లావు,బరువు తగ్గాలనుకునేవారు సరైన సమయం లో ఆహరం తీసుకోకపోతే ,ఎంత డైటింగ్ చేసినా వృధానే అట!

బరువు తగ్గడానికి చాలామంది డైటింగ్‌ అని తినే ఆహరం తగ్గిస్తుంటారు. కొందఱు ఉపవాసాల పేరుతో పస్తులుంటారు. ఇలా చేయడం వల్ల బరువు తగ్గక పోగా.... మరింతగా పెరిగే ప్రమాదం ఉందట. యూనివర్సిటీ ఆఫ్‌ అలబామా కు చెందిన వైద్యనిపుణులు తాజాగా జరిపిన ఓ పరిశోధనలో ఈ విషయం వెల్లడించారు.

తీసుకునేది ఎలాంటి ఆహారమైనా..... ఎంత మోతాదు అయినా ... ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటలలోపు తినాలట. ఆ తర్వాత ఏమీ తినకూడదట. దీనివల్ల జీవక్రియలు సక్రమంగా జరిగి కొవ్వు ఎక్కువగా కరుగుతుందని, తద్వారా బరువు తగ్గుతారని వారు తెలిపారు. 


ఈ పరిశోధన విస్తృత స్థాయిలో జరిపి, ఇంకా జరిగే పరిణామాలను అంచనా వేసే ప్రయత్నం లో ఉన్నారు.

Comments

Popular Posts