ప్రకృతి మనకు సహజంగా ప్రసాదించిన రంగు రంగుల కూరగాయలు,పండ్లలో ఏయే విటమిన్లు,పోషకాలు మనకు లభిస్తాయి?

ప్రకృతి మనకు సహజంగా ప్రసాదించిన రంగు రంగుల కూరగాయలు,పండ్లు చూసేందుకు అందముగా ఉండడమే కాక ఎన్నో విటమిన్లు కలిగి ఉండి ఆరోగ్యాన్ని పెంపొందించేందుకు దోహదపడుతాయి.ఏయే రంగుల ఆహారములో విటమిన్లు ఉంటాయో చూద్దాం. 
·      తెలుపు : తెల్లగా ఉండే వెల్లుల్లి , ఉల్లిపాయలు, పాలు వంటి ఆహారములో 'ట్యూమర్ల' నుంచి కాపాడే 'అల్లిసన్' ఉంటుంది. ఇక పుట్టగొడుగుల్లో వ్యాధులతో పోరాడే శక్తి ఉన్న రసాయనాలు , కణాలు పాడవకుండా ఆపే శక్తి ఉన్న 'ప్లావయినాడ్స్' ఉన్నాయి.
·     ఎరుపు,పర్పుల్, పింక్: రంగులలో ఉండే ఆహారములో 'యాంథోసియానిన్స్' ఉంటాయి, ఇవి శక్తివంతమైన యాంటిఆక్సిడెంట్లు గాను, రక్తము గడ్డకట్టకుండా ఆపేందుకు గాను సహాయపడతాయి. కాన్సర్ కారకాలతో కూడా పోరాడగలుగుతాయి.ఉదా: టమాటో(లైకోఫిన్‌), ముదురు పర్పుల్ రంగుగల ద్రాక్ష మొదలగునవి.
·  పసుపు: రంగుతో ఉన్న ఆహారము రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఆరంజ్ రంగులో ఉండే ఆహారములో 'బీటాక్రిప్టాక్సాన్థిన్(Beta-Cryptaxanthin) అనే యాంటిఆక్సిడెంట్ ఉంటుంది. వీటిలో రోగనిరోధకశక్తిని పెంచే 'విటమిన్ -సి- ఉంటుంది. ఇది శరీర కణాలు పాడవకుండా ఆపుతుంది.కళ్లకు రక్షణ కూడా ఇస్తుంది.
· ఆకుపచ్చరంగు : రంగులో ఉన్న ఆహారములో ఐరన్, కాల్షియం, ఖనిజలవణాలు ఎక్కువగా ఉంటాయి. రక్తహీనతను సరిచేస్తుంది. కంటి జబ్బులు రాకుండా కాపాడుతుంది. కాన్సర్ తో పోరాడే లివర్ ఎంజైముల ఉత్పత్తికి దోహదం చేస్తుంది.

·       బ్రౌన్ , ఆరంజ్ : రంగు ఆహారములో విటమిన్ ఎ ఎక్కువగా ఉంటుంది, కంటి జబ్బులు రాకుండా 'బీటాకెరోటీన్లు' కాపాడతాయి. చర్మాన్ని ఆరోగ్యవంతముగా ఉండేందుకు దోహదము చేస్తాయి.

Comments

Popular Posts