మన శరీరం ఎంత శక్తి వంతమైనదో తెలుసా? ఆశ్చర్యం కలిగించే నమ్మలేని నిజాలు....

·      మానవుని యొక్క మెదడులో 10 కోట్ల కణములు ఉన్నాయి.
·  మానవుని కంటిలో 13 కోట్ల చిన్న చిన్న కణములు, 70 లక్షల కణములు, 3 లక్షల నరములతో కలుపబడి ఉన్నాయి. ఒక కన్ను తయారు చేయుటకు 2 లక్షల టెలివిజను ట్రాన్స్ మీటర్లు, 2 లక్షల టెలివిజను రిసీవర్లు లాంటివి కావాలి.
·   హార్మోనియంలో 45 కీలు, పియానోలో 88 కీలు, మానవుని చెవిలో 15,000 హెయిర్ సెల్స్ ఉన్నాయి
·     మానవుని శరీరములో 1,00,000 మైళ్ళ పొడవైన రక్తనాళములు కలవు. ప్రతి క్షణమునకు 20 లక్షల కణములు తయారగుచున్నవి.
·  మానవుని హృదయము నిముషమునకు 72 సార్లు, రోజుకు ఇంచు మించు 1,00,000 సార్లు, సంవత్సరమునకు 4 కోట్ల సార్లు ఎటువంటి విశ్రాంతి లేకుండా కొట్టుకుంటుంది.
·  మానవుని జీవిత కాలములో హృదయము లోని ఒక చిన్న కండరము 30 కోట్ల సార్లు సంకోచ వ్యాకోచములు చేస్తుంది.
·     జీవించి ఉన్న మానవుని శరీరములోని రసాయన పదార్ధములన్నీ కొనాలి అంటే 2 కోట్ల 70 లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది. మనిషి చనిపోయాక అమ్మితే 6 రూపాయల 45 పైసలు వస్తుంది.
· మనిషి నవ్వటానికి శరీరములో 17 కండరములు, కోపపడటానికి 43 కండరములు పనిచేస్తాయి.
·      మనిషి చర్మములొ 46 మైళ్ళ పొడవైన నాడులు ఉన్నాయి.
·  మనిషి శరీరములోని రక్తనాళములు అన్నీ ఒకదానికి ఒకటి జోడిస్తే 1,00,000 మైళ్ళ పొడవు ఉంటాయి.
·      మానవుని నాలుక పైన రుచిని తెలుపటానికి 3000 రకాల బుడిపెలు ఉంటాయి.
·      ఆరోగ్యము కల మనిషి ఒకరోజులో 23000 సార్లు శ్వాస పీల్చుతారు.
·     మనిషి చేతివేళ్ళ చర్మము మీద ప్రతి చదరపు అంగుళానికి 3000 స్వేద గ్రంధులు ఉన్నాయి.
·      మనిషి తలపై సగటున 1,00,000 వెంట్రుకలు ఉంటాయి.
·     మానవుని పంటి దవడ 276 కేజీ ల కంటే ఎక్కువ బరువు ఆపగలదు.
·     మానవుని శరీరములో 206 ఎముకలు ఉన్నాయి.
· మనిషి జీవిత కాలములో 16,000 గాలన్ల నీరు తాగుతాడు, 35000 కేజీల ఆహారం తింటారు.
·     మనిషి నోటిలో రోజుకు 2 నుండి 3 పాయింట్ల జీర్ణరసము ఏర్పడుతుంది.
·     మనిషి జీవిత కాలములో గుండె 100 ఈతకోలనులు నింపగలిగిన రక్తము పంపు చేస్తుంది.
·     మానవుని శరీరములో నాలుకయే బలమైన కండరము.
·      మానవుని శరీరములో 100 ట్రిలియను కణములు ఉంటాయి.
·      మానవుని మెదడులో 80% నీరు ఉంటుంది.
·      మానవుని మెదడుకు నొప్పి తెలియదు.
·      మానవుని శరీర బరువులో ఎముకుల వంతు 14% ఉంటుంది.
·     మానవుని వ్రేళ్ల కొనలకు శరీర బరువును మొత్తము ఆపగల శక్తి ఉంటుంది,
·   మానవుని ఎముకలు బయటికి గట్టిగాను లోపల మెత్తగాను ఉంటాయి. వీటిలో 75% నీరు ఉంటుంది.
·      తుమ్ము గంటకు 100 మైళ్ళ వేగముతో ప్రయాణిస్తుంది.
·      చేతి వ్రేళ్ల గోళ్ళు కాలి వ్రేళ్ల గోళ్ళ కన్నా 4 రెట్లు తొందరగా పెరుగుతాయి.
·      స్త్రీ గుండె పురుషుని గుండె కన్నా ఎక్కువ వేగముగా కొట్టుకుంటుంది.
·      స్త్రీలు పురుషుల కన్నా ఎక్కువ సార్లు కనురెప్పలు ఆర్పుతారు.
·      రక్తము నీరు కన్నా కుడా 6 రెట్లు చిక్కగా ఉంటుంది.
·    మానవుని మూత్రపిండములు నిముషమునకు 1.3 లీటర్ల రక్తమును శుద్ది చేస్తాయి. రోజుకు 1.4 లీటర్ల ముత్రమును విసర్జిస్తాయి.
·      స్త్రీ శరీరములో 4.5 లీటర్ల రక్తము, పురుషుని శరీరములో 5.6 లీటర్ల రక్తము ఉంటుంది.
·     మానవుని గుండె రక్తమును 9 మీటర్ల ఎత్తు వరకు చిమ్మకలిగిన శక్తి కలిగి ఉంటుంది.
·     మానవుని శరీరములో రక్త ప్రసరణ జరగని ఒకే ఒక్క ప్రాంతము కంటిలోని కరోన.
·  ఒక ఎర్ర రక్త కణమునకు శరీరము మొత్తము చుట్టి రావటానికి 20 సెకన్ల సమయము పడుతుంది.
·     రక్తములోని ప్రతి చుక్క కుడా శరీరము చేత రోజుకి 300 సార్లు శుద్ది చేయబడుతుంది.
·     మానవుని జుత్తు, చేతి గోళ్ళు చనిపోయిన తరువాత కుడా పెరుగుతాయి.
·     మనిషి గొంతులో ఉండే హ్యోఇడ్ అనే ఎముక శరీరములోని వేరే ఏ ఎముకతోను అతుకబడి ఉండదు.
·     మనిషి పుర్రె 10 సంవత్సరములకు ఒకసారి మారుతూ ఉంటుంది.
·  మనిషి మెదడులోని కుడి బాగము శరీరములోని ఎడమ భాగమును, మెదడులోని ఎడమ భాగము శరీరములోని కుడి భాగమును అదుపు చేస్తాయి.
·     మనిషి ఏమి తినకుండా 20 రోజులు, ఏమి త్రాగకుండా 2 రోజులు బ్రతుకగలడు.
·     మనిషి ముఖములో 14 ఎముకలు ఉంటాయి.
·     మానవుని నాడి నిముషమునకు 70 సార్లు కొట్టుకుంటుంది.
· ప్రతి 7 రోజులకు ఒకసారి శరీరములోని ఎర్ర రక్త కణములలో సగము మార్పిడి చేయబడుతాయి.
·      మనిషి దగ్గినపుడు గాలి శబ్ద వేగముతో ప్రయాణము చేస్తుంది.
·     ఆహారము నోటిలో నుండి పొట్ట లోపలి చేరటానికి 7 సెకన్ల సమయము పడుతుంది.
·     మనిషి శరీరములో 75% నీరు ఉంటుంది.
· మనిషి కంటితో 2.4 మిలియను కాంతి సంవత్సరముల దూరము (140,000,000,000,000,000,000 మైళ్ళు) చూడవచ్చు. Approx 528 megapixel lens.


 మానవ శరీరం మరికొన్ని గురించి విషయాలు:
·       మన కడుపులో ఉండే ఆమ్లము (acid) రేజర్ బ్లేడ్ లను కూడా కరిగించగలదు.
·       మనం రోజుకి సగటున 40 నుండి 100 వెంట్రుకలు కోల్పోతున్నాం.
·       మన ఒక్కో వెంట్రుక 3 నుండి 7 సంవత్సరాల వరకు పెరుగుతూనే ఉంటాయి.
·       తర్వాత అవి రాలిపోయి వాటి స్థానంలో వేరేవి పెరుగుతాయి
·       ఒక్క అంగుళం చర్మం మీద 3 కోట్లకు పైగా బాక్టీరియా ఉంటుంది.
·       రోజుకి మన గుండె ఉత్పత్తి చేసే శక్తితో ఓ సాధారణ ట్రక్ ని 30 కిలో మీటర్ల వరకు నడిపించవచ్చు.
·       లేవకుండా ఒక మనిషి నిద్రించిన రికార్డు 11 రోజులు.
·       90 శాతం కి పైగా జబ్బులు స్ట్రెస్ వల్లనే అని తేలింది.
·       శరీరం నుండి తల వేరు చేసినా.. తల 15 సెకన్ల వరకు స్పృహ కోల్పోదు.
·       మీరు పడుకునే గది ఎంత చల్లగా ఉంటె... మీకు పీడ కలలు వచ్చే అవకాశాలు అంత పెరుగుతాయి.
·       నిద్రించే సమయంలో మన వాసనా పీల్చే భావం పనిచేయదు.
·       మనవ శరీరం లో ఉన్న DNA మరియు అరటిపండులో ఉన్న DNA 50 శాతం కలుస్తాయి.
·       మనం తిన్నది అరగడానికి మన శరీరంలో ఏవైతే సహాయ పడతాయో... చనిపోయిన 3 రోజులకి అవే మనల్ని తినడం మొదలపెడతాయి.
·       గుండె పోటు వల్ల చనిపోయే వారిలో 20 శాతం మంది సోమవారం నాడే చనిపోతారు.
·       7 గంటల కన్నా తక్కువ నిద్రిస్తే.. త్వరగా చనిపోతారు.
·       వెలి ముద్రలు ఉన్నట్టే.. నాలుక ముద్రలు కూడా ఒకరితో ఒకరికి పోలిక లేకుండా ఉంటాయి.
·       ఒకవేళ మన కళ్ళు కెమెరా అయితే.. 576 మెగా పిక్సెల్స్ ఉన్న కెమెరాలా ఉండేది.
·       మనిషి కన్నుని తయ్యారుచేయాలంటే కొన్ని లక్షల కోట్లు కర్చవుతుందట.
·       మన నోరు 100 కోట్లకు పైగా రుచులను గుర్తించగలదు.
·       మీకు 60 ఏళ్ళు వచ్చే సరికి నోటిలో ఉండే టేస్ట్ బడ్స్ సగానికి పైగా చనిపోతాయి.
·       మీకు ఎంత ఎక్కువ IQ ఉంటె.. అన్ని కలలుగంటారు.
·       మన కాళ్ళ గోర్లకన్నా చేతి గోర్లు 4 రెట్లు త్వరగా పెరుగుతాయి.
·       చింపాంజీ శరీరం పై ఉన్నన్ని వెంట్రుకలే మన శరీరం పై కూడా ఉంటాయి. కాకపోతే మనవి చాలా సన్నగా ఉంటాయి.
·       మన శరీరం 30 నిమిషాలలో ఉత్పత్తి చేసే వేడితో 114 లీటర్ల నీటిని వేడి చేయవచ్చు.
·       మన చర్మం నిమిషానికి 50000 సెల్స్ ని వదిలేస్తుంది. అంటే జీవిత కాలంలో అది 18 కిలోలనమాట.
·       మీ బెడ్ పై ఉండే దుమ్ములో సగానికి పైగా మీ చర్మందే.
·       మన బ్రెయిన్ 25 వాట్స్ విద్యుత్త్ ని ఉత్పత్తి చేస్తుంది. ఈ పవర్ తో ఓ బుల్బ్ ని వెలిగించవచ్చు.
·       మీకు 40 ఏళ్ళు వచ్చే వరకు మీరు ఎదుగుతూనే ఉంటారు.
·       మన బ్రెయిన్ పగటి పూటకన్నా రాత్రి పూటనే చురుకుగా పనిచేస్తుంది.
·       ఒక సంవత్సరంలో 15000 కలలుగంటారట.
·       మీరు వింటున్న మ్యూజిక్ కి తగ్గట్టుగా మీ గుండె కొట్టుకోవడం ప్రారంభమవుతుంది.
·       మన శరీరం ఒక అధ్భుత సృష్ట అని నమ్మండి. దానిని హాని పరచడం మానుకోండి..
Image

Comments

Popular Posts