఉపశమనం కలుగుతుంది.
ఓం ఐం హ్రీం శ్రీ శనైశ్చరాయ నమః
ఓం భ్రాం భ్రీం భ్రౌం సః శనయే నమః

Comments

Popular Posts