పైల్స్‌,మధుమేహం,వీర్యకణ సమస్యలు లాంటివి ఉన్నవారు వారు క్రమం తప్పకుండా పొన్నగంటికూర తింటే.....

·       పొన్నగంటి కూరతో కంటి చూపుకు చాలా మంచిదని మనకు తెలుసు.
·  కంటికలకలకు, నరాల్లో నొప్పికి ముఖ్యంగా, వెన్నునొప్పికి పొన్నగంటి కూర దివ్యౌషధంగా పనిచేస్తుంది.
·      ఇది మాత్రమే కాదు పొన్నగంటి కూర జీవక్రియల్లోని లోపాలను, వీర్యకణాల్లోని లోపాలను సరిచేస్తుందట.
·    టేబుల్‌స్పూను తాజా ఆకుల రసంలో వెల్లుల్లి కలిపి తీసుకుంటే దీర్ఘకాలిక దగ్గు, ఆస్తమా వ్యాధులు తగ్గుతాయట.
·       వైరల్, బ్యాక్టీరియాల కారణంగా తలెత్తే జ్వరాలనూ ఇది నివారిస్తుంది. 
·       మధుమేహుల్లో పొన్నగంటి కూర కణజాలం దెబ్బతినకుండా చూడటంతో పాటు ఆ వ్యాధి కారణంగా కంటిచూపు తగ్గకుండా చేస్తుంది.అందుకే ఇతర మందులతో పాటుగా ఆహారంలో దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. 
·   మొలల వ్యాధినీ ఇది నివారిస్తుంది. అయితే ఈ వ్యాధి బాధితులు దీన్ని ఇతర నూనెలతో కాకుండా ఆవునెయ్యితో వండుకుని తింటే మంచిదట. లేదా రెండు టేబుల్‌స్పూన్ల ఆకు రసాన్ని ముల్లంగి ఆకు రసంతో కలిపి రోజుకి రెండుమూడుసార్లు నెలరోజులపాటు తీసుకుంటే ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.


Comments

Popular Posts