వివాహ వేడుకలలో వదూవరులకు పసుపు రాసి మంగళ స్నానాలు ఎందుకు చేయిస్తారు?

ప‌సుపును నిత్యం వంట‌లలోనే కాక శుభ‌కార్యాల్లోనూ ఉప‌యోగిస్తుంటాం. ప్ర‌ధానంగా పెళ్లి విష‌యానికి వ‌స్తే పసుపు లేనిదే ఆ శుభ‌కార్యం ఉండ‌దు. కళ్యాణ వేడుకలో ప్ర‌తి సంద‌ర్భంలోనూ ప‌సుపు వాడ‌కం ఎక్కువే. ముఖ్యంగా వధూవ‌రుల‌కు చేయించే మంగ‌ళ స్నానానికి ముందు వారికి ప‌సుపు బాగా రాస్తారు.ఇలా చేయడం వెనుక చాలా ప్రయోజనాలు, నమ్మకాలు ఉన్నాయి.

·  ముఖంపై ఏర్ప‌డే మొటిమ‌లు, మ‌చ్చ‌లు వంటి వాటిని తొలగించ‌డంలో పసుపు బాగా ప‌నిచేస్తుంది. ప‌సుపు యాంటీ సెప్టిక్ లా పనిచేస్తుంది. శ‌రీరంపై అయిన దెబ్బ‌లు, గాయాలను త్వ‌ర‌గా మానేలా చేస్తుంది.వాటి స్థానంలో ఏర్ప‌డే మ‌చ్చ‌లను కూడా తొల‌గిపోతాయి.
·       ప‌సుపులో క‌ర్క్యుమిన్ అన‌బ‌డే శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్ ఉంటుంది. ఇది యాంటీ డిప్రెస్సెంట్‌గా ప‌నిచేస్తుంది. అనగా మాన‌సిక ఒత్తిడి, ఆందోళ‌న‌, అలసట, త‌ల‌నొప్పులను దూరం చేస్తుంది.
·       ప‌సుపును రాసి స్నానాలు చేయిస్తే వివాహ కార్య‌క్ర‌మంలో పాల్గొనే వ‌ధూ వ‌రులు మ‌రింత ప్ర‌కాశ‌వంతంగా కనిపిస్తారు.
·       హిందూ సాంప్ర‌దాయం ప్ర‌కారం ప‌సుపు అనేది శుభానికి చిహ్నంగా, ఆరోగ్యాన్ని క‌లిగించే ఓ ఔష‌ధిగా, సంప‌ద‌ను ఇచ్చే క‌ల్ప‌వ‌ల్లి గా భావిస్తారు.
·       శ‌రీరంలో చేరిన దుష్ట శ‌క్తుల‌ను పార‌దోలే ప‌వ‌ర్ పసుపుకి ఉంద‌ని మన పెద్దల నమ్మకం. అందుకే వ‌ధూవ‌రులపై ఎలాంటి దుష్ట గాలి, ధూళి లేకుండా ఉండేందుకు ప‌సుపు రాస్తారు.

·       ప‌సుపుతోపాటు చంద‌నం, రోజ్ వాట‌ర్ వంటి ప‌దార్థాల‌ను క‌లిపి వ‌ధూ వ‌రుల‌కు రాసి మంగ‌ళ స్నానాలు చేయిస్తారు. దీంతో వారిలో పెళ్లి క‌ళ మ‌రింత ఉట్టిప‌డుతుంద‌ని భావిస్తారు.

Comments

Popular Posts