ఇంట్లో చీటికిమాటికి గొడవలు అవుతూ ప్రశాంతత కరువవుతోందా?

ఇంట్లో చీటికిమాటికి గొడవలు అవుతూ వాతావరణం ప్రశాంతంగా లేకపోతే.. ఇల్లు తుడిచే నీటిలో కాస్త ఉప్పు వెయ్యాలి. ఇలా చేస్తే ఇంట్లోని నెగటివ్ ఎనర్జీ వెళ్లిపోతుంది. ఇంట్లో ఎవరికైనా మనశ్శాంతి లోపిస్తే కొద్దిగా నీటిలో రాళ్ళ ఉప్పు వేసి పాదాలను నానబెట్టి ఉంచాలి. లేకపోతే స్నానం చేసే నీటిలో కొద్దిగా రాళ్ల ఉప్పు వేసి స్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. 

అలాగే ఇంట్లో అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటే ఓ గ్లాసుడు నీళ్లతో పరిష్కరించుకోవచ్చునట. నీటి ద్వారా ఇంట్లోని ప్రతికూల ప్రభావాన్ని గుర్తించడం తేలికేనని పండితులు అంటున్నారు. అదెలాగంటే..? క్లీన్‌గా క్లియర్‌గా ఉన్న గ్లాసు (గీతలు లేని పెయింటింగ్‌గాని లేని, ఫింగర్ ప్రింట్స్ లేని గ్లాసు)ను తీసుకోవాలి. ఇలా పారదర్శకంగా ఉండే గాజు గ్లాసులో 1/౩ వంతు సీ సాల్ట్ వేయాలి. తర్వాత అందులోనే 2/3 భాగాలు వెనిగర్ వేయాలి. నీళ్లు జోడించాలి. నిదానంగా పోయాలి. సైడ్ నుంచి పోయాలి. గ్లాసులో ఉన్న ఉప్పు, వెనిగర్ పదార్థాలు కదలకుండా నీటిని నింపి.. ఇంట్లో ఏ చోట ప్రతికూల శక్తులున్నాయని భావిస్తున్నారో ఆ చోట ఈ నీటి సీసాను ఉంచాలి. ఈ గ్లాసును ఎవరికి తెలియకుండా ఉంచాలి. 24 గంటల తర్వాత ఈ నీటిలో ఎలాంటి మార్పులు లేకుంటే ఆ ఇంట్లో ప్రతికూల శక్తులు లేనట్లే. కానీ ఆ గ్లాసులోని నీరు గ్రీన్, గ్రే కలర్‌లో మారితే మాత్రం ప్రతికూల శక్తులున్నట్లు (నెగటివ్ ఎనర్జీ) గ్రహించాలి. ఆ నీటిని బాత్రూమ్‌లో పడేసి గ్లాసును క్లీన్ చేయాలి. ఇలా ఐదు ఆరుసార్లు చేస్తే ఇంట్లోని ప్రతికూల శక్తులు తొలగిపోతాయని పండితులు అంటున్నారు. 


Comments

Popular Posts