మన ‘రమణీ’యం

ఒకసారి ఒక తెలుగు భక్తుడు భగవాన్ రమణ మహర్షిని ఇలా అడిగాడు
వాన్! నా మనసు నేను చెప్పినట్టు వినక దాని ఇష్టం వచ్చినట్టు విహరిస్తోంది.
అందువల్ల నాకు అశాంతి కలుగుతోంది. నా మనసు స్వాధీనంలోకి తెచ్చుకొనేందుకు మార్గం ఏది?.
ఆ ప్రశ్నకు భగవాన్ కరుణారసమైన వాక్కుతో, స్పష్టంగా తెలుగుభాషలో ఇలా అన్నారు.
జీవితంలో సాధకుల యత్నమంతా అందుకోసమే.
ఆ మనసుని అరికట్టడానికే జ్ఞాన, భక్తి, కర్మ మార్గములన్నీ దానికోసమే.
జ్ఞాన మార్గం ద్వారా మనసును నేను కాను అని తెలుసుకుని మనసుని నిరోధించవచ్చును.
కర్మ మార్గములో ఏదో ఒక కర్మయందు మనసుని లగ్నం చెయ్యడంవల్ల, మనసు నిలిచి పోతుంది.
భక్తి మార్గం లో మనసుని సర్వదా ఇష్టదైవం మీదికి పోనిచ్చి, ఆ ప్రార్థన పూజ సేవలలో మనసుని వుంచడంవల్ల, కొంతకాలానికి ఆ మూర్తియందే లగ్నమై నిలబడిపోతుంది
అన్ని మార్గాలలో భక్తి మార్గం సులభం.
నీ ఇష్టదైవం పటంగాని, విగ్రహం గాని, నీ మనసులో తీరిక ఐనప్పుడల్లా ధ్యానించుకో.
దానివల్ల నీ మనసు నిలబడిపోతుంది.

మన రమణీ’యం

Comments

Popular Posts