భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన శ్రీ పింగళి వెంకయ్య గారు

భారత జాతీయ పతాకాన్ని రూపొందించిన  పింగళి వెంకయ్య గారు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపాన ఉన్న ప్రస్తుత మొవ్వ మండలములోని భట్లపెనుమర్రు గ్రామం లో జన్మించారు.19 ఏళ్ల వయసు నుంచీ గాంధీ గారి  తో కలిసి స్వాతంత్ర్యోద్యమం లోపాల్గొన్నారు.1921లో అఖిల భారత కాంగ్రెస్ సమావేశాలు బెజవాడలో జరుగుతున్నప్పుడు గాంధీజీ వెంకయ్యను పిలిపించి కాషాయం, ఆకుపచ్చ రంగులు కలిగి, మధ్య రాట్నంగల ఒక జెండాను చిత్రించమని కోరాడు. మహాత్ముడు సూచించిన ప్రకారంగానే, ఒక జెండాను సమకూర్చాడు వెంకయ్య. 
అనంతరం వచ్చిన ఆలోచనల మేరకు, సత్యం, అహింసలకు ప్రత్యక్ష నిదర్శనమైన తెలుపు రంగు కూడా ఉండాలని గాంధీజీ అభిప్రాయపడగా, వెంకయ్య ఆ జెండాలో అదనంగా తెలుపు రంగును చేర్చి నేటి త్రివర్ణ పతాకాన్ని దేశానికి ప్రసాదించాడు..కాషాయ రంగు హిందువులకు చిహ్నమని, ఆకుపచ్చ ముస్లింలకని పేర్కొనడంతో, ఇతర మతాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వాలనే అభిప్రాయం వెలువడడంతో గాంధీజీ సూచనపై ఆకుపచ్చ, కాషాయ రంగులుతో పాటు తెలుపు కూడా చేర్చి త్రివర్ణ పతాకాన్ని వెంకయ్య రూపొందించాడు. మధ్యనున్న రాట్నం గ్రామ జీవనాన్ని, రైతు కార్మికత్వాన్ని స్ఫురింప చేస్తుందన్నారు. కార్మిక కర్షకులపై ఆధారపడిన భారతదేశం, సత్యాహింసలను ఆచరించడంతో సుభిక్షంగా ఉంటుందని మన ఆశయం. ఆ ఆశయ చిహ్నమే మన త్రివర్ణ పతాకం.

పత్తి' వెంకయ్య/డైమండ్ వెంకయ్య:
పత్తి మొక్కలలోని మేలురకముల పరిశోధనల వల్ల ఆయనను  'పత్తి' వెంకయ్య అనీ ,ఖనిజాలు, వజ్రాలు గురించి చేసిన పరిశోధనల వల్ల డైమండ్ వెంకయ్య అని కూడా పిలిచేవారు.

Comments

Popular Posts