మన పాత తరం వారితో పోల్చుకుంటే ఇప్పటివారిలో కొందరు 30 ఏళ్లకే 60 ఏళ్ల వారిగా ఎందుకు కనిపిస్తున్నారు?

·       తీవ్రఒత్తిడి కారణంగానే బీపీ, మధుమేహం, హైబీపీ వంటి వ్యాధులు అధికమవుతున్నాయని, భవిష్యత్తు గురించి అనవసరపు ఆరాటం, భయంతో మరీ ఎక్కువగా చింతించడం వలన 30 ఏళ్లకే 60 ఏళ్ల వారిగా కనిపిస్తారని సైకాలజిస్టులు హెచ్చరిస్తున్నారు.
·  మెదడులోని భావోద్వేగానికి మానసిక ఆరోగ్యానికి లింకుదని గమనించాలి. చిన్న చిన్న సమస్యలకే ఒత్తిడి నెత్తినేసుకోకుండా.....ఓస్ ఇంతేనా అని తీసిపారేస్తే... ఒత్తిడిని దూరం చేసుకోవచ్చు.
·  సానుకూల(positive) అంశాలపై దృష్టిపెడితే వయసు మళ్లినా చురుకుగా ఉండొచ్చునని వైద్యులు సూచిస్తున్నారు. 
·       సమస్యలనేవి అందరికీ ఉంటాయని గ్రహించి ...పరిష్కారమార్గం చూసుకోవాలని, తీవ్రంగా సమస్యల గురించి ఆలోచించి, అనారోగ్యాలను కొని తెచ్చుకోవద్దని సైకాలజిస్టులు సూచిస్తున్నారు.  
·       అంతేగాకుండా సానుకూల దృక్పథం, ఆశావాదాలను పెంచుకోవడంతోపాటు సమస్యలను తేలికగా తీసుకుంటే చాలు.. ఒత్తిడి కారణంగా ఏర్పడే గుండెపోటు తగ్గుతుంది. తద్వారా నిత్యయవ్వనులుగా కనిపిస్తారు.

Comments

Popular Posts