మనిషి జీవితంలో పుట్టినప్పటి నుంచి మరణించేవరకు జరిపే పదహారు ముఖ్యమైన సంస్కారాలు (షోడశ సంస్కారాలు)
షోడశ సంస్కారాలు:
      సంస్కారములు హిందూ సాంప్రదాయములో ఆగమ సంబంధమయిన క్రియలు. ఇవి ప్రతి హిందువు యొక్క జీవిత పర్యంతమూ వివిధ దశలలో జరుపబడతాయి. స్త్రీ, పురుష సమాగమము మొదలుకొని, జననము, మరణము మరియు తదనంతరము ఆత్మ పరలోక శాంతి నొందుట వరకు సంస్కారములు జరపబడును. హిందూ సంప్రదాయయలు మానవ వికాసానికై ఋషులచే నిర్దేశించబడ్డాయి. మన జీవితాలు ఏదో ఒక దశలో ఈ సంప్రదాయలను అనుసరించే ముందుకు సాగుతుంటాయి.
      మనుస్మృతి ఈ సంస్కారాలను 12 సంస్కారాలుగా గుర్తించింది. 1. గర్భాధానం, 2. పుంసవనం, 3. సీమంతం, 4. జాతకర్మ, 5. నామకరణం, 6. అన్నప్రాశనం, 7. చూడాకర్మ, 8. నిష్క్రమణం, 9. ఉపనయనం, 10. కేశాంతం, 11. సమావర్తనం. 12. వివాహం అయితే మరికొంతమంది స్మృతికారులు మనువు చెప్పిన 12 సంస్కారాలకు కర్ణభేధం, విద్యారంభం, వేదారంభం, అంత్యేష్టి అనే మరో నాలుగు సంస్కారాలను జోడించి షొడశ సంస్కారాలుగా గుర్తించారు.
      మనిషి పుట్టుకనుంచి చనిపోయేవరకు సంస్కారమయమే. ఇందులో అంత్యేష్టి తప్ప మిగిలిన 15 కర్మల ద్వారా జీవుడు సంస్కరింపబడుతూ మరణం తర్వాత ఉత్తమలోక ప్రాప్తిని పొందడం జరుగుతుంది. సంస్కారాల వలన జన్మాంతర దోషాలు కూడ తొలిగి మానవ జీవిత లక్ష్యమైన మోక్షప్రాప్తి సిధ్దిస్తుంది. సంస్కారాల ఆచరణ మనిషి జీవితంలో వివాహాంతో మొదలవుతుంది. స్త్రీ పురుష సంయోగం మంత్రం చేత పునీతమవుతుంది. అంటే తల్లి గర్భంలో ఏర్పడే పిండం పవిత్రంగా ఏర్పడాలన్నదే దీని ఉద్దేశ్యం. తద్వారా మన సంస్కారములు ప్రధానోద్దేశ్యం జీవుల క్షేమమేనని తేటతెల్లమవుతోంది.
వేదోపనిషత్తుల ప్రకారం మన శరీరం ఐదు అంశాలమయంగా విభజింపబడింది.
1. అన్నమయ కోశం : భౌతిక శరీరం,
2. ప్రాణమయ కోశం : శక్తి కేంద్రం,
3. మనోమయ కోశం : చింతనా కేంద్రం,
4. బుద్ధిమయ కోశం : వివేకం,
5. అనందమయ కోశం : పరమశాంతి
మన శరీరంలో ఈ ఐదు అంశాలు షోడశ సంస్కారాల ద్వారా సక్రమమైన రీతిలో చలిస్తాయనేది శాస్త్రవచనం.ఈ సంస్కారాల వెనుకనున్న వైజ్ఞానిక రహస్యాలు నేటి వైజ్ఞానికులను సైతం అశ్చర్యపరుస్తాయి.

మనిషి జీవితంలోని వివిధ దశల్లో జరిపే సంస్కారాలు

1.గర్భాదానము:
స్త్రీ పురుష తొలి సమాగమ సందర్భములో మంచి సంతానాన్ని ఆశించి జరిపే కార్యక్రమము ఇది. ఈ సందర్భములో చదివే మంత్రాలు సత్సంతానాన్ని (పురుష) ఆ దేవుని కోరుకుంటున్నట్లుగా తెలియజేస్తాయి. స్త్రీలకు రాజోదర్శన దినము మొదటి పదహారు రాత్రులు ఋతు రాత్రులు అనబడును. అందులో మొదటి నాలుగు రోజులు గర్భాదానం పనికి రాదు. ఐదవ దినం మొదలు పుత్ర సంతానము కోరువారు సమదినములందును , పురుష రాశులైన మేష, మిధున, సింహ, తులా, ధనుస్సు, కుంభముల యందును(ఈ రాశులలో పురుష గ్రహాలూ వుండగాను), బృహస్పతి గర్భాదాన లగ్నానికి లగ్న, పంచమ, నవమ స్థానములందు వుండగాను గర్భాదానం చేసిన పుత్ర సంతానము కలుగునని, అదే విధముగా స్త్రీ రాశులైన వృషభ, కర్కాటక, కన్యా, వృశ్చిక, మకర, మీనా రాశుల యందు, లగ్నము స్త్రీ గ్రహములచే చూడబడిననూ, లగ్న, పంచమ నవమ స్థానముల యందు బృహస్పతి లేనప్పుడు గర్భాదానం చేసిన స్త్రీ సంతానం కలుగునని శాస్త్ర వచనం. గర్భాదాన సమయాన్ని గురించి తెలియజేస్తూ గర్భాదానం సూర్యోదయ, సూర్యాస్తమయ కాలములందూ, పగటివేళ, పంచ పర్వములైన కృష్ణాష్టమి, కృష్ణ చతుర్దశి, అమావాస్య, పౌర్ణమి, సంక్రమనములందు, శుక్ల చతుర్దశి యందు ఏకాదశి మొదలైన వ్రత దినములందు, శ్రాద్ధ దినమందు, పాపగ్రహములు కూడిన నక్షత్రమందు, అశ్విని, భరణి, ఆశ్లేష, మఘ, జ్యేష్ట, మూల, రేవతి ఈ నక్షత్రముల యందు దంపతుల జన్మ నక్షత్రములందు, రెండు పక్షముల పుష్టులందు, పరిఘనామ యోగము యొక్క పూర్వ భాగమందు, వైద్రుతినామ యోగాములందు, బార్యా భర్తల రాశికి ఎనిమిదింట చద్రుడు ఉండగా గర్భాదానము పనికి రాదు.
      కాని నేటి సమాజములో గర్భాదాన ముహూర్తము చాలామంది పాటించుటలేదు. పెండ్లి అయినరోజో లేదా వారికి వీలు కలిగిని రోజో గర్భాదానాన్ని చేస్తున్నారు. దీనివలన సత్సంతానం కలుగక బాధ పడుతున్నారు. దీనికి ముఖ్య కారణం గర్భాదాన ప్రాశస్త్యం తెలియకపోవడమే. కేవలం ఏదో ఒక రోజు గర్భాదానాన్ని నిర్ణయించి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారేగాని మన మహర్షులు నిర్దేశించిన విధంగా శాస్త్రబద్దంగా ఎవరూ పాటించుట లేదు.
గర్భాదాన ప్రాశస్త్యం- ఒక ఉదాహరణ:-
      సంతాన వాంఛతో వచ్చిన దితి తో కశ్యప ప్రజాపతి "ఇది సాయం సంధ్యాసమయం ఇది గర్భాదానానికి తగిన సమయం కాదు" అని వారించినా వినక, దితి కశ్యప ప్రజాపతితో కూడుట వలన లోకకంతకులైన హిరణ్యాక్ష, హిరణ్యకషపులు జన్మించినారు. కాబట్టి మన పురాణాల ద్వారా గర్భాదానం తగిన సమయలోనే చేయాలని తెలుస్తుంది. గర్భాదాన లగ్నాన్ని నిర్ణయించడంలో ముఖ్య ఉదేశ్యం, అప్పటి వరకు పరిచయములేని ఆ ఇరువురు స్త్రీ పురుషులు ఒక్కటై వారి మధ్య ఆకర్షణ, ప్రేమ కలిగి వారి ప్రతిఫలం సంతాన రూపంలో రావాలని శుభ ముహూర్తాన్ని నిర్ణ యిస్తారు. అందుకే లగ్నాట్టు పంచమంలో బృహస్పతి వుదాలని లేదా ఏదైనా శుభ గ్రహం వుండాలని శాస్త్ర వచనం. ఎందుకంటె పంచమం ప్రేమ స్థానం కాబట్టి ఇద్దరి మధ్య అనురాగం కలగాలంటే ప్రేమ స్థానమైన పంచమంలో శుభాగ్రహాలు ఉండాలి. "అదానము" అనగా "ఉంచడము" గర్భాదానము అనగా గర్భమునందు ఉంచడము అని అర్ధము.
క్లుప్తంగా చెప్పాలంటే ....సుసంతాన ఉత్పత్తి, జననంకోసం భార్యాభర్తలు చేసే సంస్కారం ఇది. దీన్నే 'గర్భాలంబనం' అనీ అంటారు. సుసంతాన్ని పొందటం ద్వారా సమాజానికి తమ వంతు సేవ చేయటానికి, తాము తమకున్న మూడు రకాల ఋణాలను (దేవఋణం, ఋషిఋణం, పితౄణం) తీర్చుకోవడానికి దంపతులు ఉమ్మడిగా చేసే సంస్కారం ఇది. సుసంతానప్రాప్తికోసం గర్భాదాన సంస్కారం నియమితమైన మంచి రోజున జరగటం వల్ల దైవబలం కలిసి వస్తుందని నమ్మకం.

2.పుంసవనం:
తల్లి గర్భంలోని పిండం పవిత్రంగా ఏర్పడేందుకు ఉద్దేశించబడిన సంస్కారమే పుంసవనం. స్త్రీ గర్భం ధరించినట్లు రూఢి అయిన తర్వాత ఆమెకు కొడుకు పుట్టాలని చంద్రుడు పురుషరాశిలో ఉన్నప్పుడు జరిపుతారు. గర్భిణీ స్త్రీ ఆ రోజంతా ఉపవాసముంటుంది. ఆ రాత్రికి మొలకెత్తిన మర్రి విత్తనాలను నూరి ఆ రసాన్ని "హిరణ్యగర్భ:..." అని మంత్రాలు చదువుతూ ఆమె కుడి ముక్కులో వేస్తారు. చంద్రుడు పురుష రాశిలో ఉన్నప్పుడు ఇలా చేయడం ద్వారా దృఢకాయుడు, ఆరోగ్యవంతుడైన కొడుకు పుడతాడని నమ్మకం.
      ఇది మరియు సీమంతోన్నయనం గర్భాన్ని రక్షించుకొనుటకు చేసే సంస్కారములు. కావున ఈ రెండు గర్భా కాలమునందే చేయవలెను. పుంసవనము గర్భము ధరించిన మూడవ మాసములో మొదటి పదిరోజులలో చేయవలెను. ఈ కార్యక్రమములో మఱ్ఱిపండ్లను మినుములతో, యవలతో కలిపి గర్భిణికి వాసన చూపించెడి వ్యవస్థ యున్నది. దీనివలన యోనియందున్న దోషములు తొలగి గర్భరక్షణ శక్తి కలుగునని సుశ్రుతము మొదలగు ఆయుర్వేద శాస్త్రములందు చెప్పబడియున్నది. మోక్షమునకు ఉపయోగపడే ఉత్తమ స్థూల శరీరమును పొందు లక్ష్యముతోనే ఈ పుంసవన సంస్కారము నిర్ణయించబడింది.

3.సీమంతము:
గర్భధారణ జరిగిన అయిదునుంచి ఎనిమిది మాసాలలోపు జరిగే సంస్కారం 'సీమంతోన్నయనం'. గర్భం ధరించిన అయిదు మాసాల నాటినుంచి గర్భస్థశిశువు మెదడు పెరుగుదల ఆరంభం కావడమనే విషయాన్ని తెలియజేస్తూ, ఇకపై ఆ గర్భవతి ఆరోగ్యంపై తగు శ్రద్ధ  వహించాల్సిన ఆవశ్యకత ఉందని బంధువులకు గుర్తు చేస్తూ, ఆమె సైతం పుట్టబోయే బిడ్డ శ్రేయస్సు కోరుతూ అధిక శారీరక శ్రమ కలిగించే పనులు చేయరాదని గుర్తు చేసే సంస్కారం ఇది. ఇదే సమయంలో గర్భవతి అయిన తన భార్యపై ఎలాంటి దుష్ప్రభావాలూ ఉండరాదని ఆశిస్తూ, ఈ సంస్కారం సమయంలో తన భార్య కురులను భర్త, ఆమె పాపట వద్ద రెండుగా వేరు చేయడం జరుగుతుంది. అసలు 'సీమంతము' అంటేనే పాపట అని అర్థం. అందుకే, ఈ వేడుకకు 'సీమంతోన్నయనం' అన్న పేరు వచ్చింది. కానీ, ఇప్పుడు జరుగుతున్న 'సీమంతం' వేడుకలో ఈ పాపటను భర్త వేరు చేసే వేడుక కానరావడం లేదు. 
'సీమంతం' అనేది తల మీద అయిదు మర్మాలు కలిసే స్థలం అంటారు. 'పంచ సంధాయశ్శిరసి విభక్త స్సీమంత నామ....' అని శుశ్రుతుడు తన 'ఆయుర్వేద వైద్య సంహిత'లో పేర్కొన్నాడు. 
ఆధునిక వైద్య పరిభాషలో చెప్పాలంటే, Frontal Suture (one), Parietal Sutures (two, one on either side), Lambdoid Suture (one), Sagittal Suture(one) అక్కడ కలుస్తున్నాయి. ఈ మర్మస్థానంలో గాయం తగిలితే, insanity, fear, intellectual disturbances from trauma రాగల ప్రమాదం ఉందని శుశ్రుతుడు పేర్కొన్నట్టు డా. పాలకోడేటి వెంకట కృష్ణారావుగారు రాసిన ‘Comparative Study of the Marmas’ (Pub.1941)లో వివరించారు. ఈ కోణంలోంచి చూసినా, శిరస్సు మీద సీమంత ప్రాంతాన్ని బహు జాగ్రత్తగా కాపాడుకోవాలన్న విషయాన్ని మనం చేసే 'సీమంతోన్నయనం' వేడుక ద్వారా కాబోయే ఆ మాతృమూర్తికి తెలియజేయడం అన్నమాట!! 
తొలి గర్భదారణ విషయంలో 4, 6, 8 మాసములలో చేయుట శాస్త్ర సమ్మతము. అయితే 5, 7, 9 మాసములలో చేయుట ఆచారము. పుంసవనమునకు అష్టమ శుద్ధి కావలెను. సీమంతమునకు అష్టమ, నవమ శుద్ధులు రెండూ కావాలి. సీమంతర అనివార్య కార్యముల వలన చేయలేనిచో ప్రాయశ్చిత్తముగా గోదానము చేయాలి.

భార్య గర్భంతో ఉన్నప్పుడు భర్త చేయవలసిన,చేయకూడని పనులు:
 
      భార్య గర్భవతిగా వున్నప్పుడు "గర్భిణీ వాంఛితం ధర్మం తస్యైదద్యాత్ యధోచితం" భార్య కోరిన ఉచితమైన కోరికలు భర్త తీర్చవలెను. విదేశీ ప్రయాణము, చెట్ల నరుకుట, 7వ మాసం నుంచి క్షౌరము, మైధునము, తీర్ధయాత్ర, శ్రాద్ధ భోజనము, నావప్రయాణము, వాస్తుకర్మలు, సముద్ర స్థానము, ప్రేతకర్మలు నిషేధము. గర్భిణీపతి స్వపితృకర్మలు చేయవచ్చును.

4.జాత కర్మ:
బొడ్డుతాడు కోసే ముందు చేసే సంస్కారాలు. బిడ్డకు నెయ్యిని రుచి చూపి, పది నెలలు తల్లి గర్భంలో ఉండి ఈ ప్రపంచానికి వచ్చిన జీవికి జరిపే తొలి సంస్కారం ఇది. దీంట్లో భాగంగా జరిపే తంతులు చాలా ఉన్నాయి.
మేథాజనన: బలానికి, తెలివితేటలకు ప్రతీకలైన నెయ్యి, తేనెలనుఒక సన్నని బంగారుదారంతో శిశువు నోటికందిస్తారు. దీన్ని పిల్లల పట్ల తాము నెరవేర్చవలసిన మొట్టమొదటి బాధ్యతగా వారు భావిస్తారు. హిందువులు పిల్లల తెలివితేటలకు ఎంత ప్రాధాన్యతనిస్తారో దీని ద్వారా మనకు తెలుస్తుంది.
ఆయుష్య: దీర్ఘాయుష్షును కలిగించే ఋషులు, పితృదేవతలు, అగ్ని, సోములను ఆవాహన చేసే మంత్రాలను శిశువుముందు చదువుతారు.
శక్తి: తండ్రి బిడ్డ చెవిలో "త్వం...శతమానం భవతి:" అని ఆ శిశువుకు చెబుతాడు. అప్పుడు బొడ్డుతాడు కోసి, శిశువును శుభ్రం చేసి, చనుబాలు పట్టిస్తారు.
జలపూజ:ప్రసవించిన స్త్రీ జల సమీపమునకు వెళ్ళి జలపూజ చేయాలి. బుధ, గురు, శుక్ర, సోమ వారములయందును శ్రవణం పుష్యమి పునర్వసు, మృగశిర, హస్త, మూలా, అనూరాధలలో ఒక నక్షత్రము నందును శుభ తిథులలో చేయడం మంచిది. వీటికి చైత్ర, పుష్య మాసములు, మూఢమి, అధిక మాసములు వర్జ్యములు.

5.నామకరణ సంస్కారము:
నామకరణం అనగా పేరు పెట్టడం. ఆడ, మగ పిల్లలకు పెట్టవలసిన పేర్లకు సంబంధించిన నియమాలను గృహ్యసూత్రాలు పేర్కొన్నాయి.
నామాఖిలస్య వ్యవహార హేతుః
శుభావహం కర్మసు భాగ్య హేతుః 
నామ్నేవ కీర్తిః లభతే మనుష్య 
స్తతః ప్రశస్తం ఖలు నామ కర్మ
      అని వీరమిత్రోదయ సంస్కార ప్రకాశికలో బృహస్పతి పేర్కొనటం జరిగింది. ఒక వ్యక్తిని మరొక వ్యక్తి నుండి విడిగా గుర్తించటానికి పేరే కారణ మవుతుంది. తనదైన ప్రత్యేక నామం లేక సంజ్ఞ లేక పేరు లేక పోతే సమాజంలో వ్యవహరించటం కష్టం. పేరు వ్యవహారానికి వీలుగా ఉండటమే కాదు, శుభాలను, అదృష్టాన్ని కలిగిస్తుంది. కీర్తికి కారణ మౌతుంది. ఒకప్పుడు గురువులు లేదా వంశ పురోహితులు జీవుడి లక్షణాన్ని బట్టి నామకరణం చేసేవారు. తరువాతి కాలంలో తల్లిదండ్రులు కాని, ఇంటిలోని పెద్దలు కాని తమ అభిరుచులు, ఆదర్శాలు, ఇష్టాల ననుసరించి పేరు పెట్టటం ఆనవాయితీగా వస్తోంది. పేరును బట్టి పెట్టిన వారి సంస్కారం వ్యక్తమౌతుంది. అంతేకాదు పేరుని బట్టి వ్యక్తి జీవితం ఉంటుందనే నమ్మకం కూడా చాలా మందిలో ఈనాడు కనపడుతోంది. అందుకే పేరు మార్చుకోవటం, పేరులోని అక్షరాలను కొంచెం మార్చుకోవటం, కొంచెం అటూ ఇటూ చేయటం, ఆంగ్లంలో వ్రాసేప్పుడు అక్షర క్రమం(Spelling)లో మార్పుచేయటం గమనించవచ్చు. (అక్షర క్రమం మార్చటం ఆంగ్లలో మాత్రమే చేస్తారు. అంటే ఇది మన పద్ధతి కాదు అని అర్థం చేసుకోవచ్చు.)
ఆయుర్వర్చోభి వృద్ధిశ్చ సిద్ధిర్వ్యవహృతే స్తదా
నామకరణ ఫలంత్వే తత్సముద్దిష్టమ్ మనీషిభిః
శిశువుకి ఆనందం, ఆయుస్సు, తేజస్సు, కీర్తి కలగటం కోసం నామకరణ సంస్కారాన్ని చేయాలట!
      పేరుకి ఉన్న ప్రాధాన్యాన్ని గుర్తించిన శాస్త్రకారులు పేరుపెట్టటం అనే కార్యక్రమాన్ని నామకరణ సంస్కారంగా రూపొందించారు. నామకరణ విధి విధానానికి సంబంధించి గృహ్య సూత్రాలలో విపులంగా చర్చించబడింది. పారస్కర గృహ్య సూత్రం పురుషుల పేరులో రెండు లేక నాలుగు అక్షరాలుండాలని, స్త్రీల పేరులో బేసి సంఖ్య (మూడు, ఐదు- ప్రధానంగా మూడు) లో అక్షరాలుండాలని తెలుపుతుంది. పైగా మగ పిల్లల పేర్లలో ఘోష సంజ్ఞ ఉన్న అక్షరాలు ( ఊది పలికే ఠ, మొదలైనవి) ఉండాలని ఉన్నది. పేరు పెట్టటంలో కొన్ని నియమాలు పాటించాలి. ముఖ్యంగా పేరు వినగానే ఆ వ్యక్తి స్త్రీయో, పురుషుడో తెలియాలి. కొండలు, నదులు, అరణ్యాలు, ఋషులు, గోత్రాలు, చెట్లు, రాక్షసులు మొదలైన వాటిని సూచించే పేర్లు పెట్టకూడదని సూచించటం జరిగింది.
      నామకరణ కార్యక్రమాన్నే బాలసారె అంటారు. వ్యవహారంలో అది బాలసారెగా మారింది. బాలకు అంటే శిశువుకి అందరు బహుమానాలు (సారె) ఇస్తారు ఆ రోజు. ఈ కార్యక్రమాన్ని సాధారణంగా శిశువు పుట్టిన పదకొండవ రోజున చేస్తారు. ఆ రోజున ఎలాగూ పురుటి స్నానం కనుక పుణ్యాహవచనం చేస్తారు. పురోహితుడు వస్తాడు. ఇంట్లో కొద్ది హడావుడి ఉంటుంది. అప్పుడు కుదరక పోతే బేసి సంఖ్య రోజున చేయవచ్చు. 21వ రోజు అయితే ముహూర్తం, తిథి వార నక్షత్రాలు చూడనక్కరలేదు. 16వ రోజు కూడా చేయవచ్చు. నెల లోపు వీలు కానప్పుడు మూడవ నెల చేసుకుంటారు. కాలామృత కారుడు బిడ్డ పుట్టిన 11వ రోజుతో జాతాశౌచం పూర్తి అవుతుంది కనుక ఆ రోజే నామకరణ సంస్కారం చేయాలని జ్యోతిషపరంగా తెలియచేశాడు. జాతానంతర మేవ నామ కరణం ఏకాదశాహే స్ఫుటం”. శిశువుకి చెందినవిగా చాంద్ర మాన, వేదోక్త, విష్ణు, సూర్య, స్త్రీ దేవతా, ఋతు, మాస నామాలని కూడా ప్రకటించాలి. కాని సాధారణంగా సంవత్సర, మాస, నక్షత్ర , వ్యవహార నామాలని వ్రాయటమే అలవాటుగా వస్తోంది.
      తమకు తగిన సమయాన్ని నిర్ణయించుకున్న తరువాత ఆరోజు తల్లిదండ్రులు, శిశువు అభ్యంగన స్నానం చేయాలి. ఇల్లు శుభ్రం చేసి, మామిడాకుల తోరణాలు కట్టాలి. తూర్పు ముఖంగా పీటల మీద కూర్చుని, కలశ స్థాపన చేసి, పసుపుతో చేసిన గణపతిని, షష్ఠి దేవతను పూజించాలి. ఒక వేళ అంతకు ముందు జాతకర్మ (ఆవు నెయ్యి, తేనె, ఆవు పాలలో ముంచిన బంగారు కడ్డీని నాలుకపై రాయటం) చేసి ఉండక పోతే అప్పుడు చేయాలి. నాందీ కర్మ చేసిన తర్వాత పళ్ళెంలో బియ్యం పోసి, దానిలో బంగారు ఉంగరంతో దక్షిణం నుండి ఉత్తరం వైపుకి మూడు గీతలు గీసి, ముందుగా శ్రీకారం వ్రాసి, ఒక్కొక్క గడిలో సంవత్సర, మాస, నక్షత్ర, వ్యవహార నామాలు వ్రాయాలి. కొంత మంది నక్షత్ర నామాన్నే వ్యవహార నామంగా చేసుకుంటారు. సభాసకల సత్పురుష మధ్యే నామ ప్రకటన సిద్ధ్యర్థం అని చెప్పి వ్యవహార నామాన్ని మూడు మార్లు బిడ్డ చెవిలో చెప్పాలి. ఈ సమయంలోనే పెద్దలందరూ పిల్లవాడిని అక్షతలు వేసి ఆశీర్వదిస్తారు. శిశువుకి బహుమానాలు ఇచ్చే సమయం ఇదే. వసంతం (ఎర్ర నీళ్ళు) తో దిష్టి తీసి, కర్పూర హారతి ఇస్తారు. పురోహితుడు మొలతాడు కట్టిస్తాడు. ఒక వేళ నామ కరణం ఆలస్యంగా నయినా, 11వ రోజున పుణ్యాహ వచనం, మొలత్రాడు కట్టటం తప్పని సరిగా చేస్తారు. నామకరణ సమయంలో చదివే మంత్రాలు తండ్రికి బిడ్డకు ఉన్న సంబంధాన్ని స్థాపించేవిగా ఉంటాయి. ఆత్మావై పుత్రనామాసి” , “అంగాదంగాత్సంభవసి మొదలైనవి.
      పేరు పెట్టటం పూర్తి అయిన తరువాత స్త్రీలు బిడ్డను ఊయలలో వేస్తారు. ఈ కార్య క్రమం మాత్రం ప్రాంతాలని బట్టి మారుతూ ఉంటుంది. ఊయల క్రింది నుండి ఇద్దరు ముత్తైదువలు అటు నుండి ఇటు, ఇటు నుండి అటు అందుకోవటం, నూతిలో చేద వేయించటం, బిడ్డ చెవిలో ముమ్మారు పేరుని ఉచ్చరించటం వంటివి. పేరుకి ఉన్న శక్తిని అనుసరించి బిడ్డ పేరుగల వాడు, పేరెన్నిక గలవాడు, అవుతాడు.

6.నిష్క్రమణ సంస్కారము:
బిడ్డను మొదటిసారిగా ఇంట్లోనుంచి బయటికి తీసుకురావడం. అప్పటివరకూ ఇంట్లోనే పెరిగిన బిడ్డ మొదటిసారిగా బయటి ప్రపంచంలో అడుగుపెడుతున్నప్పుడు ఆ బిడ్డను బలమైన ప్రకృతిశక్తులనుంచి, అతీత శక్తుల బారి నుంచి కాపాడడానికి చాలా జాగ్రత్తలు (అధిభౌతికమైనవి, ఆధ్యాత్మికమైనవి) తీసుకోవాలి. అందుకే ఈ సంస్కారం చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు.
      నాలుగవ నెల శిశువు సూర్యునికి చూపించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని నిష్క్రమణ సంస్కారం అని పిలుస్త్రారు. శిశువు యొక్క నాలుగవ నెలలో సూర్యోదయ సమయాన ఈ కార్యాన్ని నిర్వహిస్తారు. గాలి బాగా ఆడే ఇంటి బయట ప్రదేశానికి శిశువును తీసుకెళ్ళి సూర్యుడికి శిశువు శరీరాన్నంతా భక్తి శ్రద్ధలతో చూపించడం జరుగుతుంది. చూడడానికి అర్థరహితంగా కనిపించినా ఇది ఓ మూఢనమ్మకం కాదు. శిశువు యొక్క శరీరం ఈ కార్యం వలన ఉదయించే సూర్యుని సూర్య కిరణాలలోని విటమిన్లను గ్రహిస్తుంది. అలా శిశువుకు క్షేమం కలుగుతుంది. అదే రోజు రాత్రి సమయంలో చంద్రుడికి కూడా శిశువు శరీరం చూపడం జరుగుతుంది.
      ఆ తరువాత రోజులలో కూడా కొంతకాల శిశువును సూర్యుడికి కొన్ని నిమిషాలు చూపించడం జరుగుతుంది. ఇలా చేయడం ద్వారా శిశువు ఆరోగ్యవంతంగా బుద్ధిశాలిగా ఉన్నతి పొందుతాడు. సూర్యుడు సత్యానికి (క్రమం తప్పకుండా ప్రతీ రోజు ఉదయిస్తాడు కాబట్టి) సామార్థ్యానికి (ప్రకాశవంతంగా ప్రకాశిస్తాడు కాబట్టి) ఉత్సాహానికి (సోమరితనం సూర్యునిలోలేదు కాబట్టి) మరియు తపస్సుకు (క్రమం తప్పని సత్ కర్మలను అందిస్తాడు కాబట్టి) ప్రతిరూపం కాబట్టి, ఇలా శిశువును సూర్యుడికి చూపడం వాళ్ళ సూర్యునిలోని సద్గుణాలన్నీ శిశువు పెరుగుతున్న కొద్ది వస్తాయని ఇలా చేయడం జరుగుతుంది.

7.అన్నప్రాశన
మొదటిసారిగా ఘనాహారం తినిపించడాన్నే ('ప్రాసనము' అంటే వేయుట అనీ,  'అన్నప్రాసనము' అంటే  తొలిసారి అన్నము పెట్టటం అని అర్థం.) అన్నప్రాశన అంటారు. పెరుగుతున్న బిడ్డ భౌతికావసరాలను తీర్చడానికి అవసరమైన అతి ముఖ్యమైన ప్రక్రియ. సుశ్రుతుడు కూడా ఆరవనెలలో బిడ్డ చేత తల్లిపాలు మానిపించి ఘనాహారం ఇవ్వాలని పేర్కొన్నారు.ఇందుకవసరమైన ఆహారాన్ని కూడా వేదమంత్రాల మధ్య పరిశుభ్రమైన పాత్రల్లో వండుతారు. ఒక్కో రకమైన గుణాన్ని పెంపొందించడానికి ఒక్కో రకమైన ఆహారాన్ని అందించడం జరుగుతుంది. ఈ సంస్కారం జరపడం వల్ల వయసుకు తగిన ఆహారం అందడమే గాక ఆహారం పట్ల పవిత్రభావన ఏర్పడుతుంది.
      మగపిల్లల విషయంలో 6వ మాసం అన్నప్రాసన చేయలి. 5వ మాసం మొదలు బేసి మాసముల యందు ఆడపిల్లల విషయములో అన్నప్రాసన చేయాలి. 6వ నెల 6వ రోజు అనేది కుసంస్కారము. అది దుష్టాచారము. అన్నప్రసనతోనే పిల్లల ఆరోగ్య విషయాలు ఉంటాయి. అందు కోసం మంచి ముహూర్తానికే అన్నప్రసన చేయాలి. అశ్వని, రోహిణి, మృగశిర, పునర్వసు, పుష్యమి, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, అనూరాధ, ఉత్తరాషాడం, శ్రవణం, ధనిష్ఠ, శతభిషం, ఉత్త్రాభాద్ర, రేవతి నక్షత్రములయందు చేయవలెను. ఆది, శని, మంగళవారములు నిషేధం. జన్మలగ్నం, అష్టమ లగ్నం కాకుండగను, దశమస్థానం శుద్ధి ఉన్న లగ్నమున అన్నప్రాసన చేయవలెను.ఈ సమయంలోనే వాగ్దేవితో బాటు ఇతర శక్తి దేవతలను ప్రార్థించి బిడ్డకు సకల శక్తులను ప్రసాదించమని కోరటం జరుగుతుంది. 
బిడ్డల మీద అపారమైన ప్రేమతో కొందరు తల్లులు బిడ్డకు ఏడాది వరకూ కూడా పాలు ఇస్తుంటారు. ఇది బిడ్డ పోషక అవసరాలకు సరిపోదు సరికదా, తల్లి ఆరోగ్యానికి కూడా మంచిది కాదన్న విషయాన్ని స్పష్టం చేసే సంస్కారం ఇది. అయితే, ఇప్పుడు తల్లి వీలైనంత ఎక్కువకాలం బిడ్డకు పాలివ్వటం మంచిది అంటున్నారు. తమ  కుటుంబ, శారీరక అవసరాలను బట్టి అన్నప్రాసనం చేసే సమయంలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. కానీ ఎట్టి పరిస్థితిలోనూ ఏడాది వయసు దాటక మునుపే, అన్న ప్రాసనం జరగటం అవసరం. 

8.చూడాకరణ (పుట్టు వెంట్రుకలు తీయించడం):
దేవునికి తలనీలాలు ఇవ్వడం సంప్రదాయంగా వస్తున్న ఆచారం. పుట్టు వెంట్రుకలు తీయటం అని వ్యవహారంలో చెప్పబడే ఒక సంస్కారం ఇది. దీనిని కేశఖండనం, ముండనం, క్షౌర కర్మ అని కూడా అంటారు. తల్లి కడుపులోనుండి బయటకు వచ్చిన శిశువుకి మొదటి మారు వెంట్రుకలు తీయించే కార్యక్రమం. ఏ పనినైనా మొదటి మారు చేసేప్పుడు ఆ పనికొక గౌరవాన్ని ఆపాదించటానికి, దాని వల్ల ఆ జీవికి మేలు కలిగించటానికి ఒక సంస్కారంగా మలచారు మన పెద్దలు. సాధారణంగా ఈ కార్యక్రమాన్ని మొదటి సంవత్సరం నిండ కుండా గాని, మూడవ సంవత్సరంలో గాని నిర్వహిస్తు ఉంటారు. అదీ కుదరనప్పుడు ఐదవ సంవత్సరంలో చేస్తారు. కుదరక పోవటానికి తల్లి మళ్ళీ గర్భిణిగా ఉండటం ప్రధాన కారణ మవుతుంది. ఎందుకంటే ఈ కార్యక్రమాన్ని తల్లి ఒడిలో కూర్చోబెట్టి చేస్ బలాయుర్వర్చోభి వృద్ధిశ్చ చూడకర్మ ఫలం స్మృతమ్ ఈ చూడా కర్మ చేయటం వల్ల దేహానికి బలం, ఆయుస్సు, తేజస్సు, కలుగుతాయని స్మృతులు చెపుతున్నాయి.
      కేశ ఖండనం సంతోషాన్ని, సౌభాగ్యాన్ని, కలిగించి ఉత్సాహాన్ని వృద్ధి చేస్తుంది అని చరక సంహిత చెపుతుంది. గోళ్ళు, జుత్తు మృత కణ జాలంకదా! (పైగా జుత్తుకి మనిషి చేసిన పాపాలు సంక్రమిస్తాయట. కనుక ఎన్నో సందర్భాలలో, వైదిక క్రియ కలాపాలలో శిరోముండనం చేయించటం కనపడుతుంది. వెంట్రుక శరీరం మీద కాక మరెక్కడ కనపడినా దోషంగా భావించ బడుతుంది) కేశ ఖండనానికి కూడా ఎన్నో నియమాలు ఉన్నాయి. గర్భంలో వున్న శిశువు తన తల ద్వారా భూమిపైకి వస్తాడు. శిశువుకున్న తల వెంట్రుకల్లో పూర్వజన్మకు సంబంధించిన అనేక పాపాలు వుంటాయి. అందుకనే చిన్న వయసులోనే కేశఖండన కార్యక్రమం నిర్వహిస్తారు. పాపాలను కలిగివున్నందునే శిరోజాలను శిరోగతాని పాపాని అంటారు. అందులోనూ శిశువు శరీరానికి మొదటి మారు కత్తి వంటి వాడి ఆయుధాన్ని తాకిస్తారు, కనుక మామూలుగానే జాగ్రత్త వహించ వలసిన అవసరం ఉంది. దానిని ఒక పవిత్ర కార్యకలాప మంటే, సంప్రదాయ మంటే ఎంతో భయ భక్తులతో వ్యవహరిస్తారు.

      ప్రస్తుత నాగరక సమాజంలో కేశ ఖండనం, ముఖ్యంగా మగ పిల్లలకు తప్పని సరి. చిన్నతనంలో జుట్టు పెరగటం వల్ల పిల్లలు చికాకుగా ఉంటారు. చికాకు తగ్గించటానికి, ఆరోగ్య దృష్టితోను జుట్టుని చిన్నదిగా ఉంచటం మంచిదనే ఉద్దేశంతో ప్రాచీనులు కేశఖండనాన్ని చూడాకర్మమనే సంస్కారంగా మలచారు. పిల్లలకు కొంత వయసు వచ్చే వరకు తల లోపలి సంధులు కూర్చ బడవు. అందుకే చిన్న పిల్లల తల పై భాగం మెత్తగా లోతుగా ఉంటుంది. ఆ మెత్తని భాగాన్ని మాడు అంటారు. కొన్ని నెలల నుండి రెండు మూడు సంవత్సరాలకు అది గట్టి పడుతుంది. దానిని మాడు పూడటం అంటారు. తల్లి కడుపులో ఉన్నప్పుడు ఏర్పడిన జుట్టు మెత్తని ఆ మాడు భాగాన్ని భద్రంగా కప్పి ఉంచి కాపాడుతుంది. కొంత మంది పిల్లలకు త్వరగా కొద్ది నెలలకే గట్టి పడినా సాధారణంగా ఎక్కువ మందికి ఒకటిన్నర రెండు సంవత్సరాలకి మాడు గట్టి పడుతుంది. అప్పటితో పుట్టినప్పుడున్న జుట్టు అవసరం తీరిపోతుంది. దానిని తీసివేయాలి. తరువాత తాజాగా కొత్త జుట్టు వస్తుంది. పుట్టుకతో వచ్చిన జుట్టు తల్లి గర్భంలో ఉండగా అక్కడి ద్రవాలలో నాని ఉంటాయి. వాటిని తొలగించటం వల్ల మలినమైన జుట్టు పోయి కొత్తగా పొడవైన బలమైన జుట్టు వస్తుంది.
      గృహ్య సూత్రాలలో చెప్పబడిన చూడాకర్మ మంత్రాలు వైదిక సాహిత్యంలోనివి అవటం వల్ల ఇది చాలా ప్రాచీనమైనదిగా చెప్పవచ్చు. తూర్పు ముఖంగా బిడ్డని తల్లి ఒడిలో కూర్చుండ బెట్టి, ఆచమనం, సంకల్పం, ఈశ్వర స్తుతి, అగ్ని ప్రజ్వలనం, ఆహుతి సమర్పణం చేయాలి. చల్లటి నీటితో, ఆ పై వేడి నీటితో కేశాలని తడిపి, వెన్నతో కానీ, పెరుగుతో కానీ తుడవాలి. ముందుగా కత్తిని స్తుతించి తలమీద మూడు దర్భలను పెట్టి, కత్తిరించి పార వేయాలి. ఓం శివో నామాసి స్వధితిస్తే పితా నమస్తే అస్తు మామా హిగ్ మ్ సీః (పటిష్ఠమైన లోహంతో తయారు చేయ బడిన ఖడ్గమా! నీకు నమస్కారం. మాకెట్టి హాని కలుగ చేయకుందువు గాక!) అని ప్రార్థించటం, క్షురకుని సూర్యుని అవతారంగా భావించి సన్మానించటం ప్రతి పని ముట్టుని, ప్రతి వృత్తిని గౌరవించే సంప్రదాయానికి అద్దం పడుతుంది. ఎందుకంటే మనిషి జీవితం సుఖంగా సాగటానికి అన్ని వృత్తుల వారి సహకారం అవసరం. కనుక అన్నింటికి సమ ప్రాధాన్యం ఇవ్వబడింది. దర్భలను కత్తిరించి చేతికి కొంచెం అలవాటు అయిన తరువాత ఎడమ చెవి వెనుక నుండి మొదలు పెట్టి ప్రదక్షిణంగా జుట్టుని తీయాలి.శిశువుకి స్నానం చేయించి కొత్త బట్టలు ధరింప చేసి, తల్లి ఒడిలో కూర్చో బెట్టి, క్షురకునికి ధాన్యం ఇవ్వాలి. అందరకు నమస్కరింప చేసి , పురోహితునికి దక్షిణ తాంబూలాదుల నిచ్చి ఆశీర్వదాన్ని ఇప్పించాలి. బిడ్డకి హారతి ఇవ్వాలి.
      మొదటి కత్తెర మేన మామ వేయటం కొంత మంది తెలుగు వారి ఇంటి ఆచారం. ఇటువంటి భేదాలెన్నో ప్రాంతాలని బట్టి, వంశాచారాలని బట్టి కనపడుతుంటాయి. కొంత మంది ఇళ్ళలో ఆడ పిల్లలకి కూడా పుట్టు వెంట్రుకలు తీయించే ఆచారం ఉంది. మగ పిల్లలకి మాత్రం తప్పని సరి. ఈ రోజుల్లో ఎందుకైనా మంచిదని ఏదో దేవాలయంలో జుట్టు తీయించి మొక్కు తీర్చుకుంటున్నారు.

9.కర్నబేధ:
ఐదేళ్ళలోపు చేయవలసిన సంస్కారం. కర్ణాభరణాలు ధరించడం మొదట్లో అందం కోసమే మొదలైనా తర్వాత ఆరోగ్యదృష్ట్యా దానికున్న ప్రాధాన్యతను బట్టి దానిని సంస్కారాల్లో చేర్చి ఉండవచ్చు. ఏ గృహ్యశాస్త్రాలలోనూ నేరుగా 'కర్ణవేధ' గురించిన ప్రస్తావన లేదు. పారస్కర సూత్రాలకు చెందిన పరిశిష్టంలో మాత్రం దీని గురించిన వివరణ ఉంది. అథర్వణ వేదంలోనూ దీని ప్రస్తావన ఉంది. బిడ్డ పుట్టిన 10వ రోజు, లేదా 12వ రోజు లేదా 16వ రోజున 'కర్ణవేధ' సంస్కారం జరపాలని బృహస్పతి అభిప్రాయం. అంత చిన్న వయసులోనే దీన్ని నిర్వహించడం వల్ల బిడ్డకు అంత బాధాకరంగా ఉండదని భావన. అయితే, బిడ్డ ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుంటే, కర్ణవేధను బిడ్డకు ఆరు నెలలో కానీ, లేదా ఏడవ నెలలో కానీ చేస్తే మంచిదని శుశ్రుతుడు తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒక మంచి రోజున తల్లి ఒడిలో బిడ్డను తూర్పు దిక్కు వైపు చూస్తున్నట్టుగా కూర్చుండబెట్టి, ఆడుకునేందుకు బొమ్మలను ఇచ్చి, కొంచెం ఆడిస్తూ, ముందు కుడి చెవిని, తర్వాత ఎడమ చెవిని కుట్టాలి. చెవి కుట్టిన చోట నూనెతో తడిసిన పత్తిగుడ్డతో ఒత్తాలి. 
      ఆడ పిల్లలకు చెవులూ, ముక్కూ కుట్టించి చక్కని ఆభరణాలు ధరింపచేసి లక్ష్మీ దేవిలా తలచుకుని మురిసిపోయే ఆ కార్యక్రమంలో మరో ఆరోగ్య రహస్యం కూడా వుంది. చెవులు కుట్టించుకుంటే కంటి చూపు శక్తి పెరుగుతుంది. ఆక్యుపంక్చర్‌ వైద్య విధానం చెవి కుట్టించుకుంటే శరీరం మొత్తానికి మంచిదని చెబుతోంది.

పైన పేర్కొన్న సంస్కారాలన్నీ 'బాల్య సంస్కారాలు'గా ప్రసిద్ది పొందాయి. 

10.అక్షరాభ్యాసం:
  అక్షరాభ్యాసం నాల్గవ సంవత్సరం చేయరాదు. మూడు, అయిదు సంవత్సరాలలో మాత్రమే చేయాలి అనే బలమైన ప్రచారం ఉంది. మూడు, ఐదు సంవత్సరాలలో చేయుటకు ఆక్షేపణ లేదు కానీ నాలుగులో చేయరాదు అనుట అపహాస్యమైన విషయం. నాల్గవ సంవత్సరం అక్షరాభ్యాసం చేయుటకు శాస్త్రంలో నిషేధ వాక్యములు ఎక్కడా లేవు. అలాగే అనధ్యయనములు అనబడే పాడ్యమిఅష్టమిచతుర్దశీపౌర్ణిమఅమావాస్య రోజులలో అక్షరాభ్యాసం చేయరాదు. అలాగే దసరాలలో మూలా నక్షత్రం రోజు అక్షరాభ్యాసం చేయరాదు. ధర్మశాస్త్రం మరియు పురాణాలలో ఈ విషయం రాసి ఉన్నది. మూలానక్షత్రం రోజు పుస్తక రూపంలో సరస్వతీ ఆవాహన చేసి నాటి నుండి విజయదశమి రోజు వరకు వ్రాయుటచదువుటపాఠం చెప్పుట నిషేధం అని శాస్త్రం. విజయ దశమినాడు అక్షరాభ్యాసం చేయవచ్చు. భవిష్యోత్తర పురాణంలో సరస్వతీ పూజ విషయమై ‘భవేన్మూలాద్య పాదోవై క్షణాదాయాం కురూత్తమ తదా సరస్వతీ పూజా ప్రభాతే స్యాత్ పరేహని.. నాధ్యాపయేన్నచ లిఖేన్నాధీ రుూత కదాచన పుస్తకే స్థాపితే దేవ విద్యాకామో ద్విజోత్తమః’ అని వున్నది. ధర్మశాస్త్ర గ్రంథాలు కూడా సమర్థించాయి. విజయ దశమి విశేషమే.
ఈ మధ్యకాలంలో  అక్షరాభ్యాసం  ‘బాసరలో చేసినా’,‘శ్రీపంచమి రోజు చేసినా’ ముహూర్తంతో అవసరం లేదు అని. మరి ఈ బాసరశ్రీపంచమి ల గురించి గతంలో వినపడ్డాయాలేదు. ముహూర్తం అక్కర్లేకపోతే మహర్షులు ఇంత శాస్త్రం ఎందుకు చెప్పారువారు రాసిన శాస్త్రంలో ఈ బాసర్‌ శ్రీపంచమి గురించి ఎందుకు రాయలేదు? అని కొంతమంది పండితులు ప్రశ్నిస్తున్నారు.వారి ప్రశ్నలు కూడా సబబే. తారాబలంగ్రహబలం లేని రోజులలో ముహూర్తం చేయకూడదు. మూఢమి , ఆషాఢంభాద్రపదంపుష్య మాసములలో చేయరాదు. విదియతదియపంచమిసప్తమిదశమిఏకాదశిత్రయోదశి తిధులు విశేషం. మంగళవారం నిషేధం. ఆది శనివారాలలో మాధ్యమం. అలాగే ‘ప్రదగ్గతే భాస్వతి పంచమేబే ప్రాప్తేక్షర స్వీకరణం శిశూనాం’ అన్నారు కావున ఉత్తరాయణం విశేషం. అయిదవ సంవత్సరం అక్షరాభ్యాసమునకు విశేషం. హస్తపునర్వసుస్వాతీఅనూరాధఆర్ద్రరేవతీఅశ్వినీచిత్తశ్రవణ నక్షత్రములు విశేషం. లగ్నాత్ అష్టమ స్థానము నందు ఉంటే శుభ పాపగ్రహం ఏదైనా చెడు ఫలితాలే ఇస్తుంది. అందువలన అష్టమ శుద్ధి కావాలి. కేవలం పూర్వాహ్ణంలోనే (మధ్యాహ్నం 12 గంటల లోపు)  కార్యక్రమం విశేషం. 3,6,10,11 స్థానములు లగ్నాత్ పాప గ్రహములతో కూడిన యెడల విశేషం. 1,2,4,5, 7,9,12,10 లలో 11లోను శుభ గ్రహములు వుండాలి. చంద్రుడుగురువు మనసు విద్యలకు కారకులు కావున వారు బలంగా వున్న ముహూర్తం విశేషంగా చూడాలి. ‘ఉత్తరాయణే సూర్యే కుంభ మాసం వివర్జయేత్’ ఉత్తరాయణంలో కుంభ మాసం విసర్జించాలి. ఇంత శాస్త్రంతో పని లేకుండా శ్రీపంచమిదసరాలలో మూలా నక్షత్రం విశేషం అంటే  సబబు కాదు.ముహూర్త దర్పణంముహూర్త సుధ లలో పేర్కొనబడిన అక్షరాభ్యాసానికి పనికివచ్చే నక్షత్రాల లిస్టులో ‘మూలా నక్షత్రం’ లేదు. పంచాంగాలలో అక్షరాభ్యాస నక్షత్ర లిస్ట్ లో కూడా మూలా నక్షత్రం లేదు.

11.ఉపనయనం:
అక్షరాభ్యాసం లాంఛనంగా అక్షరాలు దిద్దించడమైతే వాస్తవంగా పిల్లలను విద్యార్జన కోసం గురువు దగ్గరకు పంపే ముందు జరిపే సంస్కారం ఉపనయనం. సాంస్కృతికంగా ఇది అతి ముఖ్యమైన సంస్కారం. అక్షరాభ్యాసంతో ప్రాథమిక విద్య మొదలైతే ఉన్నతవిద్య ఉపనయనంతోనే మొదలవుతుందనుకోవచ్చు. ఉపనయనం జరగడాన్ని సాంస్కృతికంగాఆధ్యాత్మికంగా రెండవ పుట్టుకగా భావిస్తారు. భౌతిక జననం రోత కలిగించేది, ఉదాత్తమైనది కాదని భావన.ఉపనయనానంతరం క్రమశిక్షణవిద్యార్జనల ద్వారా పొందే రెండవజన్మ పవిత్రమైనదిఉదాత్తమైనది అని పండితుల భావన.
      ఐతే ఉపనయన ఉద్దేశాలుఅర్థాలు కాలంతోబాటే మారుతూ వచ్చాయి. అథర్వణ వేదంలో ఉపనయనాన్ని గురువు విద్యార్థి యొక్క బాధ్యతలు తీసుకోవడం అనే అర్థంలో వాడితే, తర్వాతికాలంలో గురువు పవిత్ర మంత్రోపదేశం చేయడమే ఉపనయనంగా భావించడం జరిగింది. హిందూ మతంలో అతిపవిత్రముశక్తివంతమైన మంత్రంగా భావించబడే గాయత్రి మంత్రాన్ని ఉపనయనమప్పుడు ఉపదేశిస్తారు. అంతేగాక ఉపనయనం ఉన్నతవిద్యకు ఆరంభంగా గాక మతపరమైన తంతు ద్వారా పొందే రెండవ పుట్టుకగానే గుర్తింపు పొందింది.
ఉపనయనానికి తగిన వయస్సు:- బ్రాహ్మణుడికి ఎనిమిది సంవత్సరాలుక్షత్రియుడికి పదకొండు సంవత్సరాలువైశ్యుడికి పన్నెండు సంవత్సరాలు.
గరిష్ఠ వయోపరిమితి:- బ్రాహ్మణుడికి పదహారు సంవత్సరాలుక్షత్రియుడికి ఇరవైరెండు సంవత్సరాలువైశ్యుడికి ఇరవైనాలుగు సంవత్సరాలు.
      కాలం గడిచే కొద్దీ యజ్ఞోపవీతం ధరించడమే ఈ సంస్కారంలో అతిప్రధానభాగంగా మారింది. ఉపనయనం చేయించుకునేవారు సూర్యునివైపు చూస్తూ ఉండగా వారికి దీర్ఘాయుష్షుపవిత్రతబలంతేజస్సు కలగాలని కోరుతూ గురువు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. ద్విజులు ఎల్లవేళలా ధరించే యజ్ఞోపవీతం వారికి తమ సామాజికఆధ్యాత్మిక బాధ్యతలను సదా గుర్తుచేస్తూ వారి జీవితం నిరంతరం యజ్ఞజ్వాలలంత పవిత్రంగా సాగడానికి తోడ్పడుతుంది.

12.వేదారంభం:
 సమవర్తన సంస్కారాన్ని చక్కగా ముగించేందుకే వేదారంభం. అతిపురాతన ధర్మశాస్త్రాల్లో వేదారంభం గానీదీని తర్వాతిదైన కేశాంతం గానీ కనిపించవు. మొదట్లో ఉపనయనంతోనే వేదవిద్యారంభం చేసేవారు. కానీ తర్వాతికాలంలో వేదవిద్యతో బాటే ఇతర సామాజికవైజ్ఞానిక శాస్త్రాలు అభివృద్ధి చెందాక వేదవిద్యారంభానికి విడిగా మరో సంస్కారం అవసరమైంది. ప్రతి విద్యార్థి తన వంశం వారు నైపుణ్యం సాధించిన వేదాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. అందుకే ఈ సంస్కారం ఒక్కో వర్గానికి చెందిన విద్యార్థులకు ఒక్కో రకంగా ఉంటుంది. రెండు వేదాలను అధ్యయనం చేసినవారు ద్వివేదిమూడు వేదాలను అధ్యయనం చేసినవారు త్రివేదినాలుగు వేదాలను అధ్యయనం చేసినవారు చతుర్వేది.

13.కేశాంత:
 పదహారేళ్ళ వయసొచ్చాక మొట్టమొదటిసారి గడ్డం గీసుకోవడానికి (గీయించుకోవడానికి) సంబంధించినది ఈ సంస్కారం. యౌవనారంభదశలోని చాపల్యాలకు లొంగకుండా మరింత జాగరూకులై మెలగవలసిన అవసరాన్నిబ్రహ్మచర్యం యొక్క ప్రాధాన్యతను ఈ సంస్కారం గుర్తుచేస్తుంది. ఈ సంస్కారానికి సంబంధించిన తంతు దాదాపు చూడాకరణను పోలి ఉంటుంది. ఈ సంస్కారం జరిపేటప్పుడు చివర్లో విద్యార్థి తన గురువుకు ఒక ఆవును దానంగా ఇస్తాడు. అందుకే కేశాంతాన్ని గోదానమని కూడా అంటారు.

14.సమావర్తన:
చదువు ముగించుకుని విద్యార్థి గురుకులాన్ని వదిలి వచ్చేటప్పుడు ఈ సంస్కారాన్ని నిర్వహిస్తారు. దీన్నే స్నాతకమని కూడా అంటారు. విద్యార్థి తాను అప్పటివరకు పాటించిన బ్రహ్మచర్యాశ్రమం యొక్క గొప్పదనాన్ని గుర్తిస్తూయజ్ఞయాగాదులను ముగించేటప్పుడు చేసే అవభృతస్నానం చేస్తాడు. క్రమశిక్షణతో మెలగి విద్యార్జనలో ఉత్తీర్ణుడైన విద్యార్థిని విద్యాసాగరాన్ని ఈదిన స్నాతకుడు లేక నిష్ణాతుడుగా గుర్తించడం జరుగుతుంది. ఇప్పుడు కూడా విశ్వవిద్యాలయాలు ఉత్తీర్ణులైన విద్యార్థులకు పట్టా ప్రదానం చేయడాన్ని స్నాతకోత్సవమనే అంటారు.
      సమావర్తనతో చదువు పూర్తి చేసుకుని ఇంటికి తిరిగిరావడం విద్యార్థి జీవితంలో అతి కీలకమైన ఘట్టం. స్నాతకుడు పెళ్ళి చేసుకుని గృహస్థ జీవితం గడపడానికైనాతాను గడించిన వైదిక విజ్ఞానంతో భౌతిక మానసిక బంధాలకు దూరంగా జీవితం గడపడానికైనా సిద్ధంగా ఉంటాడు. మొదటిమార్గం పాటించేవాళ్ళను ఉపకుర్వనులనిరెండవ వర్గం వారిని నైష్ఠికులని అంటారు. ఏ మార్గం పాటించడానికైనా గురువు అనుమతి తప్పనిసరి. అప్పటివరకు విద్యార్థి దశలో గురువుతోనే ఉన్నా ఆయనకు రుసుమేమీ చెల్లించకుండానే ఆయన్ని సేవించుకుంటూ విద్యను పొందిన విద్యార్థి ఇంటికి తిరిగొచ్చేటప్పుడు మాత్రం తన స్థోమతుకు తగినట్లు గురుదక్షిణ సమర్పించుకుంటాడు. గురుదక్షిణగా ఏమీ ఇవ్వలేకపోయినా గురువు అనుమతి మాత్రం తప్పనిసరిగా తీసుకోవాలి.

15.వివాహము:
హిందూ సంస్కారాల్లో కేంద్రస్థానం వివాహానిది. వధువుకు తగిన వరుణ్ణివరుడికి తగిన వధువును ఎంపిక చేయడం వివాహంలో అతి ముఖ్యమైన ఘట్టం. వివాహం సమయంలో వధూవరులచే పలుమంత్రాలు చెప్పించబడుతుంటాయి. ఆ సమయంలో వరుడు, “భగఆర్యమసవితపురంధి అనే దేవతలు నిన్ను నాకు అనుగ్రహించగానా జీవితం సుఖమయం అయ్యేందుకు నీ చేతిని నేను పట్టుకున్నాను” అని చెబుతాడు. పుట్టబోయే జీవి జీవితం ఇక్కడనుంచి మొదలౌతుంది అని అంటారు. అందుకే దీనిని కల్యాణం శుభకరం అంటారు. క్షేత్రం, బీజం రెండు సుఖసంతోషాలతో ఆరోగ్యవంతంగా ఉంటేనే కదా ఫలం చక్కగా ఉండేది. వధూవరులకు ధర్మబద్ధ జీవితం అలవరచి తగిన క్షేత్రం, బీజం సిద్ధం చేయటానికి ఉద్దేశించారు.
వివాహంలో ముఖ్యమైన ఘట్టాలు:
వాగ్ధానం: పెళ్ళి ఖాయపరచుకోవడం (నిశ్చితార్థం)
వర-వరణం: వరుడిని లాంఛనప్రాయంగా అంగీకరించడం
కన్యాదానం: కన్య తండ్రి లేక తండ్రి స్థానంలో ఉండి ఆమె బాగోగులు చూసేవారు కన్యను వరుడికి అప్పజెప్పడం
వివాహ-హోమం: పెళ్ళిలో చేసే హోమం
పాణిగ్రహణం: వధూవరులు ఒకరి చేతినొకరు పట్టుకోవడం
హృదయస్పర్శ:హృదయాన్ని తాకడం
సప్తపది: సౌభాగ్యానికిదాంపత్య సాఫల్యానికి గుర్తుగా కలిసి నడిచే ఏడడుగులు
అశ్మారోహణ: సన్నికల్లు తొక్కడం
సూర్యావలోకనం: జరుగుతున్న పెళ్ళికి సాక్ష్యంగా నిలిచిన సూర్యుణ్ణి చూడడం
ధృవదర్శనం: స్థిరత్వానికి సూచిక ఐన ధృవనక్షత్రాన్ని చూడడం
త్రిరాత్ర-వ్రతం: మూడురాత్రులు విడిగా ఉండడం
చతుర్ధి-కర్మ: లాంఛనంగా వధూవరులు కలిసే నాలుగోనాటిరాత్రి జరిపే సంబరం
హిందూ వివాహం ఆధునిక అర్థంలో చెప్పుకునే సామాజిక వ్యవస్థ మాత్రమే కాదు. మతపరంగా కూడా ఎంతో పవిత్రమైన వ్యవస్థ. పెళ్ళయాక భార్యాభర్తల మధ్య కనిపించని మూడో అనుసంధానకర్త కూడా ఉంటుంది. అదే దాంపత్య ధర్మం అనే బాధ్యత. అందుకే పెళ్ళి అనేది విడదీయరాని బంధం. దంపతుల మధ్య ఏమైనా పొరపొచ్చాలు వచ్చినా ఆ ధర్మమే వారిని ఒకటిగా కలిపి ఉంచుతుంది.

వానప్రస్థం:
బాధ్యతలను వారసులకు అప్పగించి వచ్చే జన్మకై వానప్రస్తాశ్రమంలోకి అడుగు పెట్టేటప్పుడు జరిపే శుబారంభ కర్మ.
 సన్యాసం:
   ఐహిక బంధాల నుంచి విముక్తి పొందటం కోసం సన్యాసం స్వీకరణ సందర్భంలో చేసే సంస్కారం.)

16.అంత్యేష్టి:
హిందువుల జీవితంలోని చివరి సంస్కారం అంత్యేష్టి. ఒక హిందువు తన జీవితాన్ని వివిధ దశల్లో వివిధ సంస్కారాల ద్వారా పవిత్రం చేసుకున్న తర్వాత మరణానంతరం అతడి వారసులు అతడి ఆత్మకు శాంతిసద్గతులు కలగాలని కోరుతూ చేసేవి అంతిమ సంస్కారాలు లేక అంత్యేష్టి.
మరణానికి ముందు:- మరణము ఆసన్నమైన వ్యక్తి తన కుటుంబసభ్యులనుబంధువులనుఆత్మీయులను పిలిపించుకుని కన్నుమూసే ముందు అందరినీ ఒకసారి చివరిసారిగా చూసుకునివారికిప్రపంచానికి వీడ్కోలు పలుకుతారు. వారు తృప్తిగా కన్నుమూయడానికిమరణానంతరం వారు సంతోషంగా ఉండడానికి వీలుగా వారిపేరుమీదవీలైతే వారి చేతుల మీదుగానే దాన ధర్మాలు జరుగుతాయి.
అంతిమయాత్రకు ముందు:- వారు జీవితపర్యంతం రగిలించిన పవిత్రాగ్నిలోకి ఆహుతులు సమర్పిస్తారు. దగ్గరివారు చనిపోతున్నవారి నోట్లో తులసితీర్థంగంగాజలం వదులుతారు.
పాడె:- శవాన్ని అంత్యక్రియలు జరిగేచోటికి తీసుకువెళ్ళడానికి ఏడుకట్లతో ప్రత్యేకంగా తయారుచేసిన పొడవాటి నిర్మాణం. శవాన్ని దానిమీదికి చేరుస్తారు.
అంతిమయాత్ర:- మరణించినవారి బంధువులుమిత్రులుఆత్మీయులందరూ అంతిమయాత్రలో పాల్గొంటారు. అందరూ కలసి శ్మశానస్థలిని చేరుకుంటారు.
అనుస్తరణి:- జీవితసాగరాన్ని దాటి అవతలికి వెళ్ళేటప్పుడు సహాయకారిగా ఉంటుందనే నమ్మకంతో హిందువులు పవిత్రంగా భావించే గోవును మరణించినవ్యక్తి తరపున దానంగా ఇస్తారు.
దింపుడుకళ్ళెం:- భగవదనుగ్రం వల్లోచనిపోయినవారి ఆయుస్సు ఇంకా తీరలేదని యమధర్మరాజు వెనక్కి పంపెయ్యడం వల్లో చనిపోయినవారు తిరిగి బ్రతుకుతారనే నమ్మకంతోబ్రతకాలనే ఆశతో అంతా సిద్ధమయ్యాక కూడా అంత్యక్రియలను కొన్ని నిమిషాలసేపు ఆలస్యం చేయడానికి పాడెను శ్మశానానికి తీసుకువెళ్ళే దారి మధ్యలో దించి శవం చెవిలో మూడసార్లు పేరుపెట్టి పిలుస్తారు. ఒక్కోసారి మరణించారని పొరబాటుగా భావించినవారు తర్వాత తిరిగి లేచిన వ్రుత్తాంతాలవల్ల ఈ ఆచారం పుట్టి ఉండవచ్చు.
దహనం:- శరీరాన్ని దహనం చెయ్యడానికి చితిపై ఉంచేముందు శరీరానికి జలంతో అభిషేకం చేయించడంతోబాటు అంత్యక్రియల్లో భాగంగా వేసే కర్మ కొంత ఉంటుంది. అది పూర్తయాక శరీరాన్ని చితిపై ఉంచి వేదమంత్రాల మధ్య నిప్పంటిస్తారు.
ఉదకకర్మ:- చితిపై మంటల మధ్య శరీరం కాలిపోగా ఆ వేడిని తగ్గించి మరణానంతర జీవుడిని చల్లబరచడానికి ఉదకం (నీళ్ళు) సమర్పిస్తారు.
ఓదార్పు:ఆత్మీయుడిని పోగొట్టుకుని దు:ఖంలో ఉన్నవారికి పెద్దలు జీవితమింతేనని తెలుపుతూ మతగ్రంథాల్లో నుంచి గాథలనుజీవితసత్యాలను బోధపరిచి దు:ఖభారాన్ని తగ్గిస్తారు.
అశౌచం:- చావు సంభవించిన ఇంటిలో నివాసముండడం మంచిది కాదనే నమ్మకంతో సంవత్సరకాలం ఆ ఇంటిని ఖాళీగా ఉంచుతారు. దీన్ని సూతకమని అంటారు (సూతకం రెండురకాలు: జాతాశౌచంమృతాశౌచం).
అస్థిసంచయనం:- శరీరం కాలి బూడదైనా ఎముకలు పూర్తిగా కాలిపోవు. ఆ బూడిదలో మిగిలిపోయిన ఎముకలను ఏరి తీసుకోవడం అస్థిసంచయనం.
శాంతికర్మ,
స్మారకం,
శ్రాద్ధం,
సపిండాకరణ.


~~~~~~ ఓం నమశ్శివాయ ~~~~~
Comments

Popular Posts