ఎండు ద్రాక్ష‌ల‌ను రాత్రంతా నీటిలో నాన‌బెట్టి ఉద‌యాన్నే తింటే కలిగే బోలెడు ప్రయోజనాలు...


ఎండు ద్రాక్ష‌ ( కిస్మిస్ పండ్లు)ల‌ను కొన్నింటిని తీసుకుని రాత్రంతా నీటిలో నాన‌బెట్టి వాటిని ఉద‌యాన్నే తింటే దాంతో ఎన్నో లాభాలు క‌లుగుతాయ‌ట‌.
·        ఉద‌యాన్నే ఎండు ద్రాక్ష‌ల‌ను తిన‌డం వ‌ల్ల రోజంతా ఉత్తేజంగా ఉంటుంది. రోజంత‌టికీ కావ‌ల్సిన శ‌క్తి ల‌భిస్తుంది. ఉద్యోగుల‌కు, పిల్ల‌ల‌కు కిస్ మిస్ పండ్లు ఎంత‌గానో మేలు చేస్తాయి.
·        ఎండు ద్రాక్ష‌ల్లో ఐర‌న్ ఎక్కువగా ఉంటుంది. ఇది ర‌క్త‌హీన‌త‌ను నివారిస్తుంది. ర‌క్తం బాగా త‌యార‌వుతుంది.
·        వీటిలో ఉండే విట‌మిన్ బి, పొటాషియం వంటి పోష‌కాలు గుండె సంబంధ వ్యాధులు రాకుండా చేస్తాయి.
·        ర‌క్తంలో ఉన్న చెడు కొలెస్ట‌రాల్ త‌గ్గుతుంది. అధిక బ‌రువు ఉన్న వారు నిత్యం కొన్ని కిస్ మిస్ పండ్ల‌ను తింటే అధిక బ‌రువును సుల‌భంగా త‌గ్గించుకోవ‌చ్చు.
·        మ‌ధుమేహం ఉన్న‌వారు ఎండు ద్రాక్ష‌ల‌ను తింటుంటే ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు అదుపులోకి వ‌స్తాయి.
·        ఉదయాన్నే ఎండు ద్రాక్ష‌ల‌తోపాటు కొన్నివెల్లుల్లి రేకుల్ని ప‌చ్చిగా అలాగే తింటుంటే బీపీ అదుపులోకి వ‌స్తుంది.
·        ఎండుద్రాక్ష‌లో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా పుష్క‌లంగానే ఉంటాయి. ఇవి శ‌రీర రోగ నిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను ప‌టిష్టం చేస్తాయి. ఫ్రీ ర్యాడిక‌ల్స్ నుంచి శ‌రీరానికి ర‌క్ష‌ణ‌గా నిలుస్తాయి. ప‌లు ర‌కాల క్యాన్స‌ర్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి.
·        జీర్ణ సంబంధ స‌మ‌స్య‌లు ప‌రిష్కార‌మ‌వుతాయి. మ‌ల‌బ‌ద్ద‌కం తొల‌గిపోతుంది. గ్యాస్‌, అసిడిటీ వంటివి త‌గ్గుతాయి.
·        ఎండుద్రాక్ష‌లో యాంటీ బాక్టీరియ‌ల్ గుణాలు కూడా ఉంటాయి. ఇవి శ‌రీరాన్ని ఇన్‌ఫెక్ష‌న్ల నుంచి ర‌క్షిస్తాయి.
·        వైర‌ల్ జ్వ‌రాలు, ఇన్‌ఫెక్ష‌న్ల‌తో బాధ ప‌డే వారు కిస్ మిస్ పండ్ల‌ను తింటుంటే త్వ‌ర‌గా కోలుకుంటారు. 

Comments

Popular Posts