ఈ ప్రముఖ వ్యక్తి గురించి ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవడమో,వినడమో జరిగివుంటుంది.ఇంతకీ ఎవరు ఈయన? ఇప్పుడేమి చేస్తున్నారు?ఈయనే అంతరిక్షం లోకి వెళ్ళిన తొలి భారతీయ వ్యోమగామి రాకేశ్ శర్మ.
·     రాకేశ్ శర్మ పంజాబ్ లోని పాటియాలా లో 1949 లో జన్మించారు.హైదరాబాద్ లోని సెయింట్ జార్జ్ గ్రామర్ స్కూల్, నిజాం కాలేజ్ లలో  విద్యనభ్యసించారు.
·     విద్యాభ్యాసం తరువాత, 1966 లో నేషనల్ డిఫెన్స్ అకాడమి లో ఎయిర్ ఫోర్సు ట్రైనీ గా చేరారు.నాలుగు సంవత్సరాల ట్రైనింగ్ తరువాత,  ఇండియన్ ఎయిర్ ఫోర్సు లో చకచకా ఉన్నతపదవులు పొంది స్క్వాడ్రన్ లీడర్ మరియు పైలట్ గా నియమితులయ్యారు.
·     1984లో భారతదేశానికి చెందిన "భారత అంతరిక్ష పరిశోధన సంస్థ" (ISRO) మరియు రష్యాకు చెందిన "సోవియట్ స్పేస్ ప్రోగ్రామ్" (ఇంటర్ కాస్మోస్) సమన్వయ కార్యక్రమమైన అంతరిక్ష యాత్ర లో భారత్ తరపున అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారతీయ రోదసీ వ్యోమగామి అయ్యాడు. (రాకేష్ శర్మ మరియు వింగ్ కమాండర్ రవీష్ మల్హోత్రా ఇరువురూ ఈ యాత్రకు పోటీపడ్డారు, అదృష్టం రాకేష్ శర్మను వరించింది. వీరిరువురూ "జీరో గ్రావిటీ" (భూమ్యాకర్షణా రహితం) శిక్షణపొందారు)
·  ప్రయాణసమయంలో రాకేష్ శర్మ హిమాలయాలలో జలవిద్యుచ్ఛక్తి ప్రాజెక్టులకై ఛాయాచిత్రాలను తీశాడు
·         ప్రయాణంలో రాకేష్ శర్మ 'యోగాసనాలు' చేశారు
·   అంతరిక్ష  ప్రయాణ సమయాన అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ రాకేష్ శర్మను భారతదేశం ఎలా కనిపిస్తుందని అడిగిన ప్రశ్నకు రాకేష్ శర్మ సారే జహాఁ సే అచ్ఛా హిందూస్తాఁ హమారా అని సమాధానం చెప్పి దేశభక్తిని చాటిచెప్పారు.
·    రోదసీ నుండి తిరిగొచ్చాక రష్యా ఇతన్ని "హీరో ఆఫ్ సోవియట్ యూనియన్" అనే బిరుదు ఇచ్చి గౌరవించింది. భారతదేశం అశోక చక్ర అవార్డులతో సత్కరించింది.
·  రాకేష్ శర్మ ప్రస్తుతం పదవీ విరమణ పొందారు.ప్రస్తుతం బెంగళూరులో  నివసిస్తున్నారు.

ఈయన జీవితకథ,అంతరిక్ష యాత్ర పై బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఒక సినిమా చేయనున్నట్లు ప్రకటించారు.

రాకేశ్ శర్మ ఆనాటి అంతరిక్ష యాత్ర గురించి వివరిస్తున్న వీడియో(అంతరిక్షం నుంచి ప్రధాని ఇందిరాగాంధీ తో మాట్లాడుతున్న దృశ్యాలు కూడా చూడవచ్చు):
Comments

Popular Posts