‘నీవే’ లేకపోతే ‘నీవారెక్కడ’??.

ఒక పెద్దగ్రామంలో ఒక చెప్పులు కుట్టే అతను ఉండేవాడు.ఆ వూరికి అతను ఒక్కడే ఆ పని తెలిసిన వాడు కావటంతో అందరూ అతని దగ్గరకు వచ్చి చెప్పులు బాగు చేయించుకునేవారు.చివరికి తన సొంత చెప్పులు తెగిపోయినా రిపేరు చేసుకునే టైం ఉండేది కాదు ఆయనకు, అంత బిజీగా ఉండేవాడు.అయినా సరే వాటితోనే నడవటం వలన అయన పాదాల్లో కురుపులు వచ్చాయి. మొదట్లో అది సమస్య అనిపించక పోయినా,కొన్ని రోజులకు కాలు దెబ్బతిని కుంటుతూ నడిచేవాడు.అయినా కుడా తన ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా, ఆ వూరి వాళ్ళ చెప్పులు బాగుచేయడం లోనే సమయం గడిపేవాడు.ఆ వూరి వాళ్ళు కూడా అతని ఆరోగ్యం గురించి జాగ్రత్త తీసుకోమని చెప్పినా,పెడచెవిన పెట్టేవాడు.దోంతో కొంత కాలానికి రెండు కాళ్ళు పూర్తిగా పడిపోయి మంచానికే పరిమితమైయ్యాడు.
ఆ వూళ్ళో చెప్పులు రిపేర్ చేసే వాళ్ళు మరొకరు లేకపోవడం వల్ల, తెగిపోయిన,పాడైపోయిన చెప్పులతో నడిచి నడిచి ఆ వూరి వాళ్ళంతా అవిటి వాళ్ళయ్యారు.
నీ వారి గురించి శ్రమించడం మంచిదే...కానీ నీ గురించి కూడా నీవు అప్పుడప్పుడు విశ్రమించాలి కదా!....‘నీవే’ లేకపోతే ‘నీవారెక్కడ’??.
~సాహస్~

Comments

Popular Posts