పైల్స్,పంటి నొప్పి,చెవిపోటు లకు దివ్యౌషధంలా పనిచేసే "బంతిపువ్వు"

·       ముద్దబంతి పువ్వు కేవలం అలంకరణ కోసమే కాకుండా.. పైల్స్ కు దివ్యౌషధంలా పనిచేస్తుంది.ముద్దబంతి ఆకుల రసాన్ని తాగితే పైల్స్ నుంచి రక్తం కారడం నిలిచిపోతుంది.
·  బంతిపువ్వుల నుంచి తీసిన పది మి.లీటర్ల రసాన్ని రోజూ మూడు పూటలా తీసుకుంటే  పైల్స్ నుంచి రక్తం కారడం ఆగిపోతుంది. పది గ్రాముల బంతి ఆకులు, రెండు గ్రాముల మిరియాలను మెత్తగా నూరి తింటే పైల్స్ సమస్య తగ్గిపోతుంది. 
·       250 గ్రాముల బంతి ఆకుల్ని, 250 గ్రాముల అరటి వేరును నీటిలో వేసి రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు వాటి రసాన్ని తీసి రోజూ పది నుంచి 20 మి. లీ. రసాన్ని సేవించినట్లైతే పైల్స్ నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ఐదు నుంచి పది గ్రాముల బంతిపువ్వుల రేకులను నేతితో వేయించి రోజూ మూడు పూటలా తింటే పైల్స్ నుంచి ఉపశమనం లభిస్తుందట.
·       అలాగే ఈ బంతి ఆకుల రసాన్ని నోట్లో పోసుకుని పుక్కిలిస్తే, పంటి నొప్పి నుంచి వెంటనే ఉపశమనం లభిస్తుంది. 
·       బంతి ఆకుల రసాన్ని చెవిలో వేస్తే చెవిపోటు కూడా తగ్గిపోతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.


Comments

Popular Posts