పిల్లల్లో వచ్చే పలు అనారోగ్య సమస్యలకు “తమలపాకు”దివ్యౌషధం లా పనిచేస్తుంది.

·  తమలపాకులో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. పిల్లలకు వచ్చే జ్వరం నుంచి ఉపశమనం లభించాలంటే.. తమలపాకు రసంలో కస్తూరిని కలిపి పేస్ట్ చేసుకుని తేనెతో కలిపి ఇవ్వడం చేస్తే జ్వరం తగ్గిపోతుంది. దగ్గు, జలుబును కూడా ఇది నయం చేస్తుంది. 
·  తమలాపాకును కాసింత వేడి చేసి అందులో ఐదు తులసీ ఆకులను ఉంచి నులిమి రసం తీసుకుని 10 నెలల పిల్లలకు 10 చుక్కలు రోజూ ఉదయం, సాయంత్రం ఇస్తే జలుబు, దగ్గు నయం అవుతుంది.  
·  తమలపాకును రుబ్బుకుని కీళ్లవాతం, మోకాళ్ల నొప్పులకు పూతలా వేసుకుంటే.. నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. తమలపాకు రసం 15ml తీసుకుని వేడినీటిలో కలిపి తీసుకుంటే ఉబ్బసం, తలనొప్పి, కడుపునొప్పి నయం అవుతుంది.   
·  శొంఠి, మిరియాలును సమంగా తీసుకుని తమలపాకు రసంలో తేనే కలుపుకుని తీసిస్తే ఆస్తమా నయం అవుతుంది. 
·      ఊపిరితిత్తులకు సంబంధిత రోగాలను నయం చేసుకోవాలంటే.. తమలపాకు రసం, అల్లం రసం సమానంగా తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. పిల్లల్లో అజీర్తికి చెక్ పెట్టాలంటే తమలపాకుతో మిరియాలు చేర్చి కషాయం తీసుకుంటే సరిపోతుంది.

Comments

Popular Posts