గాడిద పాలు ఒక లీటర్ దాదాపు నాలుగు వేల రూపాయలట...ఎందుకో తెలుసా?

 “గంగి గోవు పాలు గరిటెడైనా చాలు
  కడివెడైన నేమి ఖరము పాలు
  భక్తిగలుగు కూడు పట్టెడైనను చాలు
  విశ్వదాభిరామ! వినుర వేమ!
అనే పద్యం దాదాపు అందరికీ తెలుసు. “మంచి ఆవు పాలు గరిటెడు అయినా చాలు, కానీ కుండ నిండా గాడిద పాలు ఉన్నా అవి పనికి రావు కదా, ప్రేమతో వడ్డించే బోజనము కొంచెం అయినా సరిపోతుందిఅని ఈ పద్యానికి అర్థం. దీని ప్రకారము ఇందులో గాడిద పాలు పనికి రావని అర్ధం కదా!  కానీ వాస్తవానికి గాడిద పాలు ఆవు పాల కన్నా ఎక్కువ మేలు చేస్తాయని ఇటీవల సైంటిస్టులు చేసిన ప్రయోగాలు చెబుతున్నాయి.

·       నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ (U.S National library of medicine), జర్నల్ ఆఫ్ ఫుడ్ సైన్స్ (Journal of food science) కథనంలో గాడిద పాల గురించి ఆసక్తికరమైన విషయాల వెల్లడించారు. ఆవు పాల కన్నా గాడిద పాలలో కొవ్వు చాలా తక్కువగా ఉంటుందట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటేగాడిద పాలు ఇంచు మించు తల్లిపాల అంత శ్రేష్టమైనవట. ఈ పరిశోధనలో “గాడిద పాలను తాగడం వల్ల ఆస్తమా,ఉబ్బసం లాంటి ఊపిరితిత్తుల సమస్యలు, దగ్గు, జలుబు, కిడ్నీలో రాళ్లు, జాండిస్, కీళ్ల నొప్పులు తగ్గుతాయని” తెలిపారు.

·       అయితే ఆవు, గేదెల పాలతో పోలిస్తే మాత్రం గాడిద పాల ధర చాలా ఎక్కువ. ఎంత అంటే 15ml గాడిద పాల ధర రూ.50 వరకు పలుకుతుంది. అంటే సాధారణంగా మనం కొనే లీటర్ పాల రేటు ఇది. అలా చూస్తే లీటర్ గాడిద పాల ధర రూ.3,300 వరకు ఉంటుందన్నమాట. కానీ  గాడిదలు ఆవులు, గేదెల్లా లీటర్ల మోతాదులో పాలు ఇవ్వవు. ఒక్కో గాడిద కేవలం 250ml మోతాదులో మాత్రమే పాలను ఇస్తుంది. అదీ ఏడాదిలో కేవలం 7 నుంచి 8 నెలలు మాత్రమే. ఆ సమయం పూర్తి అయ్యాక మరో 3 ఏళ్ల పాటు వేచి చూడాలి. ఆ తరువాతే గాడిద పిల్లల్ని కని మళ్లీ పాలు ఇస్తుంది.

ఈ విషయం తెలిసిన తరువాత గాడిద పాల అమ్మకం దక్షిణాది రాష్ట్రాల్లో జోరందుకున్నట్లు ఇటీవలి వార్తల్లో కుడా చూసాం.కాకపోతే చివరగా చెప్పుకోవలిసింది ఏంటంటే వీటి సంఖ్యా కూడా అంతరించే సంఖ్యలో ఉందట.

Comments

Popular Posts