మనం రోజు స్నానానికి వాడే సబ్బు (BATH SOAP) ను కొనేటప్పుడు ఏ ప్రాతిపదిక మీద ఎంచుకోవాలి?

మనం రోజు స్నానానికి వాడే సబ్బు (BATH SOAP) ను కొనేటప్పుడు ఏ ప్రాతిపదిక మీద  ఎంచుకోవాలి? ఏ సబ్బు వాడినా అది శరీరాన్ని పరిశుభ్రంగా ఉంచుతుందని ఎలా చెప్పగలరు? సదరు కంపెనీ ఇచ్చే యాడ్‌ని చూసా? కాదు. ఎందుకంటే లాభాపేక్ష కోసం కంపెనీలు ఎన్నో రకాల ప్రకటనలు ఇచ్చి వినియోగదారులను ఆకట్టుకుంటాయి. అయితే సబ్బు ఎంత సమర్థవంతమైనది, ఎంత నాణ్యంగా పనిచేస్తుంది, ఎంతటి శుభ్రతనిస్తుంది ఎలా తెలుసుకోవడం?
మీరు వాడుతున్న సబ్బు ప్యాకింగ్‌ను ఒక్కసారి సరిగ్గా గమనించండి. దానిపై టీఎఫ్‌ఎం(TFM) 70శాతం, 67 శాతం, 82 శాతం అని రాసుందా? అదే సబ్బు నాణ్యతను ధ్రువీకరిస్తుంది.
అసలు టీఎఫ్‌ఎం అంటే ఏమిటి? టీఎఫ్‌ఎం (TFM) అంటే టోటల్ ఫ్యాటీ మ్యాటర్(TOTAL FATTY MATTER). అంటే ఈ టీఎఫ్‌ఎం శాతం ఎంత ఎక్కువగా ఉంటే ఆ సబ్బు అంతటి నాణ్యమైన గుణాలను కలిగి ఉంటుందని అర్థం.
భారతీయ ప్రమాణాల బ్యూరో (బీఐఎస్) ప్రకారం సబ్బులను 3 రకాలుగా విభజించారు. అవి గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3.
76 అంతకు మించి శాతం ఉన్నవి గ్రేడ్ 1 సబ్బులు.
70 నుంచి 75 వరకు టీఎఫ్‌ఎం ఉంటే అవి గ్రేడ్ 2 సబ్బులు.
60 నుంచి 70 శాతం మధ్యలో టీఎఫ్‌ఎం ఉన్నవి గ్రేడ్ 3 సబ్బులు.
గ్రేడ్ 2,3 సబ్బుల్లో ఫిల్లర్లు అధికంగా ఉంటాయి. ఇవి సబ్బు రూపంలో మామూలుగానే కనిపిస్తాయి. కాకపోతే వీటిలో శరీరానికి హాని కలిగించే పదార్థాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సబ్బుల్లో ఆస్బెస్టాస్ వంటి రసాయనాలు కూడా అధికంగానే ఉంటాయి. వీటిని వాడితే చర్మానికి హాని కలుగుతుంది.
గ్రేడ్ 2,3 సబ్బులు నీటిలో కలిసిప్పుడు మెత్తగా అయిపోయి చాలా త్వరగా అరిగిపోతాయి. నురగ ఎక్కువ వచ్చినా వాటిని నాసిరకం సబ్బులుగానే పరిగణించాలి. ఎలాంటి చర్మం ఉన్నవారికైనా గ్రేడ్ 1 సబ్బే మంచిది. ఎందుకంటే ఈ సబ్బులు చర్మానికి మృదుత్వాన్ని ఇస్తాయి. దీంతోపాటు అధిక శుభ్రతను కలగజేస్తాయి. అదనపు కెమికల్స్ లేకుండానే సువాసనను ఇస్తాయి.

కాబట్టి, ఇక నుంచి మీరు సబ్బు కొనే ముందు దాని నురగను, సువాసనను చూసి కొనకండి. దాని ప్యాక్‌పై ఉన్న టీఎఫ్‌ఎం విలువను చూసి కొనండి.

Comments

Popular Posts