భగవంతుని పూజకి సంబంధించిన ఈ పదాలకు సంబంధించి అర్ధం-క్లుప్తంగా...పదం
అర్ధం
పూజ
పూర్వజన్మవాసనలను నశింపచేసేది. జన్మమృత్యువులను లేకుండాచేసేది సంపూర్ణఫలాన్నిచ్చేది.
అర్చన
అభీష్ట ఫలాన్నిచ్చేది చతుర్విధ పురుషార్థ ఫలానికి ఆశ్రయమైనది, దేవతలను సంతోషపెట్టేది.
జపం
అనేక జన్మలలో చేసిన పాపాన్ని పోగొట్టేది, పరదేవతను సాక్షాత్కరింప చేసేది జపం.
స్తోత్రం
నెమ్మది నెమ్మదిగా మనస్సు కి ఆనందాన్ని కలిగించేది, సాధకుని తరింపజేసేది స్తోత్రం.
ధ్యానం
ఇంద్రియ సంతాపాన్ని మనస్సుతో నియమింప చేసేది, ఇష్టదేవతను చింతింపచేసేది.
దీక్ష
దివ్యభావాలను కల్గించేది, పాపాలను కడిగివేసేది, సంసార బంధాలనుండి విముక్తిని కల్గించేది దీక్ష.
అభిషేక
అహంభావాన్ని పోగొట్టేది, భయాన్ని మథించేది, పవిత్రోదకాన్నిచల్లేది, ఆనందాదులను కల్గించేది.
మంత్రం
తత్త్వం పై మననం చేయడం వల్ల భయాల నుండి రక్షించేది మంత్రం.
ఆసనం
ఆత్మసిద్ధి కల్గించేది, రోగాలను పోగొట్టేది, క్రొత్తసిద్ధిని, లేదా నవసిద్ధులను కల్గించేది.
తర్పణం
పరివారంతో కూడిన పరతత్త్వానికి క్రొత్త ఆనందాన్ని కల్గించేది.
గంధం
అంతంలేని దౌర్భాగ్యాన్ని, క్లేశాన్ని నశింపుచేసేది ధర్మఙ్ఞానాలనిచ్చేది.
అక్షతలు
కల్మషాలను పోగొట్టడం వల్ల తత్ పదార్ధంతో తదాత్మ్యాన్ని కల్గించేవి.
పుష్పం
పుణ్యాన్నివృద్ధిచేసేది, పాపాన్ని పోగొట్టేది, పుష్కలార్ధాన్ని ఇచ్చేది.
ధూపం
చెడువాసనలవల్ల వచ్చు అనేక దోషాలను పోగొట్టేది, పరమానందాన్ని ప్రసాదించేది.
దీపం
సుదీర్ఘమైన అఙ్ఞానాన్ని పొగొట్టేది, అహంకారం లేకుండా చేసేది, పరతత్త్వాన్ని ప్రకాశింప చేసేది.
నైవేద్యం
ఆరు రుచులతో నున్న నాల్గు విధాల పదార్ధాలను,దేవతకు తృప్తినిచ్చేదానిని నివేదన చేయుటయే.
ప్రసాదం
ప్రకాశానందాల నిచ్చేది, సామరస్యాన్ని కల్గించేది, పరతత్త్వాన్ని దర్శింపచేసేది ప్రసాదం.
ఆచమనీయం
లవంగ, జాజి, తక్కోలములతోకూడిన ద్రవ్యం ఆచమనీయం .
ఆవాహనం
పూజ కొరకు దేవతను పిలుచుటయే ఆవాహనం.
స్వాగతం
దేవతను స్వాగతించి కుశలప్రశ్నవేయుట లాంటిది
పాద్యం
చామలు, గరికలు, పద్మాలు, విష్ణుక్రాంతలతో కూడిన ద్రవ్యం పాద్యం, పాదాలు కడుగుటకు ఇచ్చే జలం.
మధుపర్కం
తేనె, నెయ్యి, పెరుగులతో కూడినది.
స్నానం
గంధం, కస్తూరి, అగరు మొllవాటితో స్నానం.
వందనం
అష్టాంగాలతో కూడిన నమస్కారం వందనం ఉరస్స (వక్షస్థలం, శిరస్సు, మనస్సు, మాట, పాదాలు, కరములు, కర్ణాలు, నేలకుతాకించి చేసే వందనం సాష్టాంగం).
ఉద్వాసన
దేవతను, ఆవరణ దేవతలను పదహారు ఉపచారాలచే పూజించి పంపడాన్ని ఉద్వాసనమని అంటారు.
-జాజాల రాంగోపాల్ శర్మ గారు,

 విద్యుత్ శాఖ & బ్రాహ్మణ అన్నదాన సత్రం-బీచుపల్లి క్షేత్రం.

Comments

Popular Posts