ఇంట్లో బీరువా ఏ దిక్కులో అమర్చుకుంటే లక్షీదేవి అనుగ్రహం కలుగుతుంది

బీరువా ఎప్పుడూ నైరుతి (అనగా అంటే దక్షిణానికి పడమరకు మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం) లోనే ఉండాలి. బీరువా తలుపులు తెరిచినప్పుడు అది ఉత్తరం వైపు చూస్తూ వుండాలి. అలాగే బీరువా తెరవగానే చక్కని సువాసన రావాలి. అలాకాకుండా పాతబట్టల వాసన లేదా బొద్దింకలు గుడ్లు పెట్టిన వాసన వస్తే ఆ ఇంట లక్ష్మీదేవి నివాసం ఉండదట. అలాగే కుబేర ముగ్గును ఒక పేపర్ పై నీలం రంగు పెన్నుతో వేసి, ఆ ముగ్గును బీరువా లోపలి అరలో పెట్టుకోవాలి.ఈ ముగ్గుకు నాలుగు వైపులా పసుపు, కుంకుమ బొట్టు పెట్టాలి. ఈ కుబేరముగ్గు మీద బంగారాన్ని, డబ్బును పెట్టుకుంటే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందట. అలాగే రాగి లేదా వెండి గిన్నెలో పూజా సామగ్రి దుకాణంలో దొరికే అమ్మే వట్టివేళ్లు, పచ్చకర్పూరము లాంటి సుగంధ ద్రవ్యాల్ని పెట్టి బీరువాలో పెట్టుకోవాలి.

Comments

Popular Posts