నిద్ర లేచిన తరువాత వేటిని చూస్తే ఆ రోజంతా శుభప్రదంగా ఉంటుంది?

·  ప్రొద్దున నిద్రలేచిన వెంటనే సూర్యుడు, చందనం, తామర పుష్పం, బంగారం, దీపం, సముద్రం, పంటపొలాలు, శివలింగాలు, గోపురం, కుడి చేయి, భార్య మొహం, మృదంగం, మబ్బులతో కూడిన కొండలు, ఆవులు, చూడటం శుభఫలితాలను ఇస్తాయని  జ్యోతిష్య నిపుణులు సూచిస్తున్నారు.
·       నిద్రలేచిన వెంటనే లక్ష్మీదేవిని చూస్తే శుభఫలితాలుంటాయి. గోమాతను ఉదయం పూట చూడటం ద్వారా సానుకూల ఫలితాలను పొందవచ్చు.  
·       ఇక అర్థాంగి అయిన భార్య మొహం చూసిన వారికి సత్ఫలితాలు కలుగుతాయి.ఏ నోము నోచినా ఏ పూజ చేసిన భర్త పిల్ల శ్రేయస్సు కోసమే చేస్తుంది కనుక ఆమె ముఖాన్ని చూడటం ద్వారా మంచి ఫలితాలను పొందవచ్చు.
·     నిద్ర లేచిన  వెంటనే తల్లిదండ్రుల ముఖం చూస్తే లక్ష్మీనారాయణులను, శివపార్వతులను దర్శించిన ఫలితం కలుగుతుందని పండితులు అంటున్నారు.

  
ఇంటికీ ఆడబిడ్డ మహాలక్ష్మి అంటారు...ఇది నిజం.లేచిన వెంటనే మీ ఇంటి ఆడబిడ్డల ముఖము చూస్తే ఆ రోజంతా శుభమే.

కానీ లేచిన వెంటనే సాలె పురుగును చూస్తే ప్రతికూల ఫలితాలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని వారు చెప్తున్నారు. 

Comments

Popular Posts