మూడు ఆలోచనలు /ప్రశ్నలు

ఒక పిల్లవాడు ఆరుబయట పచ్చని పొలాల్లో ఆడుకుంటూ పైన ఎగిరిపోతున్న విమానాన్ని చూసి తానెప్పుడు అందులో ప్రయాణిస్తానో అని అనుకుంటాడు.అదే విమానాన్ని నడిపే పైలట్ ఆ పచ్చని పొలాలని చూస్తూ....తన కుటుంబాన్ని గుర్తుచేసుకుంటూ ఎప్పుడు ఇంటికి చేరుతానా అని ఆలోచిస్తుంటాడు.
.................................ఇదీ జీవితం.
1.   డబ్బులోనే సంతోషం ఉంది అనుకుంటే.....కొందరు పిల్లలు నాలుగు గోడల మధ్యనే నిర్భంధంగా  ఎందుకు ఆడుకోవలసివస్తుంది? మరికొందరు పిల్లలు హుషారుగా ఆరుబయట ఇంటి చుట్టుపక్కల తిరుగుతూ సంతోషంగా ఎలా ఆడుకుంటున్నారు?
2.   పదవులు, అధికారం జీవితానికి భద్రత ఇస్తాయనుకుంటే...ఎందుకు నాయకులు,ఉన్నతాధికారులు బాడిగార్డ్స్ లేకుండా తిరగలేకున్నారు,కంటినిండా నిద్ర కడుపునిండా తిండి లేకుండా బతుకుతున్నారు? అదే..నిరాడంబరంగా జీవించేవారు ఎలా నచ్చిన చోట తిరగగలుగుతున్నారు?మనశ్శాంతిగా నిద్రపోగలుగుతున్నారు?
3.   అందచందాలు,కీర్తిప్రతిష్టలే అందమైన జీవితాన్ని,భరోసాని ఇస్తాయంటే , ఎందుకు కొందరు  సెలబ్రిటీల వివాహబంధాలు వైఫల్యం చెందుతున్నాయి?


వీటికి  సమాధానం మనకు తెలియాలంటే “మనలోపలి మనతో” కాసేపు డిస్కస్ చేస్తే చాలు.
Inspired by Ben Carson,United States Secretary of Housing and Urban Development

Comments

Popular Posts