గ‌ర్భిణీ స్త్రీలు కుంకుమ పువ్వు తీసుకుంటే పుట్టే బిడ్డ‌లు అందంగా, మంచి రంగులోపుడ‌తారా? ఇది నిజమా?


తమ బిడ్డ మంచిగా, ఆరోగ్యంగా, అందంగా పుట్టాల‌ని అందరూ కోరుకుంటారు. అందుకోసం మ‌న పూర్వీకుల కాలం నుంచి నుంచి పాటిస్తూ వ‌స్తున్నఆరోగ్య చిట్కాలలో ఒకటి- పాల‌లో కుంకుమ పువ్వును క‌లిపి తాగ‌డం. అయితే కుంకుమ పువ్వును పాల‌లో క‌లుపుకుని తాగితే నిజంగానే బిడ్డ అందంగా పుడుతుందా..? అనే దాని గురించి తెలుసుకుందాం.
కుంకుమ పువ్వులో మ‌న శ‌రీరానికి మేలు చేసే పోష‌కాలు ఎన్నో ఉన్నాయి. దీన్ని బిర్యానీ తదితర మసాలా కూర‌ల్లోనూ, స్వీట్ లలోనూ వాడుతారు. అయితే ప్ర‌ధానంగా గ‌ర్భిణీ స్త్రీలు దీన్ని నిత్యం పాల‌లో క‌లుపుకుని తాగడం ఆనవాయితీగా వస్తోంది. ఇలా చేస్తే పుట్ట‌బోయే బిడ్డ చ‌క్క‌ని ఆరోగ్యంతో అందంగా, మంచి రంగుతో పుడతారనేది ఒక నమ్మకం.ఈ విష‌యంపై కొంద‌రు సైంటిస్టులు ప‌రిశోధ‌న‌లు కూడా చేశారు. వాటిలో కుంకుమ పువ్వుకు, పుట్ట‌బోయే బిడ్డ అందం,రంగుకు  సంబంధం లేద‌ని తెలిసింది.

కానీ, కుంకుమ పువ్వును పాల‌లో క‌లిపి తాగ‌డం వ‌ల్ల గ‌ర్భిణీ శ‌రీరంలోని ర‌క్తం శుద్ధి అవుతుందట‌. అంతేకాదు కుంకుమ పువ్వులో స‌హ‌జ సిద్ధ‌మైన మ‌జిల్ రిలాక్సంట్ గుణాలు ఉండ‌డం వ‌ల్ల ప‌లు నొప్పుల నుంచి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంద‌ట‌. ఈ క్ర‌మంలో శిశువుకు కూడా ర‌క్త స‌ర‌ఫ‌రా బాగా జరగడం, చ‌ర్మం ఆరోగ్యంగా వృద్ధి చెందుతుంద‌డం జరుగుతుందట. అంతే కానీ దాని రంగులో మాత్రం మార్పు ఉండ‌ద‌ని, పిల్లలకు త‌ల్లిదండ్రుల జీన్స్ ఆధారంగానే(జన్యు పరంగా) బిడ్డకు రంగు వ‌స్తుంద‌ట‌.

బిడ్డ అందం గురించి కాక‌పోయినా, కుంకుమ పువ్వును గ‌ర్భిణీలు రోజూ తిన‌డం వ‌ల్ల శిశువుకు ఆరోగ్యప‌రంగా మంచి జ‌రుగుతుంది. కానీ గ‌ర్భిణీలు నిత్యం 10 గ్రాముల‌ మోతాదు  (అంటే దాదాపు 3 నుంచి 4 తీగ‌లు)మించ‌కుండా కుంకుమ పువ్వును తీసుకోవాల‌ట‌. లేకపోతే అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ట‌. అలాగే మార్కెట్‌లో విడిగా దొరికే కుంకుమ పువ్వు కాకుండా ISI బ్రాండ్ క‌లిగి, ప్యాకింగ్ చేయ‌బ‌డ్డ కుంకుమ పువ్వునే వాడాల‌ని వైద్యులు సూచిస్తున్నారు. గ‌ర్భిణీలు 3వ నెల త‌రువాత నుంచి కుంకుమ పువ్వును తిన‌వ‌చ్చ‌ని, పాల‌ను తాగ‌లేని వారు, తాము తినే ఆహారంలోనూ కుంకుమ పువ్వును క‌లిపి తీసుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు.


Comments

Popular Posts