యవ్వనం లో చెడు స్నేహాలు, గొడవలు, కొట్లాటలతో గడిపిన అన్నా హజారే ‘సైన్యం’ లో ఎందుకు చేరారు? గాంధేయవాది గా ఎలా మారారు?

·    అన్నా హజారే ఒక నిరుపేద కుటుంబంలో జన్మించాడు. ఆయన అసలు పేరు -కిషన్ బాబురావ్ హజారే.
·       7వ తరగతి పూర్తి చేసిన తరువాత అన్నా కుటుంబ సమస్యల వలన ఏదో ఒక ఉద్యోగం చేయవలసి వచ్చింది. ముంబై లోని దాదర్‌లో ఒక పూల వ్యాపారి వద్ద పనిచేస్తూ నెలకు నలభై రూపాయలు సంపాదించేవాడు. ఇతడు క్రమంగా తన స్వంత పూల దుకాణాన్ని ప్రారంభించాడు. ఇతడి సోదరులలో ఇద్దరు ఆయన వ్యాపారంలో పాలు పంచుకోవడానికి ముంబై వచ్చారు. దీంతో కుటుంబ ఆదాయం నెలకు 700-800 రూపాయల వరకు పెరిగింది.
·    కొద్ది సంవత్సరాలలో అన్నా చెడు సహవాసాలలో కూరుకుపోయి తన సమయాన్ని, డబ్బును మానసిక బలహీనతలపై వృధా చేయడం ప్రారంభించాడు. చివరకు అతడు వీధిపోరాటాలు, కుమ్ములాటలలో కూడా పాలు పంచుకోసాగాడు, ప్రత్యేకించి గూండాలు మామూలు వ్యక్తిని వేధించడం చూస్తే చాలు, అన్నా వారితో పోరుకు సిద్ధమయ్యేవాడు. తన కుటుంబానికి క్రమంగా డబ్బు పంపించడం కూడా తగ్గిపోయింది. తన వ్యక్తిత్వాన్ని తనకు తానుగా పాడు చేసుకుంటున్నాడని ఆయన స్వగ్రామం 'రాలెగావ్'లో వార్తలు వ్యాపించాయి. అలా ఒక గొడవలో అన్నా ఒక వ్యక్తిని ఘోరంగా కొట్టాడు. తనను అరెస్టు చేస్తారనే భయంతో, అతడు రోజువారీ పనిలోకి సక్రమంగా రావడం, ఇంటికి రావడం కూడా మానేశాడు. ఈ కాలంలోనే (ఏప్రిల్ 1960) అతడు సైనిక రిక్రూట్‌మెంట్ ఇంటర్వ్యూలకు హాజరయ్యేవాడు చివరకు భారతీయ సైన్యంలో చేరడానికి ఎంపికయ్యాడు. 
·       శిక్షణ తర్వాత అతడు పంజాబ్‌ లో ఒక ట్రక్కు డ్రైవర్‌గా నియమించబడ్డాడు. ఇంటికి చాలా దూరంలో ఉంటూ, స్నేహితులందరి నుంచి విడిపోవలసి రావడంతో అన్నా ఒంటరితనంతో బాధపడ్డాడు. అతడు నిరాశా నిస్పృహల బారిన కూడా పడ్డాడు, జీవితానికి అర్థంలేకుండా పోతోందనే అనుభూతిలో మునిగిపోయాడు. ఒక దశలో తన జీవితాన్ని ముగించుకోవాలని కూడా అతడు నిర్ణయించుకుని ఆత్మహత్య పత్రం కూడా రాశాడు. అయితే, మళ్ళీ అలోచించి తన ఆత్మహత్య, చిన్నారి చెల్లెలు వివాహ ప్రయత్నాలను దెబ్బతీస్తుందని గుర్తించాడు. అందుచేత, తన సోదరి వివాహం పూర్తయేంతవరకు తన ఆత్మహత్యా ప్రయత్నాన్ని వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. 
·       ఈలోగా, కొన్ని సంఘటనలు ఆయన జీవితానికి కొత్త మార్గాన్ని ఇచ్చాయి. 1965 ఇండో-పాక్ యుద్ధకాలంలో, పశ్చిమ ప్రాంతంలో ఒకచోట సైనిక వాహనాన్ని నడుపుతున్నప్పుడు తమ నెత్తిమీద పాకిస్తాన్ విమానం ఎగురుతుండటం చూశాడు. తాను, తన సహోద్యోగులు వెంటనే వాహనం మీదనుంచి దూకి సమీపంలోని పొదలలో దాక్కుని భూమిపై పడుకుండిపోయారు. ట్రక్కు పేల్చివేయబడి ఆయన స్నేహితులందరూ చనిపోయారు.కాని అన్నా మాత్రం గాయపడకుండా తప్పించుకున్నాడు. 
·       మరొక సంఘటనలో, అన్నా నాగాల్యాండ్ లో పనిచేసేటప్పుడు మృత్యువు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. ఒక రాత్రి, అజ్ఞాత నాగాలు సైనిక గస్తీ కేంద్రంపై దాడిచేసి ఆయన సహచరులందరినీ చంపేశారు. ఆ సమయంలో కాలకృత్యాలు తీర్చుకోవడం కోసం వెళ్లిన అన్నా చివరకు తానొక్కడే బతికిబట్టకట్టాడు. ఈ రెండు ఘటనలూ అన్నా మనసుపై బలమైన ముద్ర వేశాయి. తన జీవితాన్ని వృధా పర్చుకోరాదని అతడు గుర్తించాడు, దేవుడు తన జీవితాన్ని విలువైనదిగా భావిస్తున్నాడని ఆయన నమ్మసాగాడు. లేకుంటే, పై ఘటనలలో ఏదో ఒకదానిలో తన సహచరులతో పాటు తాను కూడా చనిపోయి ఉండేవాడినని అతడు భావించాడు.
·       ఈ ఆలోచనలు తన మనస్సులో చెలరేగుతున్న సమయంలోనే, అతడు న్యూఢిల్లీ స్టేషను లోని ఒక పుస్తక విక్రయకేంద్రంలో స్వామి వివేకానంద రాసిన జాతి నిర్మాణం కోసం యువతకు పిలుపు అనే పేరుగల చిన్న పుస్తకాన్ని చూశాడు.
·   వివేకానందుడి ఆలోచనలు ఆయన జీవితానికో అర్థం కల్పించాయి, తన శేష జీవితాన్ని సమాజం కోసం పనిచేయడానికి అంకితం చేయాలని అతడు నిర్ణయించుకున్నాడు. తర్వాత అతడు వివేకానంద, మహాత్మా గాంధీ, ఆచార్య వినోబా భావే రచించిన పలు పుస్తకాలను చదివాడు. అతడిలో 1970 నుంచి ఆలోచనలు పెరగడం ప్రారంభించాయి. తాను పెళ్ళి చేసుకోవడం లేదనే తన నిర్ణయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తన చిన్న తమ్ముళ్లకు వివాహాలు జరిపించమని అతడు తల్లిదండ్రులను ఒత్తిడి పెట్టసాగాడు. తన స్వార్థ ప్రయోజనానికి వెలుపల జీవితం గడపాలని తనలో కొత్తగా బయటపడిన ఆకాంక్షతో తాను సైన్యం నుంచి స్వచ్ఛంద విరమణ చేసి స్వంత గ్రామానికి సేవ చేయాలని తపన పడేవాడు. 
· తన స్వగ్రామం రాలేగావ్ సిద్ధిని మెరుగుపర్చాలని అతడు కోరుకున్నాడు కాని, ఎలా మెరుగుపర్చాలో, ఎక్కడ ప్రారంభించాలో అతడికి ఏమీ తెలీదు. సెలవుపై తన గ్రామానికి వస్తూ, గ్రామ శివార్లలోని శిలలపై కూర్చుని రోజుల తరబడి గడిపేవాడు. ముంబైలో, సైన్యంలో చాలావరకు జీవితాన్ని గడిపేసిన అన్నాకు గ్రామంలో పెద్దగా స్నేహితులు లేరు. పైగా, దాదర్ స్టేషను‌ వెలుపల పూలమ్ముకున్న రోజులలో అతడిని ఒక ఆగ్రహావేశపరుడిగా రాలెగావ్ ప్రజలు చూశారు కాని, అన్నా హజారేలో పరివర్తను వారు ఊహించలేకపోయారు. 
·  1971లో, అన్నాకు ముంబైకి బదిలీ అయ్యింది. ముంబై నుంచి అతడు గ్రామాన్ని క్రమం తప్పకుండా సందర్శించడం ప్రారంభించాడు. 1971 నుంచి 1974 మధ్య కాలంలో గ్రామీణ ప్రజలతో అతడికి సాన్నిహిత్యం పెరిగింది. పద్మావతీ ఆలయానికి తైల వర్ణంతో మెరుగులు దిద్దేందుకోసం ఇతడు రూ.3000 పైగా ఖర్చుచేశాడు. గ్రామీణ యువతతో అతడు మంచి సంబంధాలు పెట్టుకున్నాడు కూడా. 
·   1974లో, అతడిని ఉద్యోగరీత్యా జమ్మూకు మార్చారు. 1975లో, అతడు సైన్యంలో పదిహేను సంవత్సరాల సేవను పూర్తి చేశాడు ఫించన్ రావాలంటే ప్రతి సైనికుడూ 15 ఏళ్ల సర్వీసును పూర్తి చేసి ఉండాలి. అతడు పదవీ విరమణ కోరుకున్నాడు. చివరికి 1975 ఆగస్టు నెలలో అతడు సైన్యం నుంచి బయటపడ్డాడు, మంచి పనులకోసం అతడు తిరిగి రాలెగావ్ సిద్ధికి తిరిగి వచ్చేశాడు.
అప్పటినుండీ గాంధేయవాదంలో నడుస్తూ,ఎన్నో పోరాటాలను, ఉద్యమాలను చేసి విజయం సాధించిన సంగతి మనకు తెలిసిందే.
-----
అన్నా హజారే ప్రసంగాలు, ఉపన్యాసాలు తత్వశాస్త్రం, హిందూ ఆధ్యాత్మికవాదం ,స్వామి వివేకానంద, మహాత్మాగాంధీ మరియు వినోబాభావే వంటి మహానుభావులనుంచి వెలువడిన సుభాషితాల సమ్మేళనంగా ఉంటుంది. ఈ తత్వశాస్త్రానికి,తన ఆదర్శ గ్రామ భావన యొక్క పునాదికి సంబంధించిన అన్నా చెప్పిన కొన్ని మాటలు:
·  నేలమీద మనం చూసే ప్రతి పెద్ద చెట్టు వెనకాల, నేల లోపల కలిసిపోయి ఉన్న గింజ తప్పక కనిపిస్తూంటుంది. .
·   గ్రామీణాభివృద్ధి అనేది సారాయి వినియోగం, అమ్మకాల తగ్గింపు మీదే అధారపడి ఉంటుంది .
·    వ్యక్తిని మార్చకుండా గ్రామాన్ని మార్చడం అసాధ్యం. అదేవిధంగా గ్రామాలను మార్చకుండా దేశాన్ని మార్చడం కూడా అసాధ్యం .
·       గ్రామాలు అభివృద్ధి చెందాలంటే, రాజకీయాలను పక్కన బెట్టాలి .
·       ఆధ్యాత్మికత లేని విద్య అభివృద్ధికి సహకరించదు .
·       డబ్బు మాత్రమే అభివృద్ధిని తీసుకురాలేదు కాని, అది అవినీతిని కొనితెస్తుంది .
·       గ్రామీణాభివృద్ధి ప్రక్రియలో, సామాజిక, ఆర్థికాభివృద్ధి పక్కపక్కనే కొనసాగాలి .
·       సామాజిక పరవర్తనా కృషి ఏమంత సులభం కాదు అలాగని అసాధ్యమూ కాదు .
·     అన్ని రాజకీయాలు మరియు సామాజిక కృషి యొక్క అంతిమ లక్ష్యం సమాజం మరియు జాతిని అభివృద్ధి పర్చే విధంగా ఉండాలి .
·  కేవలం పుస్తకాలు మాత్రమే భావి పౌరులను రూపొందించలేదు, దానికి సాంస్కృతిక పెట్టుబడులు అవసరం .
·       మంచి పౌరులను తయారు చేయడానికి విద్యాసంస్థలు మాత్రమే సరిపోవు, ప్రతి ఇల్లూ ఒక విద్యా కేంద్రంగా మారాలి .
·       లోలత్వం వ్యాధికారకం కాగా త్యాగం విజయసాధనవైపు పయనిస్తుంది .
· అన్నీ ఉచితంగా కావాలని ఎవరూ కోరుకోకూడదు; ధర్మనిధులను ఆశించడం అనేది మనుషుల్ని సోమరిపోతులుగా, పరాధీనులుగా మారుస్తుంది .
·    స్వార్థ ప్రయోజనాన్ని పక్కనబెట్టి వ్యక్తి నేర్చుకోవడానికి ప్రయత్నిస్తే, అతడు మానసిక శాంతిని పొందడం ప్రారంభిస్తాడు
·      ప్రపంచానికి సంబంధించిన అన్ని పనులనూ చేస్తూనే ప్రపంచ విషయాలనుంచి దూరంగా ఉంటున్నవాడే నిజమైన ఋషి .
·       స్వార్థం నుంచి విముక్తి అనేది ప్రజల విముక్తిలో భాగంగా ఉంటుంది .
·  అనుభవమే మార్గాన్ని బోధిస్తుంది కాని, ప్రతి పథకాన్ని ముందుకు తీసుకుపోవడానికి యువతే మార్గం .
Comments

Popular Posts