గొంతు నొప్పిని పోగొట్టే సులభమైన చిట్కాలు....

వాతావరణము మారిందంటే చాలామంది జలుబు, దగ్గుతో బాధపడుతూ ఉంటారు. దీంతోపాటు గొంతునొప్పి కుడా వస్తుంటుంది. ఇన్ఫెక్షన్లు, చల్లటి పానీయాలు సేవించడం, నోరు శుభ్రంగా లేకపోవడం, నోటిలో పుండ్లు ఉన్నప్పుడు గొంతు సమస్యలు వచ్చి ఆహారం తీసుకోవాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది.మాట్లాడటానికి కూడా కష్టంగా ఉంటుంది.. చిన్న చిట్కాలతో దీని నుంచి బయట పడొచ్చు.

·       ఒక గ్లాస్ గోరువెచ్చని నీటిలో ఒక స్పూన్ తేనె, సగం స్పూన్ నిమ్మకాయ రసాన్ని కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకుని తాగితే గొంతు నొప్పి తగ్గిపోతుంది. అంతే కాకుండా గొంతు నొప్పి బాగా ఉంటే ఒక గ్లాస్ గోరు వెచ్చని నీటిలో ఒక స్పూన్ ఆపిల్ వెనిగర్, ఒక స్పూన్ తేనెరసం వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజుకు రెండు లేక మూడుసార్లు తీసుకుంటే ఖచ్చితంగా ఉపశమనం లభిస్తుంది.
·       గోరువెచ్చని నీటిలో కొద్దిగా ఉప్పు వేసుకుని పొక్కిలించినా గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.

·       పాలలో మిరియాల పొడి కలుపుకుని తాగితే అది కూడా మంచిదంటున్నారు వైద్య నిపుణులు.

Comments

Popular Posts