అతిపెద్ద ‘భారతమాత మందిరము’

అతిపెద్ద భారత మాత మందిరము’ (గంగానది ఒడ్డున,హరిద్వార్):

దీనిని స్వామి సత్య మిత్రానంద గిరి హరిద్వార్ లో పవిత్ర గంగా నది ఒడ్డున నిర్మించారు.1983 లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ఈ మందిరాన్ని ఆవిష్కరించి, జాతికి అంకితం చేశారు. ఈ మందిరం మొత్తం ఎనిమిది అంతస్తులతో, దాదాపు నూట ఎనభై అడుగుల ఎత్తు ఉంటుంది.చివరి అంతస్తు పైనుంచి చూస్తే హరిద్వార్ సుందర రూపం కనిపిస్తుంది. చరిత్రలను  ప్రతిబింబించే చిత్రాలు, పెయింటింగ్స్ ఉంటాయి. ఈ మందిరం అన్ని మతాలకు చెందిన పురాణ పురుషులు, దేవుళ్ళు, శక్తి రూపాలు,స్వాతంత్ర్య సమరయోధులు, వీర నారీమణులు, ఆదర్శ మహిళలు, సాధువులు, ఋషులకు చెందిన చిత్రపటాలు, శిల్పాలు, విగ్రహాలు,చిహ్నాలు అమర్చబడి, భారతదేశ సిద్ధాంతమైన భిన్నత్వంలో ఏకత్వంను ప్రతిబింబిస్తుంది.ఒక్కో అంతస్తుకి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. మొదటి అంతస్తు: భారతమాత విగ్రహం ఉంటుంది.రెండవ అంతస్తు: ‘శూర్ మందిర్’- దేశం కోసం పోరాడిన అమర వీరులు. మూడవ అంతస్తు: ‘మాతృ మందిర్’- దేశ స్వాతంత్ర్యం, దేశ సంస్కృతి చాటి చెప్పిన  వీరనారీమణులు, ఆదర్శ మహిళలు. నాలుగవ అంతస్తు: ‘సంత్ మందిర్’-అనేక మతాలకు చెందిన పవిత్ర పురుషులు, ఋషులు, సాధువులు. ఐదవ అంతస్తు: ‘సమావేశ మందిరం’- భారత దేశ సంస్కృతి, చరిత్ర, దేశం యొక్క రమణీయతను ప్రతిబింబించే చిత్రపటాలు,దృశ్యాలు. ఆరవ అంతస్తు: శక్తి యెక్క వివిధ రూపాలు. ఏడవ అంతస్తు: శ్రీ మహా విష్ణువు యొక్క అవతార రూపాలుఎనిమిదవ అంతస్తు: మహా శివుడు’.ఈ మందిరం లో లిఫ్టు సౌకర్యం కూడా ఉంది.(ఇక్కడే కాకుండా భారతమాత కు వారణాసి, కలకత్తా లలో కూడా ‘మందిరాలు నిర్మించారు.)


Bharat Mata Mandir:

Located in Sapt Sarovar near ashram at Haridwar, Bharat Mata Temple is a holy place of its own kind. Bharat Mata Mandir was founded by Swami Satyamitranand Giri. On 15th May 1983, the temple was inaugurated by Late Prime Minister, Smt. Indira Gandhi. Actually, Bharat Mata is the representation of India in the form of a mother goddess. 

A eight stories unique temple dedicated to Mother India as a form of Goddess.

Bharat Mata Mandir Detail : 
  • First Floor : First floor is dedicated to Bharat Mata (Mother India) it has the statue of Bharat Mata. 
  • Second Floor : The second floor 'Shoor Mandir' is dedicated to the well renowned heroes of India. 
  • Third Floor :The third floor 'Matru Mandir' is dedicated to the achievements of India's revered women such as Meera Bai, Savitri, Maitri etc. 
  • Fourth Floor : The fourth floor the great saints from various religions, including Jainism, Sikhism and Buddhism are featured on 'Sant Mandir'. It is the Sant Mandir and features great saints of the Jainism, Sikhism and Buddhism faith. 
  • Fifth Floor : The Assembly Hall with walls depicting symbolic coexistence of all religions practiced in India and paintings portraying history and beauty in various provinces of India are situated on the fifth floor. 
  • Sixth Floor : The various forms of the Goddess of Shakti can be seen on the sixth floor, it is dedicated to Goddess Shakti of the Hindu religion. 
  • Seventh Floor : The seventh floor is devoted to all incarnations of Lord Vishnu the preserver form of the holy Hindu Trinity. 
  • Eighth Floor : The uppermost floor features the shrine of Lord Shiva, the supreme god in Hindu tradition. Comments

Popular Posts