జ్ఞానాన్ని ఎక్కడినుంచో, ఎవరి దగ్గరనుంచో ఉపదేశం పొంది తెచ్చుకునేది కాదు.....

"జ్ఞానాన్ని ఎక్కడినుంచో, ఎవరి దగ్గరనుంచో ఉపదేశం పొంది తెచ్చుకునేది కాదు. జ్ఞానం తనలోనేవుంది, అజ్ఞానమనే తెరని తొలగించగలిగితే చాలు, జ్ఞాన దర్శనమౌతుంది. గొప్ప జ్ఞానికావాలంటే మనిషి, ముందు అతని దేహానికి యోగం, ఆరోగ్యం కావాలి. పూర్వజన్మల, ఈ జన్మసంస్కారం కాలిపోవాలి. అహం నశించాలి. నిజం మాట్లాడారో.... అర్ధం కాదు మనుష్యులకి. అబద్ధం మాట్లాడటం ఇష్టంలేదు. అందుకని మౌనులౌతారు జ్ఞానులు. జ్ఞానం ఆంటే మన మనసు తెలుసుకునేదంతా జ్ఞానమే. ఎన్నో విషయాలను విడివిడిగా తెలుసుకొని, చివరకు అవన్నీ ఈశ్వరుడని తెలుసుకోవడం - అదే అసలు జ్ఞానం." ........           -చలం

Comments

Popular Posts