పరగడుపున వెల్లుల్లి తింటే హై బీపీ ,డయాబెటిస్, టీబీ ఇంకా ఎన్నో జబ్బుల నుంచి ఉపశమనం కలుగుతుంది

వెల్లుల్లిని ఆహారం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనే సంగతి మనందరికీ తెలిసిందే. వంటల్లో వెల్లుల్లిని వాడటం వల్ల వాటికి అదనపు రుచి చేకూరుతుంది. ఇందులో ఉండే ఔషద గుణాలు జలుబు, ఫ్లూ, జ్వరం, హై బీపీ నివారణకు ఉపయోగపడుతుంది. ఒంట్లో పేరుకుపోయిన కొవ్వు కరగడానికి కూడా వెల్లుల్లి ఉపయోగపడుతుంది. వెల్లులిని ఆహారంగా తీసుకోవడం ద్వారా గుండెపోటు ముప్పు తగ్గడంతోపాటు ధమనులు మూసుకుపోవడం, గట్టిపడటం లాంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి. వెల్లుల్లి వివిధ రకాల క్యాన్సర్ల బారి నుంచి కాపాడుతుంది.

ఉదయాన్నే పరగడపున వెల్లుల్లి తీసుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలు చేకూరతాయి. పొద్దున్నే ఏమీ తినకుండా వెల్లుల్లిని తినే విషయంలో కొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తుంటారు. కానీ ఖాళీ కడుపుతో వెల్లుల్లి తినడం వల్ల సహజ యాంటీ బయోటిక్‌గా పని చేస్తుంది. ఇందులోని యాంటీ బయోటిక్ గుణాలు జీర్ణాశయంలో ఉండే బ్యాక్టీరియాలను నాశనం చేస్తాయి.

పరగడపున వెల్లుల్లి తినడం వల్ల హై బీపీ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. రక్త ప్రసరణ మెరుగుపర్చి గుండె జబ్బులను తగ్గిస్తుంది. కాలేయం, మూత్రాశయ పనితీరు కూడా మెరుగు పడుతుంది. ఒత్తిడిని తగ్గించడానికి, డయేరియాను అధిగమించడానికి వెల్లుల్లి చక్కటి మందులా పని చేస్తుంది.

ఒంట్లోని విష పదార్థాలను బయటకు పంపే శక్తివంతమైన ఆహార పదార్థాల్లో వెల్లుల్లి ఒకటి. పొద్దున్నే వెల్లులి తినడం వల్ల కడుపులో ఉండే నులిపురుగులు నశిస్తాయి. డయాబెటిస్, డిప్రెషన్, విష జ్వరాల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.

టీబీ, న్యూమోనియా, జలుబు, ఊపిరితిత్తుల్లో కఫం చేరడం, ఆస్తమా, దగ్గు తదితర సమస్యలకు ఇది చక్కటి ఔషధంగా పని చేస్తుంది. టీబీతో బాధపడే వారు రోజుకు ఒక వెల్లిపాయను పూర్తిగా తినడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఒకేసారి కాకుండా వీలైనప్పుడల్లా తింటుండాలి. పచ్చిది తినలేనివారు ఓవెన్‌లో రంగు మారే వరకూ వేడి చేసుకొని తినొచ్చు.

వెల్లుల్లి అంటే అలర్జీ ఉన్నవారు పచ్చి వెల్లిపాయ తినకపోవడం మంచిది. చర్మంపై దద్దుర్లు వచ్చినా, ఒళ్లు వెచ్చగా ఉన్నా లేదా తలనొప్పి వస్తున్నా.. పరిగడపున వెల్లుల్లి తినడం మానేయాలి.
చేతి వేలు పూర్తిగా కట్ అయినట్లయితే, ఆ భాగాన్ని శుభ్రంగా కడిగి ప్లాస్టిక్ కవర్‌లో చుట్టి, ఐస్‌కవర్‌లో పెట్టుకుని వీలైనంత త్వరగా ఆస్పత్రికి వెళ్లాలి. ప్రమాదం జరిగిన 6 నుంచి 8 గంటలు లోగా ఆస్పత్రికి చేరుకునేలా చూసుకోవాలి. సరైన సమయంలోగా ఆస్పత్రికి చేరుకుంటే సర్జరీ ద్వారా తెగిన వేలును అతికించే అవకాశం ఉంటుంది.

ఆ గాయాన్ని శుభ్రంగా కడుక్కుని, రక్తస్రావం కాకుండా కట్టు కట్టుకుని ఆధునిక సదుపాయాలున్న ఆస్పత్రికి వెళితే ఉపయోగం ఉంటుంది. అక్కడ వైద్యులు రక్తనాళాల పరిస్థితి ఎలా ఉంది? కండరాలు ఎంత మేరకు కట్ అయ్యాయి? టెండాన్స్ ఎలా ఉన్నాయి? తదితర విషయాలను పరిశీలించి అవసరమైన చికిత్సను అందిస్తారు.

చేయి పూర్తిగా కట్ అయినప్పుడు కూడా సమయంలోగా ఆస్పత్రికి వస్తే ఆపరేషన్ చేసి చేయి పోకుండా కాపాడే వీలుంది. నరం కట్ అయి చేతి స్పర్శ కోల్పోయినపుడు నరాన్ని తిరిగి అతికించడం ద్వారా పోయిన స్పర్శ వచ్చేలా చేయవచ్చు. కండరం బాగా దెబ్బతింటే ఇతర భాగంలో నుంచి కండరం తీసుకుని సర్జరీ ద్వారా అమర్చడం జరుగుతుంది. దీన్ని ఫ్లాప్ సర్జరీ అంటారు.

రొడ్డు ప్రమాదాల్లో గాయపడ్డ వారికి చేతులు, కాళ్లు బాగా గీరుకుపోయి ఉంటాయి. లోతైన గాయాలు ఏర్పడతాయి. అటువంటి వారికి ఈ సర్జరీ బాగా ఉపయోగపడుతుంది. ఈ చికిత్సలతో అవయువాలు పనితీరు కోల్పోకుండా కాపాడవచ్చు.


Comments

Popular Posts