"ఆల్టాసోనిక్" వైద్య చికిత్సా విధానానికి,క్యాన్సర్ కణాల నిర్మూలన కి క్రీ.పూ.8వ శతాబ్దము లోనే సిధ్ధాంతాలను ప్రతిపాదించిన 'చరకుడు' రచించిన " చరక సంహిత" గ్రంధంలో ఏయే విషయాలు గురించి చెప్పారు?


 
చరకుడు రచించిన చరక సంహిత భారతీయ సంప్రదాయిక వైద్యవిధానమైన ఆయుర్వేదంలో శుశృత సంహితతో కలిపి ప్రాచీనమైన గ్రంథాల్లో ఒకటి. ప్రాచీనతతో పాటుగా ఇది ఆయుర్వేదంలో రెండు మౌలికమైన గ్రంథాల్లో ఒకటి.దీని ప్రాచీనమైన ప్రతులలో క్రీ.పూ.900 - క్రీ.పూ.700 నాటివి కూడా దొరుకుతున్నాయి. ఐతే మిగిలిన చరక సంహిత ప్రతులు తర్వాత శతాబ్దాలవి దొరుకుతున్నాయి.

చరక సంహిత ఉద్యేశం

“జీవితం నాలుగు రకములు: సుఖ (ఆనందము), దుఃఖ (విచారం), హిత (మంచి) మరియు  అహిత (చెడు).”
—చరక సంహిత అధ్యయనం 1.1, 1.30 

చరక సంహిత గ్రంధంలోని విషయాలు :
మొత్తం గ్రంథంలో ఎనిమిది స్థానాలు(విభాగాలు), 120 అధ్యాయాలు ఉన్నాయి. ఆ విభాగాలు ఇవి:

1.     సూత్ర (సాధారణ నియమాలు) - 30 అధ్యాయాల్లో ఆరోగ్యకరమైన జీవితం, ఔషధాల సేకరణ-వాటి ఉపయోగాలు, రోగనివారణలు, ఆహారనియమాలు, వైద్యుని బాధ్యతలు ఉన్నాయి.
2.    నిధాన (రోగ విజ్ఞాన శాస్త్రం) - 8 అధ్యాయాలు ఎనిమిది ప్రధానమైన రోగాలు వచ్చే స్థితిగతులను, రోగాల వివరాలను తెలియపరుస్తాయి.
3.    విమాన (నిర్దిష్టమైన నిర్ణయం) - 8 అధ్యాయాలు రోగ విజ్ఞానశాస్త్రం, వివిధ రోగనిర్ధారణ విధానాలు, వైద్యవిద్య, వైద్యవిద్యార్థుల ప్రవర్తన నియమావళి కలిగివుంటాయి.
4.    శరీర (అనాటమీ) - 8 అధ్యాయాల్లో మానవుల అండోత్పత్తి, అవయవ విజ్ఞాన శాస్త్రం ఉంది.
5.    ఇంద్రియ (ఇంద్రియ విషయాలకు రోగనిరూపణ) - 12 అధ్యాయాల్లో రోగనిరూపణ, రోగనిర్ధారణను రోగి ఇంద్రియగత లక్షణాలను అనుసరించి చేయడం తెలుపుతాయి.
6.    చికిత్స - 30 అధ్యాయాలలో విశిష్టమైన రోగ చికిత్సా విధానాల వివరాలున్నాయి.
7.    కల్ప (ఫార్మసూటిక్స్, టాక్సికాలజీ) - 12 అధ్యాయాల్లో ఔషధాల ఉపయోగం, వాటి తయారీ వంటి వివరాలున్నాయి.
8.    సిద్ధి (చికిత్సా విజయం) - 12 అధ్యాయాలు ‘పంచకర్మ’కు సంబంధించిన సాధారణ నియతులు వివరిస్తాయి.
 
చికిత్స స్థానలో 17 అధ్యాయాలు, పూర్తిగా కల్పస్థాన, సిద్ధిస్థాన అనంతరకాలంలో ద్రద్బలుడు (5వ శతాబ్ది) చేర్చారు. గ్రంథం సూత్రస్థానతో ప్రారంభమవుతుంది. ఈ అధ్యాయం ఆయుర్వేద విధానాల్లోని ప్రాథమిక, మౌలిక సూత్రాలకు సంబంధించింది. చరక సంహిత చేసిన విశిష్ట శాస్త్రీయ సేవలలో రోగ కారణాలు, చికిత్సలకు సంబంధించి హేతుబద్ధమైన విధానాలు, లక్ష్యపూర్వకమైన పద్ధతులతో కూడిన రోగపరీక్షను ప్రవేశపెట్టడం వంటివి ఉన్నాయి.

అనువాదాలు:
తెలుగుతో సహా ప్రపంచంలోని అనేక భాషల్లోకి ఆయుర్వేదం అనువాదం అయ్యింది. తెలుగులో అనేకమైన అనువాదాలు, వ్యాఖ్యాన గ్రంథాల్లో ఇవి కొన్ని:
·       సుషుమ అనే ఆంధ్రటీకతో కూడిన చరక సంహితను రాణీ వెంకటాచలపతి ప్రసాదరావు అనువదించారు.
·       సూత్రస్థానం భాగాన్ని నుదురుపాటి విశ్వనాథశాస్త్రి అనువదించగా వావిళ్ల రామస్వామి శాస్త్రులు అండ్ సన్స్ 1935లో ప్రచురించారు.
·       కల్పస్థానము మరియు సిద్ధిస్థానముల భాగాన్ని నుదురుపాటి విశ్వనాథశాస్త్రి అనువదించగా వావిళ్లవారు 1941లో ప్రచురించారు.
·       విమానస్థానము భాగాన్ని మూలము మరియు చక్రపాణి వ్యాఖ్యలకు పి.హిమసాగర చంద్రమూర్తి తెలుగు అనువాదాన్ని రచించగా ఆంధ్రప్రదేశ్ ఆయుర్వేదిక్ లిటరేచర్ ఇంప్రూవ్‌మెంట్ ట్రస్టు 1992లో ముద్రించారు. అదే సంవత్సరం చరకసంహిత-శారీరస్థానాన్ని ఎం.ఎల్.నాయుడు, సి.హెచ్.రాజరాజేశ్వర శర్మలతో కలసి చంద్రమూర్తి అనువదించి ముద్రించారు.

Comments

Popular Posts