భోజనం తర్వాత ఇలా చేస్తే ప్రమాదమే.


భోజనం తిన్న వెంటనే స్నానం చేయకూడదు.చేస్తే ఉదర సమస్యలు తలెత్తుతాయట. అందువల్ల భోజనం అయిన రెండు, మూడు గంటల తర్వాత స్నానం చేయాలట.(తిన్నవెంటనే స్నానం చేస్తే దరిద్రం అంటారు పెద్దలు...ఇలా చెప్పడానికి కారణం కుడా ఇదే)

చాలా మంది తిన్న తర్వాత స్మోకింగ్ చేస్తుంటారు.. ఇలా చేస్తే జీర్ణ క్రియ సరిగ్గా జరగదట.. సిగరెట్‌లో ఉండే నికోటిన్ జీర్ణక్రియ ప్రక్రియను అడ్డుకోవడమే కాకుండా శ్వాస సమస్యలు తలెత్తుతాయి. స్మోకింగ్ మాములుగానే ప్రమాదం.ఇలా చేస్తే ప్రమాదం రెట్టింపు అవుతుందట.

భోజనం చేసిన  వెంటనే వాకింగ్ చేయకూడదు. ఓ 20 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే చాలా మంచిది. మరీ వేగంగా నడవకుండా నెమ్మదిగా నడవాలని వైద్యులు సూచిస్తున్నారు. భోజనం తర్వాత ఎక్సర్‌సైజ్‌గానీ, ఆసనాలుగానీ అస్సలు చేయకూడదు. ఒకవేళ చేస్తే శరీరం కడుపులో వికారంగా మారడమే కాకుండా కడుపునొప్పి, వాంతులవుతాయట.

భోజనం అయిన వెంటనే చాలామంది టీ, ఫ్రూట్స్ తీసుకుంటుంటారు. ఇలా చేయడం కూడా సరి కాదట.భోజనం తర్వాత టీ, ఫ్రూట్స్ తీసుకుంటే శరీరం నుంచి ఐరన్‌ కోల్పోవాల్సి వస్తుందట. 
అన్నింటికంటే ముఖ్యమైనది -తిన్న వెంటనే నిద్ర పోకూడదు. 

Comments

Popular Posts