మీకు ఏ వ‌య‌స్సులో అదృష్టం క‌ల‌సి వ‌స్తుందో ఇలా తెలుసుకోవ‌చ్చు..!


జ‌న్మించిన తేదీ, నెల‌, సంవత్సరం ప్రకారం వారికి జీవితంలో ఎప్పుడు ల‌క్ క‌ల‌సి వ‌స్తుందో, ఎప్పుడు అదృష్టవంతులుగా మారుతారో తెలుసుకోవ‌చ్చునని  చెబుతున్నారు న్యూమరాలజిస్ట్ లు. అందుకోసం డెస్టినీ నంబ‌ర్‌ను లెక్కించాలి. అదెలాగంటే

ఉదాహ‌ర‌ణ‌కు పుట్టిన తేదీ సెప్టెంబర్ 19, 1985 అనుకుంటే.... తేదీ 19, నెల 9, సంవ‌త్సరం 1985 . ఈ క్రమంలో  19 + 9 + 1985 ఈ మూడు సంఖ్యలను క‌లిపితే  2013 వ‌స్తుంది. ఈ 2013 సంఖ్యలో ఉన్న అంకెల‌ను కూడా కలిపితే (2+0+1+3) 6 వ‌స్తుంది. ఈ నంబ‌ర్ నే డెస్టినీ నంబ‌ర్ అంటారు.. ఈ విధంగా మీ జన్మదినాన్ని బట్టి మీ  డెస్టినీ నంబ‌ర్ లెక్క గట్టి  ఏ సంవత్సరంలో ఉన్నప్పుడు ల‌క్ క‌ల‌సి వ‌స్తుందో తెలుసుకోవచ్చునట.

1. డెస్టినీ నంబ‌ర్ 1 వ‌చ్చిన వారికి 22, 34 సంవ‌త్సరాల్లో ల‌క్ క‌లసి వ‌స్తుంద‌ట‌. సూర్య గ్రహ ప్రభావం వ‌ల్ల వారు ఆ వ‌య‌స్సులో శుభ ఫ‌లితాల‌ను పొందుతార‌ట‌. అదృష్టం బాగా క‌ల‌సి వచ్చి అనేక అవ‌కాశాలు అందిపుచ్చుకుంటారట.
2. డెస్టినీ నంబ‌ర్ 2 వ‌చ్చిన వారికి 24, 38 సంవ‌త్సరాల్లో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంద‌ట‌. చంద్రుడి ప్రభావం వ‌ల్ల వీరికి ఆ వ‌య‌స్సులో మిక్కిలిగా ధ‌నం సిద్దిస్తుంద‌ట‌.
3. డెస్టినీ నంబ‌ర్లు 3, 5 వ‌చ్చిన వారికి 32వ సంవత్సరంలో ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో వారికి అనుకున్నవి నెర‌వేరుతాయి. బృహస్పతి, బుధ గ్రహాల వ‌ల్ల వారికి అదృష్టం క‌లుగుతుంది.
4. డెస్టినీ నంబ‌ర్ 4 వ‌చ్చిన వారికి 36వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. రాహువు ప్రభావం వ‌ల్ల వారు అనుకున్న రంగాల్లో రాణిస్తారు.
5. డెస్టినీ నంబ‌ర్ 6 వ‌చ్చిన వారికి 25, 27, 32వ ఏట బాగుంటుంది. అప్పుడు వారు అనుకున్నది సాధిస్తారు. అన్నీ శుభ ఫ‌లితాలే .
6. డెస్టినీ నంబ‌ర్ 7 వ‌చ్చిన వారికి 20, 30, 38, 44వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. ఆ స‌మ‌యంలో వారికి విజ‌యావ‌కాశాలు మెండు..
7. డెస్టినీ నంబ‌ర్ 8 వ‌చ్చిన వారికి 36, 42వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌స్తుంది. శ‌ని ప్రభావం వ‌ల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి.
8. డెస్టినీ నంబ‌ర్ 9 వ‌స్తే వారికి 28వ ఏట ల‌క్ క‌ల‌సి వ‌చ్చి బాగుంటారు. కుజుని ప్రభావంవ‌ల్ల పేరు, ప్రఖ్యాతులు సాధిస్తారు. సర్వం శుభం.


Comments

Popular Posts