'నీవు', 'నీకు', 'నీది' అనేది 'నిజంగా' ఏది?

ఈ ఇల్లు ఎవరిదండీ? నాదే
ఈ కారు? నాదే
మీరు చాలా ఆరోగ్యంగా వున్నారు.
అవునండీ...ఉదయాన్నే లేచి ఎక్సర్ సైజులు ,యోగాలు చేసి హెల్త్ మెయిన్ టైన్ చేస్తున్నాను.
మీ పిల్లలు చాలా ప్రయోజకులు అయ్యారండీ..
అవునండీ ... నేను రాత్రింబవళ్ళు కష్ట పడీ వాళ్ళను వృద్ధి లోకి తెచ్చాను.
ఇంత త్వరగా లైఫ్ లో సెటిల్ అయ్యారు...
ఇల్లు, కారు, హోదా ఇవన్నీ ఎలా సాధ్యమయ్యాయండి?
ఇదంతా నా స్వార్జితం అండీ...ఒక్కరు కూడా నాకు పైసా ఇవ్వలేదు,సాయపడలేదు.
నేనే నానా కష్టాలుపడి ఇదంతా సంపాదించాను
-ఇవీ సహజముగా వృద్ధి లోకి వచ్చిన వారు ఈ భోగాలు జరిగినంతసేపు చెప్పే మాటలు..

ఎప్పుడు అయితే ఒక సమస్య వస్తుందో, అప్పుడు
నేను గుడికి అది చేసాను,ఈ గుడికి ఇంత దానం చేశాను,
నీకు నామీద దయ లేదు.ఎందుకు?అని దేవుడ్ని నిందిస్తూ ప్రశ్నిస్తాడు.
~పైన అనుభవించిన ప్రతి భోగం నీ స్వార్జితం నీ సంపాదన అని చెప్పుకున్నావు.
భగవంతుని దయ వలన నాకు ఈ భోగాలు కలిగాయి అని ఏనాడు చెప్పలేదు.
మరి అలాంటప్పుడు కష్టాలు వచ్చినప్పుడు ఆ భగవంతుని బాధ్యుడిని చేసే అర్హత నీకు ఉందా?~

స్వామీ! నీ దయ వలన ఈరోజు భోజనం చేయగలుగుతున్నాను,
నీ కృప తో సంసారాన్ని చక్కగా నడిపిస్తున్నాను.
నీ అనుగ్రహముతో నాసంతానం ప్రయోజకులు అయ్యారు.”
అని  భగవంతునికి కృతజ్ఞతలు తెలుపడం అలవాటు చేసుకుంటే
ఆ భగవంతుని అనుగ్రహం మనపై ఎల్లప్పుడూ ఉంటుంది.

Comments

Popular Posts