గ్యాస్ మరియు అసిడిటీ లకు పుదీనా తో పరిష్కారం.

మసాలాలు, కారం ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినటం లేదా ఆహరం సరిగా జీర్ణం కాకపోవడం వలన గ్యాస్ మరియు అసిడిటీ కలుగుతాయి. అసిడిటీ వల్ల జీర్ణాశయంలోని గ్రంధులు ఎక్కువగా ఆమ్లాన్ని ఉత్పత్తి చేయటం వలన గుండె మంట మరియు కడుపులో నొప్పి కలుగుతాయి. మన ఇంట్లోనే ఉండే సహజమైన ఔషదాలతో గ్యాస్ మరియు అసిడిటీని సులభంగా తగ్గించుకోవచ్చు. 
· తులసి- అసిడిటీకి ఇది ఒక మంచి ఔషదం. భోజనానికి ముందుగా తులసి ఆకులను నమలటం వలన అజీర్ణానికి సంబంధించిన సమస్యలు తొలగిపోతాయని నిపుణులు తెలుపుతున్నారు.
· పుదీనా- ఉదయాన కడుపు ఖాళీగా ఉన్నపుడు పుదీన ఆకులను నమలాలి. ఇలా ఒక నెల రోజుల పాటు చేయటం వలన అసిడిటీ పూర్తిగా విముక్తి పొందుతారు. భోజనం తరువాత ఒక గ్లాసు పుదీన రసం తాగటం వలన, మీరు అజీర్ణ సమస్యల నుండి విముక్తి పొందే అవకాశం ఉంది.
· కొబ్బరి నీరు-కొబ్బరి నీరు అన్ని రకాలుగా ఆరోగ్యానికి మంచి చేస్తుంది. ఖాళీ కడుపుతో కొబ్బరి నీరు తాగటం వలన ఇది అసిడిటీ కారకాలకు వ్యతిరేఖంగా పని చేస్తుంది. భోజన సమయంలో కొబ్బరి నీటితో పాటు ఒలిచిన దోసకాయతో కలిపి కుడా తీసుకోవచ్చు. ఇలా తాగిన 15-20 నిమిషాల తరువాత భోజనం తీసుకోవటం వలన ఇది అసిడిటీకి దూరం చేస్తుంది.
· బత్తాయి-ఒక గ్లాస్ తాజా బత్తాయి పండ్ల రసాన్ని తీసుకొని, మరియు దీనికి వేయించిన జీలకర్రని కలపండి. ఈ మిశ్రమాన్ని మొదట అసిడిటీ వచ్చినపుడు తాగితే త్వరగా ఉపశమనాన్ని పొందుతారు. దీర్ఘకాలిక ప్రయోజనాల కొరకు ఈ మిశ్రమాన్ని వరుసగా వారం రోజుల పాటు తాగాలి.
·  ఆపిల్ సైడర్ వెనిగర్-అసిడిటీని త్వరగా మరియు సులభంగా తగ్గించుకోటానికి ఆపిల్ సైడర్ వెనిగర్ ఒక మంచి ఔషదం. త్వరగా ఉపశమనం కొరకు 2-3 చెంచాల ఆపిల్ సైడర్ వెనిగర్'ని ఒక గ్లాస్ నీటిలో కలుపుకొని త్రాగాలి.
· నిమ్మ రసం-భోజనానికి ముందుగా ఒక గ్లాసు వేడి నీటిలో రెండు లేదా మూడు చెంచాల నిమ్మరసాన్ని కలిపి తీసుకోవాలి. ఇలా రోజులో రెండు లేదా మూడు సార్లు చేయాలి..


వీటివల్ల ఫలితం లేకపోతే ,దీర్ఘకాలంగా అసిడిటీతో భాదపడుతుంటే తప్పక వైద్యుడిని సంప్రదించాలి.

Comments

Popular Posts