పాలలో పంచదార బదులు బెల్లం కలుపుకుని తాగితే అందం,ఆరోగ్యం మన సొంతం


పాల‌లో పంచదార బదులు బెల్లం క‌లుపుకుని తాగితే కేవ‌లం రుచి పెరగడం మాత్రమే కాదు, పలు అనారోగ్య సమస్యలు కూడా పోతాయి.
·      వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే అధిక బ‌రువు త‌గ్గుతారు. బెల్లం, పాల‌లో ఉండే ప‌లు ర‌కాల ఔష‌ధ గుణాలు శ‌రీరంలో పేరుకుపోయిన అధిక కొవ్వును కరిగిస్తాయి. త‌ద్వారా బ‌రువు త‌గ్గుతారు. నిత్యం తాగ‌డం వ‌ల్ల బరువు కంట్రోల్ లో ఉంటుంది.
·       బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగడం వ‌ల్ల వాటిలో ఉండే పోష‌కాలు అంది జుట్టు కాంతివంతంగా మారుతుంది. వెంట్రుక‌లు రాల‌డం త‌గ్గుతుంది. చుండ్రు పోతుంది.
· రుతు స‌మ‌యంలో మ‌హిళ‌ల‌కు వ‌చ్చే వివిధ ర‌కాల సమస్యలు, ముఖ్యంగా క‌డుపునొప్పి తగ్గడానికి బెల్లం కలిపినా పాలు బాగా పనిచేస్తాయి
·       బెల్లం క‌లిపిన పాలు తాగుతుంటే ర‌క్తహీన‌త స‌మ‌స్య పోతుంది. శరీరానికి ర‌క్తం బాగా ప‌డుతుంది. ముఖ్యంగా మ‌హిళ‌ల‌కు ఇది ఎంత‌గానో మేలు చేస్తుంది.
·       బెల్లం క‌లిపిన వేడి పాలలో స‌హ‌జ సిద్ధమైన యాంటీ బ‌యోటిక్‌, యాంటీ వైర‌ల్ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల అవి అనారోగ్యాల‌ను క‌లిగించే వైర‌స్‌లు, బాక్టీరియాల నిర్మూలిస్తాయి.ప‌లు ఇన్ఫెక్షన్లు త‌గ్గుతాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.
·       రోజూ వేడి పాల‌లో బెల్లం క‌లుపుకుని తాగితే దాంతో కీళ్ళు ,మోకాళ్ళ  నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. కీళ్లు దృఢంగా మారుతాయి.
·      బెల్లం క‌లిపిన వేడి పాల‌ను తాగుతుంటే దాంతో జీర్ణ సమస్యలు దూర‌మ‌వుతాయి. గ్యాస్‌, అసిడిటీ, మలబద్ధకం, అజీర్ణం వంటి ఇబ్బందులు తొల‌గిపోతాయి
· పిల్లలలో వ్యాధినిరోధక శక్తి పెరిగి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. ఎత్తు పెరగడానికి కుడా ఇది దోహద పడుతుంది.
·       బెల్లం, పాలలో అద్భుతమైన పోషకాలు, మినరల్స్ ఉంటాయి. కాబట్టి ప్రతి రోజూ వీటిని తీసుకుంటే మంచిదని అధ్యయనాలు నిరూపించాయి. 

Comments

Popular Posts