ఏలినాటి శని ప్రభావం తగ్గించుకోవాలంటే ఏం చేయాలి?


శనిప్రభావం తో బాధపడేవారు .. విష్ణుసహస్రనామం, ఆదిత్య హృదయం, సుందరకాండ పారాయణం చేయాలని పండితులు చెబుతున్నారు.అలాగే ప్రతి శనివారం శనిదేవునిని ఆరాధించడం, నవగ్రహాల్లో శనీశ్వరుని ముందు నువ్వులనూనెతో దీపం వెలిగించాలి. పక్షులకు ఆహారం వేయడం, పరమేశ్వరుని పంచాక్షరీ మంత్రాన్ని జపించడం ద్వారా శనీశ్వరుడు శుభఫలితాలను ప్రసాదిస్తాడట.

యాచకులకు, వికలాంగులకు పెరుగన్నం పెడితే కూడా శని తీవ్రత తగ్గుముఖం పడుతుంది. శనీశ్వర ప్రభావం తగ్గాలంటే ఈశ్వరాధన, హనుమంతుడి ఆరాధన చేయాలి. ఏలినాటి శని ప్రభావం ఏడున్నర ఏళ్లు వుంటుంది కాబట్టి, ఈ సమయం లో ప్రాణభయం, ధనం లేకపోవడం, అధమ స్థానానికి వెళ్ళిపోవడం వంటివి జరుగుతుంటాయి.

అయితే శని మన రాశిలో ప్రవేశిస్తే కొన్ని మంచి పనులు కూడా చేస్తాడు. వివాహం, ఇంటి నిర్మాణం, ఉద్యోగం లాంటివి జరిపిస్తాడు. కానీ వాటి వెనక అధిక ఖర్చు వంటి ఇబ్బందులు సృష్టిస్తాడు. అందుకే ఇలాంటి కష్టాల నుంచి గట్టెక్కాలంటే శనివారం శనీశ్వరుని పూజించాలి. నువ్వులనూనె, శంఖుపువ్వులను సమర్పించి ప్రార్థించాలి. ఇలా చేస్తే శని గ్రహ ప్రభావం తగ్గుతుంది. ఈతిబాధలు కూడా తొలగిపోతాయని పండితులు అంటున్నారు.


Comments

Popular Posts