మన బాస

కొన్ని ఆశలలా బ్రతికిస్తాయ్
మరికొన్ని బాసలు మనల్ని నడిపిస్తాయ్
మది సంద్రపు ఘోషలు ఏడిపిస్తాయ్
జ్ఞాపకాలప్పుడు కనుల వెంట కారుతయ్
మౌనమనే కాన్వాస్ పై
కొన్ని క్షణాలు
 
వింత రంగుల్లా
 
ఒక రూపుని సంతరించుకుంటాయ్
ఒక రేపుని లేదన్నట్లు
ఒక నిన్నటిలో బతికేటట్లు
నేటిని నేటిగా ఒప్పుకోనన్నట్లు
మిణుగుర్ల్ని కప్పేసిన చీకటిలా
ఆ చిత్రం నీకెప్పుడూ గుర్తుండి పోతుంది
అదే చిత్రం విచిత్రమై
నీపై ఛత్రమై వెలుగుని ఆపేస్తుంది!
వెలుగుతూనే వెలిసి పోతుంది!!
వెలి వేసి ఒంటరినీ చేస్తుంది!!!!

~~రఘు ఆళ్ళ

Comments

Popular Posts