'గురుపూర్ణిమ' గురించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’

గురు పౌర్ణిమవేడుకలను భారత్‌లో ఘనంగా జరుపుకుంటారన్న విషయం తెలిసిందే. ఆషాఢమాసంలో వచ్చే పౌర్ణమినాడు  గురుపౌర్ణిమ వేడుకలు భారత్‌లో ఘనంగా నిర్వహిస్తారన్న విషయం తెలిసిందే. అయితే ఈ సారి (జూలై 9) మనం జరుపుకొనే గురుపౌర్ణిమ కు ఒక గౌరవం దక్కింది.అదేమిటంటే మన గురుపూర్ణిమ గురించి అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా’ తన ట్విటర్‌ ఖాతాలో పేర్కొంది. నాసా మూన్‌తన ట్విటర్‌లో పలు ప్రాంతాల్లో నిండు చంద్రున్ని పిలుచుకునే పేర్లను గురు పూర్ణిమ’, ‘హే మూన్‌’, ‘మీడ్‌ మూన్‌’, ‘రైప్‌ కార్న్‌ మూన్‌’, ‘బక్‌ మూన్‌’, ‘థండర్‌ మూన్‌అని చెబుతూ అద్భుతమైన చంద్రుని ఫొటోని జతచేసింది.భారత్‌లో జరుపుకొనే గురుపూర్ణిమ ను గుర్తించినందుకు పలువురు భారతీయులు నాసాను ప్రశంసిస్తూ కృతజ్ఞతలు తెలుపుతున్నారు.

Comments

Popular Posts