హిందు సాంప్రదాయం ప్రకారం నేరుగా నేల మీద పెట్టకూడని (కింద పెట్టకూడని) కొన్ని ముఖ్యమైన వస్తువులు...

·    పూజ సామగ్రి: పూజకు ఉపయోగించే పూలు, కొబ్బరికాయ, అగర్ బత్తీలు, కర్పూరంలాంటి వస్తువులు నేరుగా నేలమీద పెట్టరాదు. ఒక వేళ కింద పెడితే అవి పూజకు అనర్హము. వాటిని పూజకు  ఉపయోగిస్తే అశుభం జరుగుతుందని పెద్దల సూచన
· శివ‌లింగం. శివ‌లింగం నేల‌పై అస్స‌లు పెట్ట‌కూడ‌ద‌ు. అలా చేస్తే అన్నీ స‌మ‌స్య‌లే ఎదుర‌వుతాయి. ఒక వేళ నేల‌పై పెట్టాల్సి వ‌స్తే చెక్క‌తో చేయబడిన  శుభ్ర‌మైన ఉప‌రిత‌లం లేదా ప్రత్యేకంగా చేయబడిన పీట పై ఉంచాల‌ట‌.
·       శంఖువు: శంఖువులో సాక్షాత్తూ ల‌క్ష్మీ దేవి కొలువై ఉంటుంది. కాబ‌ట్టి దాన్ని కూడా నేల‌పై పెట్ట‌రాదు. పెడితే ఆర్థిక స‌మ‌స్య‌లు ఎదురవుతాయి.
·  దీపం: దేవుడి ముందు పెట్టే దీపాల‌ను నేల‌ మీద పెట్ట‌రాదు. వాటిని వెలిగించినా, వెలిగించకపోయినా ఎల్ల‌ప్పుడూ వాటిని శుభ్ర‌మైన వ‌స్త్రంపైనే ఉంచాలి. ఇలా నేల‌పై పెట్ట‌రాదు. అలా చేస్తే దేవుళ్లు, దేవత‌ల‌ను అవ‌మానించిన‌ట్టే అవుతుంద‌ట‌.
·       జంధ్యం: జంధ్యం ధ‌రించే ఆచారం ఉన్నవారు దాన్ని నేల‌పై మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పెట్ట‌రాదు. జంధ్యం త‌ల్లిదండ్రులు, గురువుల‌కు ప్ర‌తి రూపం కావున దానిని కింద పెడితే వారిని అవ‌మానించిన‌ట్టే అవుతుంది. అందుక‌ని దాన్ని ఎప్పుడూ నేల‌పై పెట్ట‌కూడ‌దు.
·       బంగారం: బంగారాన్ని సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా చూస్తాం. అలాంటి బంగారాన్ని నేలపై పెడితే లక్ష్మీదేవి ఆగ్రహానికి లోనై అనేక కష్టాలు పడతారు. అలా చేస్తే వారి వ‌ద్ద ధ‌నం నిల‌వ‌కపోగా ఇతర స‌మ‌స్య‌లు కుడా వస్తాయట.
·       దేవీ దేవతలకు సంబంధించిన చిత్రపటాలు, పూజకు సంబంధిన పుస్తకాలు కుడా నేరుగా నేల మీద పెట్టరాదు.

Comments

Popular Posts