శివాలయంలో ప్రదక్షిణలు ఏవిధంగా చేయాలి?శివాలయంలో ప్రదక్షిణ ఏవిధంగా చేయాలి?
శివాలయంలో చేసే ప్రదక్షిణ, అన్ని దేవాలయాలలో చేసే ప్రదక్షిణకి భిన్నంగా ఉంటుంది. ఏ గుడిలోకి వెళ్ళినా సర్వ సాధారణంగా ప్రదక్షిణ చేస్తారు. కానీ ఇతర దేవాలయాలలో చేసిన విధంగా ఈశ్వరుని దేవాలయంలో ప్రదక్షిణ చేయకూడదు. శివాలయాల్లో ఏ విధంగా ప్రదక్షిణ చేయాలో లింగపురాణంస్పష్టంగా వివరించింది. శివాలయంలో చేసే ప్రదక్షిణని చండీ ప్రదక్షిణం లేదా సోమసూత్ర ప్రదక్షిణ అంటారు. ఈ చండీ ప్రదక్షిణం చేయడం వలన కలిగే గొప్ప ఫలితాల గురించి పురాణాల్లో వివరంగా పేర్కొన్నారు.
శివాలయంలో చేయవలసిన ప్రదక్షిణ గురించి లింగ పురాణంలో ప్రస్తావించబడినది:
వృషంచండ వృషం చైవ సోమ సూత్రం పునర్వృషం|
చండంచ సోమ సూత్రంచ పునశ్చండం పునర్వృషం!|
శివ ప్రదక్షిణే చైవ సోమ సూత్రం నలంఘయేత్|
లంఘనా త్సోమ సూత్రస్య నరకే పతనం ధృవం||
                              శివాలయంలో ధ్వజస్థంభం వద్ద ప్రదక్షిణ ప్రారంభించి, ధ్వజస్థంభం నుండి చండిశ్వరుని వరకూ ప్రదక్షిణ చేసి చండిశ్వరుడిని దర్శించుకొని అక్కడ నుండి మళ్లీ వెనక్కి తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు వచ్చి ఒక్క క్షణం ఆగి మరలా ప్రదక్షిణ మొదలు పెట్టి సోమ సూత్రం (అభిషేక జలం బయటకు పోవు దారి) వరకు వెళ్లి, తిరిగి ధ్వజస్థంభం దగ్గరకు రావాలి. అలా వస్తే ఒక్క ప్రదక్షిణ పూర్తి అవుతుంది. వెనుదిరిగి నందిశ్వరుని చేరుకుంటే ఒక శివ ప్రదక్షిణ పూర్తి చేసినట్లు.ఈ విధంగా చేసే ఇలా చేసే ప్రదక్షిణం సాధారణంగా చేసే పది వేల ప్రదక్షిణాలతో సమానమని లింగ పురాణంలో పేర్కొనబడింది.ఇలా మూడు ప్రదక్షిణలు చేయాలి. 
శివునికి ప్రదక్షిణలు-ముఖ్యమైన సూచనలు:
1)    శివ ప్రదక్షిణలో సోమసూత్రం దాటరాదు.ఎందుకంటే ఆయనకు అభిషేకం చేసిన జలం సోమసూత్రం నుండి పోతుంది. అంతేకాక అక్కడ ప్రమధ గణాలు కొలువై ఉంటారు . అందుకే వారిని దాటితే శివుని ఆగ్రహానికి గురి అవుతారు.
2)    నందికి శివుని కి మధ్యలో నడవకూడదు.ఎందుకంటే సదా ఆయన చూపులు శివుని మీదే ఉంటాయి . 

3)    విగ్రహనికి ఎదురుగా నిలబడి ఏ దేవుడు లేదా దేవత దర్శనం చేసుకోకూడదు. ఎందుకంటే విగ్రహం నుండి వెలువడే శక్తి తరంగాలు నేరుగా మన మీద పడతాయి. వాటిని వాటి శక్తి మనం భరించలేం కనుక ప్రక్కన నిలబడి దర్శనం చేసుకోవాలని పెద్దలు చెబుతారు.

Comments

Popular Posts