పంటి నొప్పి పరిష్కారానికి సులభమైన చిట్కాలు

పంటినొప్పి వచ్చిందంటే ఏదీ తిన‌లేం, తాగ‌లేం. దంతాల‌ను క‌దిలించినా చాలు, విప‌రీత‌మైన నొప్పి క‌లుగుతుంది. దీనిని  ఇంట్లో ఉండే స‌హ‌జ సిద్ధమైన ప‌దార్థాల‌తోనే త‌గ్గించుకోవ‌చ్చునని నిపుణులు చెబుతున్నారు.
· ఉల్లిపాయ‌లు: ఒక ఉల్లిగ‌డ్డ‌ను తీసుకుని అడ్డంగా చ‌క్రాల్లా కోయాలి. అందులో నుంచి ఒక చిన్న చ‌క్రాన్ని తీసి నొప్పి పుడుతున్న పంటి మీద కొంచెం సేపు ఉంచాలి. తద్వారా ఉల్లిలోని ఔష‌ధ గుణాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి.
· కీర దోస‌: ఉల్లిపాయ‌ల్లాగే కీర‌దోస ముక్క‌ల‌ను కూడా అడ్డంగా కోసి వాటిని దంతాల‌పై ఉంచుకుంటే నొప్పి త‌గ్గుతుంది.
·    అల్లం ముక్క‌: అల్లం కొమ్మును తీసుకుని బాగా క‌డిగి దాన్ని చిన్న ముక్క‌లుగా క‌ట్ చేయాలి. ఆ ముక్క‌ల‌ను నొప్పి ఉన్న దంతాల‌తో న‌మ‌లాలి(కాస్త నొప్పిగా ఉన్నా..మెల్లగా ప్రయత్నించాలి).అలా చేయడం వ‌ల్ల అల్లంలో ఉండే ఔష‌ధ గుణాలు పంటి నొప్పిని త‌గ్గిస్తాయి.
·  ల‌వంగ నూనె: రెండు, మూడు చుక్క‌ల ల‌వంగ నూనె, 1/4 టీస్పూన్ ఆలివ్ ఆయిల్ ను క‌లిపి మిశ్ర‌మంగా చేయాలి. అందులో కాట‌న్ బాల్స్ ముంచి వాటిని నొప్పి పుట్టే దంతాల‌పై రాయాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల దంతాల నొప్పి త‌గ్గుతుంది. ఇత‌ర స‌మ‌స్య‌లు కూడా పోతాయి.
·     టీ బ్యాగ్‌: వేడి వేడిగా ఉన్న ఓ టీ బ్యాగ్‌ను నొప్పి పుడుతున్న దంతాల‌పై ఉంచాలి. అందులో ఉండే ర‌సాయ‌నాలు దంతాల నొప్పిని త‌గ్గిస్తాయి. చిగుళ్లను హాయి ప‌రుస్తాయి.

Comments

Popular Posts