విఘ్నేశ్వరుడికి ఎలుక ఒక్కటే కాదు....ఇతర వాహనాలూ ఉన్నాయి.అవేమిటి?
· ముద్గలపురాణంలో వినాయకుని ఎనిమిది అవతారాలు
చెప్పబడినాయి. (వక్రతుండ,
ఏకదంత, మహోదర, గజవక్త్ర,
లంబోదర, వికట, విఘ్నరాజ,
ధూమ్రవర్ణ అవతారాలు). ఆ ఎనిమిది అవతారాలలో ఐదు అవతారాలకు వాహనం ఎలుక.
వక్రతుండ అవతారం వాహనం సింహం. వికట అవతారం వాహనం నెమలి. విఘ్నరాజ
అవతారం వాహనం శేషువు.
· గణేశ పురాణంలో నాలుగు అవతారాలు ప్రస్తావింపబడినాయి.
అందులో మహోటక అవతారం వాహనం సింహం. మయూరేశ్వర అవతారం నెమలి.
ధూమ్రకేతు అవతారం గుర్రం. గజాననుని అవతారం ఎలుక.
· జైనుల సంప్రదాయాలలో గణేశునికి ఎలుక, ఏనుగు,
తాబేలు, పొట్టేలు, నెమలి వాహనాలు వివిధ సందర్భాలలో చెప్పబడినాయి. (చూపబడినాయి)
· లిఖిత గ్రంథాలలో మత్స్య పురాణములో మొట్టమొదటగా ఎలుక
వాహనం గురించి వ్రాయబడింది.
· తరువాత బ్రహ్మాండ పురాణము, గణేశ పురాణములలో ఈ విషయం ఉంది. చివరి
అవతారంలో ఎలుకను వాహనంగా చేసుకొన్నట్లు గణేశపురాణంలో ఉంది.
· గణపతి అధర్వశీర్షం అనే గ్రంథంలో ఒక ధ్యాన శ్లోకం
ప్రకారం వినాయకుని ధ్వజం మీద ఎలుక ఉంటుంది.
· గణపతి సహస్రనామాలలో
"మూషిక వాహన", "అఖుకేతన" అనే
పేర్లున్నాయి.
· ఎలుక వాహనం సంకేతాన్ని అనేకవిధాలుగా వివరిస్తారు - ఎలుక
తామస ప్రవృత్తికి చిహ్నం. కనుక కామక్రోధాలను అణగ ద్రొక్కడం అనగా ఎలుకపై స్వారీ
చేయడం.
· పంటలకు హాని కలిగించే ఎలుకను అదుపు చేయడం అనగా విఘ్నాలను
నివారించడం అని మరొక వివరణ ఉంది. ఇది గ్రామదేవత లక్షణాలలో ఒకటి.
· ఎలుకనెక్కినందున వినాయకుడు ఎక్కడికైనా వెళ్ళగలడని
(సర్వాంతర్యామి) మరొక అభిప్రాయం ఉంది.
Comments
Post a Comment