జీలకర్రను ఉపయోగించి నెలరోజుల్లో బరువు తగ్గడానికి/అదనంగా పేరుకున్న కొవ్వును కరిగించుకోవడానికి చిట్కాలు ....

·   ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ జీల‌క‌ర్రను వేసి బాగా మ‌రిగించి చ‌ల్లార్చాలి. ఆ తర్వాత వడకట్టిన ఆ నీటిని తాగాలి. దీనిని రోజుకు 3 సార్లు తాగితే తిన్న ఆహారం స‌రిగ్గా జీర్ణ‌మ‌వుతుంది. అధికంగా చేరిన కొవ్వు క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.
·  రెండు టేబుల్ స్పూన్ల జీల‌క‌ర్ర‌ను ఒక గ్లాస్ నీటిలో రాత్రంతా నాన‌బెట్టాలి. ఉదయాన్నే ప‌ర‌గ‌డుపున ఆ నీటిని తీసి మ‌రిగించి తాగాలి. అనంత‌రం నీటిలో నానిన ఆ జీల‌క‌ర్ర‌ను కూడా తినేయాలి. దీంతో నెల రోజుల్లోనే పొట్ట క‌రిగి బ‌రువు త‌గ్గుతారు.
·     కొంత మోతాదులో జీలకర్ర పొడిని ఒక క‌ప్పు పెరుగులో క‌లుపుకుని తినాలి. ఇలా రోజుల ఒకసారి చేస్తే చాలు, ఇట్టే బరువు తగ్గుతారు.
·  ఒక గ్లాస్ నీటిలో ఒక టీస్పూన్ తేనె, జీల‌క‌ర్ర పొడి వేసి బాగా క‌లిపి ఈ మిశ్ర‌మాన్ని ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తాగాలి.

·    క్యారెట్లను ఉడకబెట్టి  వాటిపై నిమ్మ‌, వెల్లుల్లి ర‌సం, జీల‌క‌ర్ర పొడి చల్లుకుని ఆ క్యారెట్ల‌ను రాత్రి డిన్న‌ర్‌కు బ‌దులుగా తినాలి. ఇలా రోజూ చేస్తే కొద్ది రోజుల్లోనే బ‌రువు తగ్గుతారు.

Comments

Popular Posts