ఆదివారం రోజు మరియు రాత్రిళ్ళు ఉసిరికాయ తినకూడదని పెద్దలు చెబుతుంటారు.ఎందుకు ?

 
అందరూ అమితంగా ఇష్టపడే ఉసిరికాయలను, ఉసిరికాయ  పచ్చడిని ‘ఆదివారం’ నాడు  తినకూడదని పెద్దలు చెబుతుంటారు. రాత్రి సమయాల్లో కనీసం ఆ పేరును కూడా పలకకూడదని అంటూ వుంటారు. అయితే అందుకు గల కారణం ఏమిటంటే......
·       సాధారణంగా రాత్రి సమయాల్లో ఉసిరిచెట్లపై సర్పాలు ఉంటూ వుంటాయి  అప్పుడు  ఉసిరికాయలను కోయడము ప్రమాదము.. ఆ సమయంలో ఉసిరికాయలను గురించి మాట్లాడుకుంటే, ఆ సర్పాలకు ఆహ్వానం పలికినట్టుగా అవుతుందనే విశ్వాసం పూర్వకాలం నుంచి వుంది.
·       ఇక రాత్రి సమయాల్లో శరీర ఉష్ణోగ్రత తక్కువగా వుంటుంది. అలాంటి సమయంలో మరింత చలువచేసే ఉసిరికాయను తినడం వలన అనారోగ్యం కలుగుతుందని అంటారు.
·       అలాగే రవికి – శుక్రుడికి గల శత్రుత్వం గురించి తెలిసిందే. ఉసిరికాయలోని ఆమ్లగుణం శుక్రుడికి చెందినది కనుక, రవివారమైన ఆదివారం రోజున ఉసిరికాయ తినకూడదని, ఉసిరికాయ గురించి మాట్లాడకూడదని పెద్ద్దలు చెబుతుంటారు.

Comments

Popular Posts